పండగ రుచులు | Festival of flavors | Sakshi
Sakshi News home page

పండగ రుచులు

Published Mon, Oct 19 2015 11:41 PM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

పండగ రుచులు - Sakshi

పండగ రుచులు

కొత్త కొత్త వంటలు చేసుకునే పండుగ...
కొత్త బట్టలు ధరించే పండుగ...ఇంతేనా...
కొత్త అల్లుళ్లతో ఇళ్లన్నీ కళకళలాడే పండుగ...
మరద ళ్లు సరదాగా బావలను ఆటపట్టించే పండుగ...
ఇంటికి వచ్చిన అల్లుడికి ఆప్యాయంగా
రకరకాల రుచులు వడ్డించి, ఆప్యాయతలు పంచండి...
రెండోసారి మీ ఇంటికి అల్లుడుగా కాదు,
కొడుకుగా వస్తాడు...

 
గులాబి గుత్తులు
కావలసినవి: మైదా పిండి - అర కేజీ, బియ్యప్పిండి - పావు కేజీ, కొబ్బరి పాలు - తగినన్ని, పంచదార - పావు కేజీ, ఉప్పు - చిటికెడు, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ: ఒక పాత్రలో మైదాపిండి, బియ్యప్పిండి, ఉప్పు వేసి కలపాలి కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి తగినన్ని నీళ్లు జత చేసి, పల్చటి వస్త్రంలో వడక డితే కొబ్బరిపాలు వస్తాయి

కొబ్బరిపాలలో పంచదార వేసి కరిగేవరకు గరిటెతో కలపాలి  మైదాపిండి మిశ్రమంలో కొబ్బరి పాలు కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా పిండిని చిక్కటి బజ్జీలపిండిలా కలపాలి  బాణలిలో నూనె వేసి కాచాలి  గులాబి పువ్వుల గుత్తిని నూనెలో ముంచి కాలిన తర్వాత, ఆ గుత్తిని పిండిలోకి సగం వరకు మాత్రమే మునిగేలా ముంచి, ఆ గుత్తిని నూనెలో ముంచాలి కాసేపటికి పువ్వు నూనెలో పడుతుంది అలా పిండి మొత్తం చేసుకోవాలి (ఇవి చేసేటప్పుడు ఇద్దరు ఉంటే, మాడిపోకుండా దోరగా వస్తాయి).
 
గుమ్మడికాయ ముక్కల పులుసు
కావలసినవి: గుమ్మడికాయ
ముక్కలు - కప్పు (తీపి గుమ్మడి), ఆనపకాయ ముక్కలు - రెండు (పెద్ద సైజువి), మునగకాడ ముక్కలు - 4, ఉల్లిపాయలు - 6, చిలగడ దుంప ముక్కలు - 4, టొమాటో - 4, పచ్చి మిర్చి - 6, ఎండు మిర్చి - 6, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, ఇంగువ - కొద్దిగా, పసుపు - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - 2 టీ స్పూన్లు, కొత్తిమీర - చిన్న కట్ట, కరివేపాకు - 2 రెమ్మలు, చింతపండు రసం - 2 టేబుల్ స్పూన్లు (చిక్కగా ఉండాలి), బియ్యప్పిండి - టేబుల్ స్పూను (చల్లనీళ్లలో వేసి చిక్కగా కలపాలి)
 
తయారీ: ముందుగా కూరముక్కలకు తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి ఉడికించాలి  చింతపండు రసం జత చేసి పులుసు మరిగించాలి బియ్యప్పిండి నీళ్లు జత చేయాలి  బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించి పులుసులో వేయాలి  కొత్తిమీర, కరివేపాకు వేసి ఒక పొంగు రానిచ్చి దింపేయాలి.
 
చింతచిగురు పప్పు
కావలసినవి: చింతచిగురు - కప్పు, కందిపప్పు - కప్పు, పచ్చి మిర్చి - 6, ఎండు మిర్చి - 6, ఉల్లి తరుగు - పావు కప్పు, సెనగ పప్పు - టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - 6 గింజలు, ఇంగువ- పావు టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - తగినంత, కారం - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 8, కరివేపాకు - 3 రెమ్మలు, కొత్తిమీర - చిన్న కట్ట
 
తయారీ: ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. (సుమారు ఏడెనిమిది విజిల్స్ రావాలి)  బాణలిలో నూనె వేసి కాగాక సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేయించాలి  ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి వెల్లుల్లి రేకలు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి జత చేసి మరోమారు వేయించాలి  చింత చిగురు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి సుమారు పది నిమిషాలు మగ్గించాలి  ఉడకబెట్టిన కందిపప్పు, కరివేపాకు, పసుపు వేసి బాగా కలిపి సుమారు ఐదు నిమిషాలు ఉంచాలి  కొత్తిమీర వేసి దింపేయాలి.
 
భీండీ 65
కావలసినవి: బెండకాయలు - పావు కిలో, కారం - అర టీ స్పూను, పసుపు - కొద్దిగా, ఆమ్ చూర్ పొడి - అర టీ స్పూను (నిమ్మ ఉప్పు కూడా వాడుకోవచ్చు), గరం మసాలా - అర టీ స్పూన్లు, సెనగ పిండి - 2 టేబుల్ స్పూన్లు, బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
 
తయారీ: ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తడిపోయేవరకు నీడలో ఆరబెట్టాలి  ముక్కలు పొడవుగా తరగాలి   మసాలా దినుసులన్నీ ఒకదాని తరవాత ఒకటి బెండకాయ ముక్కల మీద చల్లి, జాగ్రత్తగా కిందికి పైకి కలపాలి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరోమారు కలపాలి  చివరగా సెనగ పిండి, బియ్యప్పిండి చల్లి (నీరు జత చేయకూడదు) అన్నిపదార్థాలు కలిసేలా జాగ్రత్తగా కింది నుంచి పైకి కలిపి, సుమారు పావుగంట సేపు పక్కన ఉంచాలి  బాణలిలో నూనె వేడయ్యాక తయారుచేసి ఉంచుకున్న బెండకాయలను వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి టిష్యూ నాప్‌కిన్ మీదకు తీసుకోవాలి (అధికంగా ఉన్న నూనెను పీల్చేస్తుంది)  చివరగా గరం మసాలా లేదా చాట్ మసాలా చ ల్లి వేడివేడి అన్నంతో వడ్డించాలి.
 
కొబ్బరి -మామిడికాయ పచ్చడి
కావలసినవి: కొబ్బరి తురుము - కప్పు, మామిడి తురుము - అర కప్పు, ఎండుమిర్చి - 6, పచ్చి మిర్చి - 6, సెనగ పప్పు - టేబుల్ స్పూను, మినప్పప్పు - టేబుల్ స్పూను, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, మెంతులు - పావు టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, ఇంగువ - పావు టీ స్పూను, కరివేపాకు - 2 రెమ్మలు, నూనె - టేబుల్ స్పూను
 
తయారీ: బాణలిలో నూనె వేసి కాగాక సెనగ పప్పు, మినప్పప్పు వేసి వేయించాలి  ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి వేసి వేయించి చల్లార్చాలి మిక్సీలో ముందుగా పోపు వేసి మెత్తగా పొడి చేయాలి  కొబ్బరి తురుము, మామిడికాయ తురుము, పచ్చి మిర్చి, ఇంగువ, పసుపు, ఉప్పు జత చేసి మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టాలి  గిన్నెలోకి తీసుకుని కరివేపాకు జత చేసి బాగా కలపాలి  కమ్మటి నెయ్యి, వేడివేడి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది.
 
కట్ పొంగల్
కావలసినవి: బియ్యం - కప్పు, పెసర పప్పు - కప్పు, మిరియాల పొడి - 2 టీ స్పూన్లు, ఉప్పు - కొద్దిగా, జీడిపప్పు - 25 గ్రా., నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు
తయారీ: ఒక గిన్నెలో బియ్యం, పెసర పప్పు వేసి బాగా కడిగి, ఆరు కప్పుల నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఆరు విజిల్స్ వచ్చాక దింపాలి  బాణలిలో నెయ్యి కరిగాక మిరియాల పొడి, జీడిపప్పు వేసి దోరగా వేయించి తీసేయాలి  ఉడికించిన బియ్యం పెసరపప్పు మిశ్రమంలో కొద్దిగా ఉప్పు, జీడిపప్పు, మిరియాల పొడి వేసి కలిపి, కొబ్బరి పచ్చడితో అందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement