తలుపులు మూస్తే... వాసన!
ఇంటిప్స్
వేసవి సెలువులు. బంధువుల ఇళ్లకు వెళ్లాలని, టూర్లకు వెళ్లాలని పిల్లలు సరదాపడుతుంటారు. అయితే... ఓ వారం రోజులు ఇంటికి తాళం పెడితే... తలుపు తెరిచిన తర్వాత ఏమైంది ఇంటికి? అనిపిస్తుంటుంది. తలుపు తీసిన వెంటనే ఒక్కసారిగా అదోరకమైన వాసన వస్తుంది. రెండు – మూడు రోజుల వరకు ఆ వాసన వదలదు. అలర్జీలు ఉన్న వాళ్లకు ఇది మరీ కష్టం. ఈ కష్టాన్ని గట్టెక్కాలంటే... ఇంటికి తాళం తీసిన వెంటనే... గాలి వెలుతురు రావడానికి అన్ని గదుల తలుపులు, కిటికీలు తెరిచి, కర్టెన్లు పక్కకు తీయాలి. ఆ తరవాత ఒక ప్లేట్‌లో కర్పూరం వెలిగించి అన్ని గదుల్లోకి తిప్పితే వాసనపోతుంది.
ధూప్ స్టిక్ వెలిగించి గదులలో తిప్పాలి లేదా ప్రతి గదిలో ఒక స్టిక్ వెలిగించి పెట్టాలి. ఎలుకల బాధ ఉంటే పుదీన రసంలో దూదిని ముంచి ఎలుకలు తిరిగే చోట కాని కలుగుల దగ్గర కాని పెడితే సరి. ఆ ఛాయలకు కూడా రావు. ఈ పని టూర్ వెళ్లక ముందే చేయాలి.