25 అక్టోబర్ 1990 తొలి లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతం
కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ఎ. వాఘన్ స్టేర్న్స్ 12 సంవత్సరాల పాపకు ఆమె తల్లి నుంచి సేకరించిన ఊపిరితిత్తిని అమర్చారు. డాక్టర్ స్టేర్న్స్ పిడియాట్రిక్ కార్డియో థొరాసిక్ సర్జన్‌గా చాలా ప్రసిద్ధి. ఆయన నాలుగు నెలల పాపకు గుండెమార్పిడి చికిత్సతో సహా అప్పటికే ఎన్నో విజయవంతమైన అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చేశారు. నిజానికి హార్ట్- లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంతకు ముందే అంటే 1968 లోనే జరిగింది. అయితే అది విజయవంతం కావడానికి చాలా కాలం పట్టింది.
టొరెంటోలోని జనరల్ హాస్పిటల్‌లో డాక్టర్ బ్రూస్ రియిట్జ్ చేసిన లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జీవన్మృతుల నుంచి సేకరించిన అవయవాల సహాయంతో జరిగింది కాగా, ఇప్పుడు అంటే 1990 అక్టోబర్ 25న డాక్టర్ స్టేర్న్స్ చేసిన ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ రోగి తల్లి జీవించి ఉండగానే ఆమె నుంచి సేకరించడం ద్వారా జరిగింది కావడం విశేషం.