
సూర్యం ఇంటికి వెళ్లాలి. పట్నంలో చదువుకుంటున్న అతను ఆర్నెల్లకొకసారి ఊరొస్తూ ఉంటాడు. ఈసారి భారీ వర్షం కురుస్తోంది. రోడ్డంతా చిత్తడి చిత్తడిగా ఉంది. ఊరవతల వరకే రవాణా సౌకర్యం ఉంది. ఇప్పుడతను ఊర్లోకి నడిచెళ్లాలి. వర్షం తగ్గేవరకూ ధర్మన్న ఇంటిముందు ఆగితే సరిపోతుందనుకున్నాడు. ధర్మన్న కాటికాపరి. ఆ ఊరి శ్మశానం పక్కనే చిన్న గుడిసెలాంటి ఇంట్లో ఉంటాడు. ‘‘దార్లో నీకేమైనా ఆ సుబ్బిగాడు కనిపించాడా?’’ అనడిగాడు ధర్మన్న, సూర్యాన్ని ఇంట్లోకి పిలుస్తూ.
సుబ్బిగాడు చచ్చి ముప్ఫై సంవత్సరాలవుతోంది. అప్పుడప్పుడు చుట్టుపక్కల కనిపిస్తూంటాడని ఊర్లో వాళ్లంతా కథలు కథలుగా చెప్పుకుంటారు. ఎవరు ఆ సుబ్బిగాడు? చనిపోయాక కూడా ఎలా కనిపిస్తున్నాడు? ధర్మన్న ఆ రాత్రి, ఆ వర్షంలో సూర్యానికి చెప్పిన కథేంటీ? చదవండి.. ‘అబద్ధపు బాణం’ కథలో...
Comments
Please login to add a commentAdd a comment