Juvainal
-
టీనేజర్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: గుర్గావ్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 7 ఏళ్ల బాలుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీనేజర్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. జస్టిస్ ఆర్ఎఫ్ నరిమన్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పంజాబ్- హర్యానా హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. కేసును విచారించిన న్యాయమూర్తులు ‘పిటిషనర్ తరుపు వాదనలు అన్ని మేం విన్నాం. హైకోర్టు ఇచ్చిన తీర్పులో కలగజేసుకోవడానికి మాకు ఏ కారణం కనిపించడంలేదు. అందుకే ఈ కేసును కొట్టి వేస్తున్నాం’ అని పేర్కొన్నారు. నిందితుడి బెయిల్ పిటిషన్‌ను జూన్‌లో పంజాబ్-హర్యానా హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్‌ను పెద్దవాడిగా పరిగణిస్తూ కోర్టు అతనికి ఎలాంటి ఉపశమనాన్ని ఇవ్వడానికి మొగ్గు చూపలేదు. 2019 ఫిబ్రవరి 28 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని, నిందితుడి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 12 కింద పిటిషనర్‌కు ఉపశమనం లభిస్తుందో లేదో తెలుసుకోవడానికి కోర్టుకు తక్కువ అవకాశం ఉంది అని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. 2017 సెప్టెంబర్ 8 న పరీక్షలను వాయిదా వేయించాలని ఒక టీనేజర్ 7 ఏళ్ల బాలుడిని హత్య చేశాడు. ఈ విషయాలను సీబీఐ తన చార్జిషీట్లో పేర్కొంది. కేసు విచారిస్తున్న సీబీఐ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించింది. నిందితుడు ఎటువంటి సానుభూతికి అర్హుడు కాదని పేర్కొంది. చదవండి: రేప్ కేసు: అతడే ప్రధాన నిందితుడు! -
చోరి చేశాడనే అనుమానంతో బాలుడిపై...
సాక్షి, తూర్పుగోదావరి(రాజమహేంద్రవరం) : పాచి పని చేసుకొని జీవించే తల్లి వెంట వెళ్లడమే ఆ బాలుడి చేసిన నేరమైంది. ఇంట్లో నగదు, సెల్‌ఫోన్ చోరీ చేశావంటూ పోలీసులకు ఫిర్యాదు చేయకుండానే తెల్లవారు జామున ఇంటికి వచ్చి తీసుకువెళ్లి ఊచ కాల్చి వాతలు పెట్టిన అమానుష సంఘటన రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం, లక్ష్మి వారపు పేటకు చెందిన మేడబోయిన సీత, అదే ప్రాంతానికి చెందిన రాణి అనే మహిళ ఇంట్లో పాచిపని చేసుకుని జీవిస్తోంది. సీత కుమారుడైన బాలుడు అప్పుడప్పుడూ తల్లితో కూడా రాణి ఇంటికి వెళ్తుంటాడు. ఈ నేపథ్యంలో గురువారం రాణి ఇంట్లో రూ.ఐదు వేల నగదు, ఒక సెల్ ఫోన్ పోవడంతో సీత కుమారుడే తీశాడనే అనుమానంతో శుక్రవారం తెల్లవారు జామున సీత ఇంటికి వచ్చి ఆమె కుమారుడిని తీసుకువెళ్లి నగదు, సెల్ ఫోన్ ఏం చేశావంటూ రాణి, ఆమె అన్నయ్య, తల్లి, పక్కన ఉండే మరో వ్యక్తి కర్రలతో కొట్టారు. అంతటితో ఆగకుండా ఊచ కాల్చి వాతలు పెట్టారు. తనకు ఏమీ తెలియదని చెప్పినా ఆ బాలుడుని విడిచిపెట్టకుండా అమానుషంగా ప్రవర్తించారని అతడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న చైల్డ్‌లైన్ జిల్లా కో ఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని జువైనల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ చోరీ జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలా కాకుండా చట్టాన్ని చేతులోకి తీసుకుని బాలుడిని హింసించడం తగదని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాల నేరస్తులు పరార్
నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ జిల్లా కేంద్రం నాగారం ప్రాంతంలో గల జువైనల్ నుంచి నలుగురు బాల నేరస్తులు పారిపోయారు. ఈ ఘటనలో నిర్లక్ష్యానికి బాధ్యులైన ఇద్దరు సూపర్వైజర్లు సస్పెషన్‌కు గురిఅయ్యారు. ఆలస్యంగా వెలుగుచూసిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగారంలో ప్రాంతంలో గల బాలుర సంక్షేమం, సం స్కరణల సేవలు, వీధి బాలుర సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర పరిశీలక గృహంలో వివిధ నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న బాల నేరస్తులలో నలుగురు ఈనెల 2న పారిపోయారు. కేంద్రంలో హెడ్ సూపర్వైజర్ ప్రభాకర్, సూపర్వైజర్ నాగవేందర్లు విధులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాం తంలో బ్యారక్‌లో ట్యూబ్‌లైట్ వెలగటంలేదని సూపర్వైజర్లు బ్యారక్ గేట్‌ను తెరిచి లోపలకు వెళ్లారు. అయితే బ్యారక్ గేట్ తెరిచేముందు బ్యారక్ గేట్ ముందున్న గేట్‌కు తాళం వేశాకే బ్యారక్ గేట్‌ను తెరుస్తారు. కాగా ఆరోజు రెండు గేట్లు తెరిచి ఉంచి ట్యూబ్‌లైట్‌ను బాగుచేసేందుకు లోపలకు వెళ్లారు. ఇదే అదునుగా భావిం చిన ఓ బాల నేరస్తుడు బ్యారక్ నుంచి బయటకు వచ్చా డు. కొద్ది సేపయ్యాక గమనించిన సూపర్వైజర్లు బ్యారక్ గేట్లను మూసివేయకుండానే బాలుడి కోసం వెతికేందుకు బయటకు వచ్చారు. అదే సమయంలో బ్యారక్‌లో ఉన్న మరో ముగ్గురు బాల నేరస్తులు సైతం అక్కడి నుంచి తప్పించుకు పారిపోయారు. బాలురల ను కోర్టులో హాజరు పరిచేందుకు బయటకు తీసుకెళ్తూ, తిరిగి తీసుకువచ్చే సమయంలో ప్రధాన గేట్‌కు తాళం వేయకుండా సిబ్బంది ఓ ఇనుప చువ్వను అడ్డం పెట్టేవారు. దీనిని గమనించిన బాల నేరస్తుడు గేట్‌వద్దకు పరుగెత్తుకు వచ్చి ఇనుప చువ్వను తొలగించి పారిపోయాడు. అతను పారిపోయిన కొద్ది సేపటికే మరో ముగ్గురు పారిపోయారు. ప్రస్తుతం బ్యారక్‌లో మొత్తం ఆరుగురు బాలనేరస్తులు శిక్ష అనుభవిస్తూన్నారు. వీరిలో ఒకరు పేపీ కోసం ఆదిలాబాద్‌కు వెళ్లగా, మరొక బాలుడు మాత్రం నలుగురు పారిపోయిన వారితో వెళ్లకుండా బ్యారక్‌లోనే ఉండిపోయాడు. పారిపోయే నలుగురిని వారించినా వినలేదని తెలిసింది. బాలుడి కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చిన సూపర్వైజర్లకు బ్యారక్‌లో నుంచి మరో ముగ్గురు పారిపోయారని తెలియటంతో నివ్వెరపోయారు. వెంటనే బాలుర పరిశీలక గృహం సూపరింటెండెంట్ ఆనంద్‌కు విషయం తెలుపటంతో ఆయన వెంటనే అక్కడకు చేరుకున్నారు. పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం బయటకు పొక్కక ముందే బాలురను పట్టుకునేందుకు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు దొరకక పోవడంతో శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. ఈ ఘటనపై సూపరింటెండెంట్ ఆనంద్‌ను ‘సాక్షి’ సంప్రదింరగా శిక్ష అనుభవిస్తున్న నలుగురు బాల నేరస్తులు పారిపోయిన మాటా వాస్తవేమేనని అన్నారు. బాలురు పారిపోయిన రోజే తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసులు మాత్రం బాల నేరస్తులు తప్పించుకు పోయారంటూ తమకు శుక్రవారమే ఫిర్యాదు వచ్చిందన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదయ్య తెలిపారు. ఇదిలా ఉండగా బాల నేరస్తుల పారిపోయిన ఘటనలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని హెడ్ సూపర్వైజరు ప్రభాకర్, సూపర్వైజర్ నాగావేందర్లను వెంటనే సస్పెండ్ చేసినట్లు బాలుర పరిశీలక గృహం సూపరింటెడ్ ఆనం ద్ తెలిపారు. పారిపోయిన బాలనేరస్తుల కోసం గాలిం పు చర్యలు చేపట్టామన్నారు. -
డయాబెటిస్ ఇప్పుడు జీవిత మాధుర్యాన్ని కోల్పోనక్కరలేదు
గత 30 సంవత్సరాలుగా డయాబెటిస్ అనే మాట మనం తరచుగా వింటున్నాం. అంతకుముందు డయాబెటిస్ లేదా... అంటే ఉండేది. కాని చాలా తక్కువ మందిలో ఈ వ్యాధి కనిపించేది. గత 30 ఏళ్లలో మానవ జీవన విధానంలో అనేక మార్పులు రావడం... ముఖ్యంగా మన శారీరక శ్రమ తగ్గి మానసిక ఒత్తిడి పెరగడం అనేది అతి ముఖ్యమైన కారణం అని చెప్పవచ్చు. మానవ శరీరంలో ఉపయోగపడకుండా మిగిలిపోయిన చక్కెర పదార్థాలు సాధారణ స్థితి కంటే ఎక్కువ మోతాదులో రక్తంలో ఉండటాన్ని డయాబెటిస్ అంటారు. ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. డయాబెటిస్ రకాలు టైప్ 1: ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్. దీనినే జువైనల్ డయాబెటిస్ అని కూడా అంటారు. ఇది పిల్లలలో ఎక్కువగా ఉంటుంది. టైప్ 2: నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ టైప్ 3: జెస్టేషనల్ డయాబెటిస్. ఇది గర్భిణులలో కనిపిస్తుంది. మొదటి రకం డయాబెటిస్ చిన్నవయస్సులో వచ్చే డయాబెటిస్. దీనిలో ఎక్కువశాతం మంది 20 స॥పిల్లలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనినే ‘జువైనల్’ డయాబెటిస్ అంటారు. ఇది శరీరంలోనే క్లోమగ్రంథిలో బేటా సెల్ నుండి వచ్చే ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోవడం వలన వస్తుంది. రెండవ రకం డయాబెటిస్. ఎక్కువగా 30 సంవత్సరాలు దాటినవారిలో వస్తుంది. దీనికి రెండు కారణాలు. 1. అవసరమైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం. 2. శరీరంలోని కణజాలం ఇన్సులిన్ని ఉపయోగించుకోలేకపోవడం ఇది శారీరక శ్రమ తక్కువగా ఉండి, మానసిక ఒత్తిడి అధికం గల వారిలోనూ, ఎక్కువగా రాత్రివేళలో ఉద్యోగాలు చేసే వారైనా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, కాల్ సెంటర్లో మార్కెటింగ్ పని చేసేవారిలో త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులలో ఎవరికైనా ఈ వ్యాధి కలిగి ఉన్న వారి సంతానానికి స్థూలకాయం ఉన్న వారు కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ కారణాలు శారీరక శ్రమ తక్కువగా ఉండి మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం వలన శరీరంలో తక్కువ మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అవడం. ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్‌ను శరీరంలోని కణజాలం సంపూర్ణంగా ఉపయోగించుకోకపోవడం. దీనినే ‘ఇన్సులిన్ రెసిస్టెన్సీ’ అంటారు. వంశపారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రులలో ఉన్నట్లయితే సంతానానికి ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బి.ఎం.ఐ 30 కంటే ఎక్కువగా ఉన్నవారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ వలన కూడా టైప్-1 డయాబెటిస్వస్తుంది. క్లోమగ్రంథి సిస్టిక్ ఫైబ్రోసిస్ వలన వస్తుంది. క్రానిక్ పాంక్రియాటైటిస్ వలన వస్తుంది. పార్షియల్ పాంక్రియాడక్టమి వలన కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఎలాంటి కారణాలు లేకుండా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనినే ‘ఇడియోపతిక్’ డయాబెటిస్ అని కూడా అంటారు. కాంప్లికేషన్స్ షుగర్ ఉన్న వారు సరైన చికిత్స, జీవన విధానం లోపించడం వలన ఇది ఇతర వ్యాధులకు మూల కారణంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాంప్లికేషన్లలో కొన్ని. డయాబెటిస్ పుట్ డయాబెటిక్ నెఫ్రోపతి డయాబెటిక్ రెటినోపతి డయాబెటిక్ న్యూరోపతి అధిక రక్తపోటు, శరీరంలో కొలస్ట్రాల్ లెవల్స్ పెరగడం ఛాతీనొప్పి, గుండెపోటు పక్షవాతం కాటరాక్ట్ గాస్ట్రిక్ సమస్యలు రోగ నిర్థారణ పరీక్షలు =పాస్టింగ్ బ్లెడ్ షుగర్ (FBS) =పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ (PPBS) =HBA1C =గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్ (GTT) =యూరిన్ షుగల్ లెవల్స్ =రాండమ్ షుగర్ లెవల్స్ (RBS) వీటితో పాటుగా బ్లడ్ యూరియా లెవల్స్, సీరమ్ క్రియాటినిన్ లెవల్స్, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ మొదలగు పరీక్షలు చేయించడం వలన కచ్చితమైన చికిత్స ఇవ్వడం వీలవుతుంది. దీర్ఘకాలంలో షుగర్వ్యాధి బారిన పడ్డవారిలో శరీరంలోని అనేక రకాల అవయవాలు జబ్బుపడి, ఇతర కాంప్లికేషన్స్‌కు దారి తీస్తుంది. అందువల్ల వీలైనంత వరకు ప్రారంభదశలోనే వైద్యులను కలవడం మంచిది. రోగ లక్షణాలు అధిక దాహం అధిక ఆకలి అధిక మూత్రస్రావం బరువు తగ్గడం త్వరగా నీరసం రావడం, పిక్కల్లో నొప్పి రావడం ఒళ్లు నొప్పులు రావడం గాయాలు నయం కాకపోవడం ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చర్మవ్యాధులు ఎక్కువగా రావడం. శిశ్నం మీద చర్మం పగిలిపోవడం సెక్స్ కోరికలు తగ్గిపోవడం కాళ్లూ చేతులలో తిమ్మిర్లు రావడం. హోమియోకేర్ ఇంటర్ నేషనల్ జెనెటిక్ కాంస్టిట్యూషన్ విధానం ద్వారా వ్యక్తిలోని డయాబెటిస్ జబ్బుని కాదు, డయాబెటిస్తో ఉన్న వ్యక్తికి చికిత్స చేయడం ద్వారా ఎలాంటి డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా చూడవచ్చు. డయాబెటిస్ గుర్తించిన వెంటనే హోమియోపతి వైద్యంతో సంపూర్ణంగా నయం చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చిన్న వయసులో అధిక ఒత్తిడి వలన వచ్చే స్ట్రెస్ డయాబెటిస్‌ను సంపూర్ణంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.