డయాబెటిస్ ఇప్పుడు జీవిత మాధుర్యాన్ని కోల్పోనక్కరలేదు | genetic constitution treatment can cure diabetes | Sakshi
Sakshi News home page

డయాబెటిస్ ఇప్పుడు జీవిత మాధుర్యాన్ని కోల్పోనక్కరలేదు

Published Fri, Nov 1 2013 11:39 PM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM

genetic constitution treatment can cure diabetes

 గత 30 సంవత్సరాలుగా డయాబెటిస్ అనే మాట మనం తరచుగా వింటున్నాం. అంతకుముందు డయాబెటిస్ లేదా... అంటే ఉండేది. కాని చాలా తక్కువ మందిలో ఈ వ్యాధి కనిపించేది. గత 30 ఏళ్లలో మానవ జీవన విధానంలో అనేక మార్పులు రావడం... ముఖ్యంగా మన శారీరక శ్రమ తగ్గి మానసిక ఒత్తిడి పెరగడం అనేది అతి ముఖ్యమైన కారణం అని చెప్పవచ్చు. మానవ శరీరంలో ఉపయోగపడకుండా మిగిలిపోయిన చక్కెర పదార్థాలు సాధారణ స్థితి కంటే ఎక్కువ మోతాదులో రక్తంలో ఉండటాన్ని డయాబెటిస్ అంటారు. ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్.
 
 డయాబెటిస్ రకాలు
 టైప్ 1: ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్. దీనినే జువైనల్ డయాబెటిస్ అని కూడా అంటారు. ఇది పిల్లలలో ఎక్కువగా ఉంటుంది.
 టైప్ 2: నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్
 టైప్ 3: జెస్టేషనల్ డయాబెటిస్. ఇది గర్భిణులలో కనిపిస్తుంది.
 
 మొదటి రకం డయాబెటిస్ చిన్నవయస్సులో వచ్చే డయాబెటిస్. దీనిలో ఎక్కువశాతం మంది 20 స॥పిల్లలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనినే ‘జువైనల్’ డయాబెటిస్ అంటారు. ఇది శరీరంలోనే క్లోమగ్రంథిలో బేటా సెల్ నుండి వచ్చే ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోవడం వలన వస్తుంది.
 
 రెండవ రకం డయాబెటిస్. ఎక్కువగా 30 సంవత్సరాలు దాటినవారిలో వస్తుంది. దీనికి రెండు కారణాలు.
 
 1. అవసరమైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం.
 
 2. శరీరంలోని కణజాలం ఇన్సులిన్‌ని ఉపయోగించుకోలేకపోవడం ఇది శారీరక శ్రమ తక్కువగా ఉండి, మానసిక ఒత్తిడి అధికం గల వారిలోనూ, ఎక్కువగా రాత్రివేళలో ఉద్యోగాలు చేసే వారైనా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు, కాల్ సెంటర్‌లో మార్కెటింగ్ పని చేసేవారిలో త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.
 
 తల్లిదండ్రులలో ఎవరికైనా ఈ వ్యాధి కలిగి ఉన్న వారి సంతానానికి  స్థూలకాయం ఉన్న వారు కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
 
 డయాబెటిస్ కారణాలు
 శారీరక శ్రమ తక్కువగా ఉండి మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం వలన  
 
 శరీరంలో తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అవడం.  
 
 ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్‌ను శరీరంలోని కణజాలం సంపూర్ణంగా ఉపయోగించుకోకపోవడం. దీనినే ‘ఇన్సులిన్ రెసిస్టెన్సీ’ అంటారు.  
 
 వంశపారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రులలో ఉన్నట్లయితే సంతానానికి ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది   
 
 బి.ఎం.ఐ 30 కంటే ఎక్కువగా ఉన్నవారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 
 ఆటో ఇమ్యూన్ డిసీజ్ వలన కూడా టైప్-1 డయాబెటిస్‌వస్తుంది.  
 
 క్లోమగ్రంథి సిస్టిక్ ఫైబ్రోసిస్ వలన వస్తుంది.  
 
 క్రానిక్ పాంక్రియాటైటిస్ వలన వస్తుంది.
 
 పార్షియల్ పాంక్రియాడక్టమి వలన కూడా వచ్చే అవకాశం ఉంటుంది.  
 
 కొన్నిసార్లు ఎలాంటి కారణాలు లేకుండా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనినే ‘ఇడియోపతిక్’ డయాబెటిస్ అని కూడా అంటారు.
 
 కాంప్లికేషన్స్
 షుగర్ ఉన్న వారు సరైన చికిత్స, జీవన విధానం లోపించడం వలన ఇది ఇతర వ్యాధులకు మూల కారణంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాంప్లికేషన్లలో కొన్ని.
 
 డయాబెటిస్ పుట్  
 డయాబెటిక్ నెఫ్రోపతి  
 డయాబెటిక్ రెటినోపతి  
 డయాబెటిక్ న్యూరోపతి
 

అధిక రక్తపోటు, శరీరంలో కొలస్ట్రాల్ లెవల్స్ పెరగడం  
 ఛాతీనొప్పి, గుండెపోటు  
 పక్షవాతం  
 కాటరాక్ట్ గాస్ట్రిక్ సమస్యలు
 
 రోగ నిర్థారణ పరీక్షలు
 =పాస్టింగ్ బ్లెడ్ షుగర్ (FBS)
 =పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ (PPBS)
 =HBA1C
 =గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్ (GTT)
 =యూరిన్ షుగల్ లెవల్స్
 =రాండమ్ షుగర్ లెవల్స్ (RBS)
 
 వీటితో పాటుగా బ్లడ్ యూరియా లెవల్స్, సీరమ్ క్రియాటినిన్ లెవల్స్, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ మొదలగు పరీక్షలు చేయించడం వలన కచ్చితమైన చికిత్స ఇవ్వడం వీలవుతుంది.
 
 దీర్ఘకాలంలో షుగర్‌వ్యాధి బారిన పడ్డవారిలో శరీరంలోని అనేక రకాల అవయవాలు జబ్బుపడి, ఇతర కాంప్లికేషన్స్‌కు దారి తీస్తుంది. అందువల్ల వీలైనంత వరకు ప్రారంభదశలోనే వైద్యులను కలవడం మంచిది.
 
 రోగ లక్షణాలు
 అధిక దాహం  
 అధిక ఆకలి  
 అధిక మూత్రస్రావం
 బరువు తగ్గడం  
 త్వరగా నీరసం రావడం, పిక్కల్లో నొప్పి రావడం  
 ఒళ్లు నొప్పులు రావడం  
 గాయాలు నయం కాకపోవడం
 ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చర్మవ్యాధులు ఎక్కువగా రావడం.
 శిశ్నం మీద చర్మం పగిలిపోవడం
 సెక్స్ కోరికలు తగ్గిపోవడం
 కాళ్లూ చేతులలో తిమ్మిర్లు రావడం.
 
 హోమియోకేర్ ఇంటర్ నేషనల్ జెనెటిక్ కాంస్టిట్యూషన్ విధానం ద్వారా వ్యక్తిలోని డయాబెటిస్ జబ్బుని కాదు, డయాబెటిస్‌తో ఉన్న వ్యక్తికి చికిత్స చేయడం ద్వారా ఎలాంటి డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా చూడవచ్చు. డయాబెటిస్ గుర్తించిన వెంటనే హోమియోపతి వైద్యంతో సంపూర్ణంగా నయం చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చిన్న వయసులో అధిక ఒత్తిడి వలన వచ్చే స్ట్రెస్ డయాబెటిస్‌ను సంపూర్ణంగా నయం చేయవచ్చు.
 
 డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్
 సి.ఎం.డి.,
 హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
 ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99
 టోల్ ఫ్రీ: 1800 102 2202

 బ్రాంచ్‌లు:  హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement