తామరను తరిమికొట్టవచ్చు
నా వయసు 36. నాకు తొడల మీద, కాళ్ల మీద, పొట్టమీద ఎర్రగా, గుండ్రంగా మచ్చలు వచ్చాయి. ఇవి చాలా దురద పెడుతున్నాయి. నాకు ఈ మచ్చల వల్ల చాలా అసౌకర్యంగా ఉంది. హోమియోలో ఏమైనా మందులు ఉంటే సూచించగలరు.
- పి.అజయ్‌కుమార్, మార్టేరు
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి అది ఎగ్జిమాలా అనిపిస్తోంది.ఇది అలర్జీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఎగ్జిమాను ప్రేరేపించే కారణాలు: వాతావరణ మార్పులు, దురద పుట్టించే ఆహార పదార్థాలు, సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలు, కొన్ని రకాల అలర్జిన్స్ ముఖ్యంగా డస్ట్‌మైట్లు, పెంపుడు జంతువులు, పుప్పొడి, డాండ్రఫ్ మొదలైనవి. ఒత్తిడి వల్ల కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. హార్మోన్ల అసమతుల్యత ముఖ్యంగా స్త్రీలలో ఈ లక్షణాలను మరింత దుర్భరం చేస్తాయి. ఎగ్జిమా ఎక్కువగా ఉబ్బసం, తీవ్రమైన జ్వరాలు, ఇతర శ్వాస సంబంధితమైన అలర్జీల వంటి వ్యక్తిగత చరిత్ర కలిగి ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
శిశువులలో: చర్మంపై దద్దులు ముఖ్యంగా బుగ్గలపై, తలపైన ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి నీటిబుగ్గల మాదిరిగా తయారై, రసికారడం, విపరీతమైన దురద, గోకడం వల్ల చర్మంపై ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి. చిన్నపిల్లలు, యుక్తవయసుల వారిలో ముఖ్యంగా మోచేయి, మోకాలి మడతలలో, మణికట్టు, చీలమండలు, పిరుదులు, కాళ్ల మీద కనిపిస్తుంది.
పెద్దవారిలో ఇది మోకాలు, మోచేయి, మెడభాగాలలో, ముఖంపైన, కళ్లచుట్టూ దద్దుర్లు వస్తాయి. చర్మం పొడిబారడం, దురద, పొక్కులుగా రాలలడం, చర్మం ఇన్ఫెక్షన్లకు గురికావడం వంటివి చూస్తుంటాము. దీనివల్ల ఇన్ఫెక్షన్, మచ్చలు పడటం, హైపో పిగ్మెంటేషన్ లేదా చర్మం పాలిపోవడం.
ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..? వ్యాధి లక్షణాలను దుర్భరం చేసే ప్రేరేపకాలకు దూరంగా ఉండాలి. ఎగ్జిమాల వల్ల వచ్చే పుండ్లను గోకడం, రక్కడం లాంటివి చేయకూడదు. ఎక్కువసార్లు స్నానం చేయడం కాని, ఎక్కువసేపు స్నానం చేయడం కాని చేయకూడదు.
హోమియో చికిత్స: కాన్‌స్టిట్యూషనల్ హోమియోపతిలో భాగంగా సూక్ష్మీకరణ పద్ధతిలో తయారైన హోమియో మందులలో రోగి శరీర రోగనిరోధక కణాలకు పునరుజ్జీవం కల్పించి, దుష్ఫలితాలు లేకుండా ఎగ్జిమాను పూర్తిగా నయం చేయవచ్చు. అన్ని ప్రతికూల పరిస్థితులలో సైతం ఆరోగ్యవంతమైన జీవనం సాగించే విధంగా హోమియో వైద్యం కచ్చితంగా దోహపడుతుంది.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్,
హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
హోమియోపతి కౌన్సెలింగ్
Published Thu, Jul 30 2015 11:08 PM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM
Advertisement
Advertisement