వెన్నెల వెలుగుల్లో ఓ సుందర కట్టడం
తోడున్నవారి కనుల నిండుగా చూడటం ఓ అద్భుతమైతే...
ఆ ఆనందాన్ని తాజ్‌మహల్ పంచుతుంది!
నీలిమబ్బుల దోబూచులాటలో ఓ సాయంత్రం
ఆకాశమంత ప్రేమను కొలిచే సాధనాల కోసం వెతికితే...
ఆ శ్రమను ఈఫిల్ టవర్ మరిపిస్తుంది!
నీటి తుంపరలో ఓ హాస్యపు జల్లును
ఎదనిండా నింపుకోవడమే భాగ్యమైతే...
ఆ భావం ట్రెవి ఫౌంటెన్ తీరుస్తుంది!
ఈ ప్రసిద్ధ ప్రేమ కట్టడాలన్నీ
ఏ దారిలో వెళ్లినా హృదయాలను చేరువచేస్తాయి.
బాంధవ్యపు లోగిలికి సంబరాలను మోసుకొస్తాయి.
ఒళ్ళంతా తుళ్లింత
ప్రపంచ ఫౌంటెన్ కట్టడాల్లో అద్భుతమైనదిగా పేరుగాంచినది ట్రెవి ఫౌంటెన్. ఇటలీలోని ట్రెవి జిల్లాలో ఉంటుంది ఈ కట్టడం. 1629లో ఇటాలీ ఆర్కిటెక్ట్ నికోలా సాల్వీ ఈ కట్టడాన్ని డిజైన్‌చేస్తే, పీయెట్రో బ్రాకీ నిర్మించారు. ఈ నిర్మాణం ఎత్తు 86 అడుగులు, వెడల్పు 49.15 మీటర్లు. ఇక్కడి ఫౌంటెన్లలో బరోక్యూ ఫౌంటెన్ నగరంలోనే అతిపెద్దది. ఇక్కడి ఫౌంటెన్ కొలనులో నాణెం వేస్తే రోమ్‌లో తేలుతుందని ప్రసిద్ధి. ఇక్కడి ఫౌంటెన్ల అందాలు ఎన్నో ఆంగ్ల సినిమాల్లో ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఇది పర్యాటక సందర్శన కట్టడంగానూ పేరుగాంచింది.
సందర్శన సమయం: చీకటిగా ఉండే ఉదయపు వేళలో ఫౌంటెన్ల అందం మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంటుంది.
చూడటానికి పట్టే వ్యవధి: 1-2 గంటలు
అత్యత్భుతమైన ఫొటోలను తీసుకునేవీలుంటుంది. ఫౌంటెన్ దగ్గర నడుస్తూ చుట్టూ వాటి అందాలను వీక్షించవచ్చు.
ఎలా వెళ్లాలి?: అంతర్జాతీయ విమానాల ద్వారా ఇటలీ చేరుకోవాలి. అక్కడ నుంచి టూరిస్టు బస్సుల ద్వారా ట్రెవి చేరుకోవచ్చు.
విదేశీ ప్రేమ: అమెరికన్ డెరైక్టర్ జీన్ నెగులెస్కో ‘త్రీ కాయిన్స్ ఇన్ ది ఫౌంటెన్’ సినిమా తీశారు.
ప్రేమకు చిహ్నం
తాజ్‌మహల్ అనేమాట వింటేనేచాలు. మన మనస్సులలో ఏదో తెలియని ఆనందం. ఒక ప్రేమ కథ. ఒక మధుర చిహ్నం... అనేటటువంటి సంకేతాలు అందుతాయి. ఎన్నో శతాబ్దాలుగా మన మనస్సులలో నాటుకుపోయిన తీపి భావన తాజ్‌మహల్ భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది. ఈ మహల్‌ను షాజహాన్ చక్రవర్తి తన ప్రియమైన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధంగా నిర్మించాడు. ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటైన మన తాజ్ ప్రతి యేటా 7-8 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. ఎక్కువ మంది పర్యాటకులు అక్టోబర్, నవంబర్, ప్రిబవరి చల్లని నెలలో సందర్శిస్తారు.
సందర్శన సమయం: వారంలో శుక్రవారం మినహా అన్నిరోజులూ ఉదయం 6 గం.ల నుంచి సాయంత్రం 6 గం.ల వరకు సందర్శించవచ్చు. పౌర్ణమికి రెండు రోజుల ముందు, తర్వాత రెండు రోజులు కట్టడాన్ని రాత్రి వీక్షణం కోసం అనుమతిస్తారు.
ఎలా చేరాలి? ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఆగ్రా చేరుకోవచ్చు. ఆగ్రాకు విమాన, రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. ఆగ్రా రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్‌పోర్ట్ 3.6 కి.మీ, తాజ్‌మహల్ 5.7 కి.మీ.
విదేశీ ప్రేమ: 18వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు ఇండియాకు వచ్చిన ఆంగ్లేయులెవ్వరూ తాజ్‌మహల్ సౌందర్యాన్ని ఆస్వాదించకుండా తిరిగి వెళ్లలేదు.
ఆకాశమే హద్దు
నిటారుగా నిల్చున్న సైనికునిలా, ఆకాశాన్ని తాకుతోందా అనిపించే అబ్బురపరిచే కట్టడం ఈఫిల్ టవర్. ప్యారిస్‌లో సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్ ప్రదేశంలో నిర్మించిన ఎత్తై ఇనుప గోపురం. దీని ఎత్తు 1050 అడుగులు. 1889 లో గుస్టావ్ ఈఫిల్ అనే ఇంజనీర్ దీన్ని డిజైన్ చేసి, మరో 72 మంది ఇంజనీర్ల సాయంతో ఈఫిల్ టవర్‌ను నిర్మించాడు. ఫ్రాన్స్‌కు మాత్రమే గర్వకారణమైన కట్టడం కాకుండా ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణం ఇది. దేశ, విదేశాల్లో ఈఫిల్ టవర్‌ను పోలిన నమూనాలు 20కి పైగానే ఉన్నాయి.
ఎలా వెళ్లాలి?
అన్ని అంతర్జాతీయ విమానాశ్రాయాల ద్వారా ప్యారిస్ చేరుకోవచ్చు.
హైదరాబాద్ నుంచి న్యూ ఢిల్లీ వెళ్లి, అక్కడ నుంచి విమానంలో ప్యారిస్ చేరుకోవచ్చు. ప్రయాణ సమయం దాదాపు 12 గం.ల 45ని.లు.
రెన్నో అద్భుతాలు...
ప్యారిట్ టూర్ ఓపెన్ బస్‌లో నుంచి నగరాన్ని చుట్టేయవచ్చు. ఈఫిల్ టవర్ దగ్గర లువ్రే మ్యూజియం, అద్భుతమైన పార్కులు, గార్డెన్లు, ఆర్క్ డె ట్రయంఫీ, ఒపెరా హౌజ్‌లను సందర్శించవచ్చు.
విదేశీప్రేమ:
ఈ అపురూప కట్టడాన్ని నిర్మించినప్పటి నుంచి 20 కోట్ల మందికి పైగా ప్రజలు సందర్శించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆ విధంగా ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది సందర్శించిన స్థలంగా ఈఫిల్ టవర్ ప్రఖ్యాతిగాంచింది. ప్రేమికులు ఇష్టపడే ప్రదేశాలలో అగ్రస్థానం లో ఉంది ఈఫిల్‌టవర్!
మది నిండుగ.. కనులపండుగ..
Published Thu, Feb 13 2014 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
Advertisement
Advertisement