గుడ్‌ఫుడ్‌ | good food for health | Sakshi
Sakshi News home page

గుడ్‌ఫుడ్‌

Published Thu, Aug 17 2017 12:09 AM | Last Updated on Sun, Sep 17 2017 5:35 PM

గుడ్‌ఫుడ్‌

గుడ్‌ఫుడ్‌

జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే రోజువారీ ఆహారంలో ఇవన్నీ ఉండాలి.

ప్రోటీన్‌ ఫుడ్‌: పప్పు లేదా కోడిగుడ్లు రోజూ తీసుకోవాలి  
ఐరన్‌ : పాలకూరలోని ఐరన్, మినరల్స్‌ జుట్టు కుదుళ్లను దృఢంగా ఉంచుతాయి.
విటమిన్‌ సి : రోజుకు ఒక నిమ్మకాయ రసం లేదా కమలా, బత్తాయి వంటివి కూడా తీసుకోవచ్చు. సి విటమిన్‌ సమృద్ధిగా అందినప్పుడే దేహం ఇతర పోషకాలను సక్రమంగా గ్రహించగలుగుతుంది.
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్‌లు: బాదం, వాల్‌నట్, అవిసె గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు దట్టంగా పెరిగేలా చేస్తాయి.
మైక్రో న్యూట్రియెంట్స్‌:  గోధుమల వంటి పొట్టుతో కూడిన ధాన్యాల సూక్షపోషకాలుంటాయి.
విటమిన్‌ ఎ: రోజుకు ఒక గ్లాసు క్యారట్‌ రసం తాగితే దేహానికి అవసరమైన ఎ విటమిన్‌ అందుతుంది. ఇది జుట్టు టిష్యూలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
విటమిన్‌ ఇ: జుట్టు కుదుళ్లలోని నూనెలను సమపాళ్లలో ఉంచి పెరుగుదలకు దోహదం చేస్తుంది. పాలకూర, వేరుశనగపప్పు, వెజిటబుల్‌ ఆయిల్స్‌లో విటమిన్‌ ఇ ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement