Summer seasons
-
పుష్ప.. ద ఫైర్!
సాక్షి,కడియం(కాకినాడ): అక్కడి పూలు మదిని దోచుతున్నాయి. సాధారణంగా జూలై చివరి వారం నుంచి డిసెంబరు వరకూ మాత్రమే పువ్వుల రకాలు కనిపిస్తుంటాయి. కడియం నర్సరీల్లో అందుకు భిన్నంగా మండుటెండల్లోనూ పూలు వికసిస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వీటిని సమ్మర్ సీజనల్స్గా నర్సరీ రైతులు వ్యవహరిస్తుంటారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా పూలనిచ్చే పలు రకాల మొక్కలను వీరు అభివృద్ధి చేస్తున్నారు. మన దేశంలోనే వివిధ ప్రాంతాలతో పాటు, ఇతర దేశాల నుంచి కూడా వీటిని దిగుమతి చేసుకుని పెంచుతున్నారు. మొక్కల పెంపకంలో భిన్నత్వాన్ని ప్రదర్శించే ఈ రైతులు కుండీల్లో ఎవెన్యూ రకాల మొక్కలు పెరిగేలా మార్పులు తీసుకువస్తున్నారు. దీంతో ఈ రకాలు పుష్పశోభితంగా కనువిందు చేస్తున్నాయి. ప్రాథమిక దశలో వీటిని పాలిహౌస్‌లు, షేడ్నెట్ల కింద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెంచాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఆ తరువాత ఇతర పూల మొక్కల మాదిరిగానే నేలపై నాటుకోవచ్చంటున్నారు. కుండీల్లో కూడా పెంచుకోవచ్చని చెబుతున్నారు. ఈ మొక్కలకు తగినంత నీటిని అందిస్తే చాలు. సాధారణంగా వేసవిలో నీడనిచ్చే మొక్కలే ఏపుగా ఎదుగుతాయి. కానీ ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్ పూలతో ఏపుగా పెరుగుతుండటం ప్రత్యేకత. ప్రస్తుతం కడియం ప్రాంత నర్సరీ రైతుల వద్ద ఈ మొక్కలు విస్తృతంగా లభిస్తున్నాయి. కొన్ని రకాలకు వేసవి ప్రత్యేకంగానే ఉంటుందని నర్సరీ రైతు తెలిపారు. వేసవిలో కూడా చెట్టు నిండా పువ్వులతో చూడగానే ఆకట్టుకునే అనేక రకాల మొక్కలు ప్రస్తుతం కడియం ప్రాంత నర్సరీల్లో లభిస్తున్నాయన్నారు. ప్రధాన రకాలివీ.. ఏంజిల్వింగ్ బ్రిగ్నోనియా, పింక్పెండా, లెగస్టోమియా ఇండికా, జస్రాంతస్ లిల్లీ, జొకోబినా, యాంజిలోనియా, అగసాంతస్, అమరాంతస్ లిల్లీ, కాక్టస్, రంగూన్ క్రీపర్, టకోమా డ్వార్ఫ్, తబీబియా సలిడా డ్వార్ఫ్ తదితర రకాలు వేసవిలో సైతం ప్రత్యేకంగా పూస్తాయని రైతులు తెలిపారు. -
Biggest Ice Gola: ఈ ఐస్‌గోళా అతిపె..ద్ద..ది.. ధర ఎంతంటే!!
వాన పడితే చాలు వేడి వేడీ బజ్జీలు, పకోడీలు గుర్తుకొస్తాయి. ఇక ఎండాకాలంలో అయితే చల్లని పానియాలు, ఐస్‌క్రీమ్‌లు.. ఎక్కడ కనిపిస్తే అక్కడ వాలిపోతాం. అలాగే ఇతర సీజన్లలో కూడా.. రొటీన్‌కి భిన్నంగా కొత్త రుచుల కోసం ఎప్పుడూ వెదుకుతూనే ఉంటాం! ఋతువుకో రుచన్నమాట. సాధారణంగా వేసవికాలంలో ఏ వీధిలోనైనా ఐస్‌గోళా బండి కనిపిస్తుంది. నలగ్గొట్టిన ఐస్‌ను గోళాకారంలో అమర్చి, నచ్చిన ఫ్లేవర్‌లో, రకరకాల రంగుల్లో భిన్న రుచుల్లో అందిస్తారు. వీటిని పిల్లలు, పెద్దలు ఆహ్లాదంగా ఆస్వాదిస్తారు. ఐస్‌గోళా పాపులర్ రుచుల్లో కలఖట్టా ఫ్లేవర్ ఒకటి. దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎందరో. ఐతే తాజాగా గుజరాత్‌లోని సూరత్‌కి చెందిన ఒక స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి 5 కేజీల అతిపెద్ద ఐస్గోళాను తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ భారీ ఐస్గోళాకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. వేలకొద్ది నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ప్రముఖ ఫుడ్ బ్లాగర్ అమర్ సిరోహి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఈ వీడియోలో దీని తయారీ విధానాన్ని మనం చూడొచ్చు. మూడున్నర కేజీల నలగ్గొట్టిన ఐస్‌ను కోలాకారంలో తయారు చేసిన తర్వాత దీనిపై మ్యాంగో , చాక్లెట్లతో పాటు భిన్న రుచుల చిక్కని ద్రావణాలను పోశారు. దీని పై భాగంలో కేసర్ రబ్రీ, తాజా క్రీమ్‌లను జోడించారు. వీటన్నింటినీ చేర్చడంతో మరికొంచెం పెద్దగా తయారైంది. తర్వాత కోవాను తురిమి, నాలుగు స్పూన్ల ఐస్‌క్రీమ్‌ను పై భాగంలో ఉంచారు. వీటిపై క్రీమ్‌తో మరొక పొరను వేశారు. చివరిగా చెర్రీస్, చాక్లెట్ చిప్స్, బాదం పప్పు, సిరప్‌లతో అలంకరించారు. నోరూరించేలా ఉన్న ఈ ఐస్‌గోళా దేశంలోనే అతిపెద్దదని, 12 మంది తినగల ఈ గోళా ఖరీదు రూ.999లని అమర్ సిరోహి చెప్పుకోచ్చాడు. చదవండి: ఘుమఘుమలాడే బెంగాలీ రొయ్యల ఇగురు, క్యాబేజీ చికెన్.. ఎలా వండాలంటే.. -
ఉత్తరాదిన భానుడి సెగలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలు వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పటికే రావాల్సిన రుతుపవనాలు 2 వారాలుగా ఆగిపోవడంతో వేడి పెరిగింది. దీంతో, ఉత్తర భారతదేశంలో ఇప్పుడు వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఎండల ప్రభావంతో సుమారు 7 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో 90 ఏళ్ల రికార్డు బద్దలైంది. పశ్చిమ దిశ నుంచి వస్తున్న గాలులు వాతావరణంలో వేడిని పెంచాయి. రుతుపవనాల ప్రారంభ దశలో తేలికపాటి వర్షాలతో కాస్త ఉపశమనం పొందిన ప్రజలకు ఇప్పుడు వేడి గాలుల కారణంగా ఉక్కపోతతో అవస్థలు పెరిగాయి. రికార్డు బద్దలు: దేశ రాజధాని ఢిల్లీలో భానుడి ప్రతాపంతో వేడి 90 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. రాజధానిలోని మంగేష్‌పూర్ ప్రాంతంలో గురువారం 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు 1931 జూలై 1న 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. అయితే అదే సమయంలో జూలై మొదటి రోజు 9 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంగా జూన్ చివరి వారంలో రుతుపవనాల ప్రభావం కారణంగా ఉష్ణోగ్రత 37–38 డిగ్రీలుగా ఉంటుంది. కానీ ఈ ఏడాది వేడిగాలుల కారణంగా రుతుపవనాలు ఆలస్యం కావడంతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అంతకుముందు 2012 జూలైలో గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మూడు రోజులుగా ఢిల్లీలో ఉష్ణోగ్రత సుమారు 43 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 7 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. అయితే పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఢిల్లీతోపాటు హరియాణా, చండీగఢ్, యూపీల్లోనూ వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న వేడిగాలులు రుతు పవనాలను అడ్డుకుంటున్నాయి. త్వరలో ఉపశమనం.. రెండు రోజులు ఆలస్యంగా కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు కేవలం 10 రోజుల్లోనే దేశంలోని 80% ప్రాంతాన్ని కవర్ చేశాయి. జూలై 3 నుంచి అరేబియా సముద్రం నుంచి గుజరాత్, రాజస్తాన్ మీదుగా ఢిల్లీ వైపు తేమ గాలులు చేరుకోవడం ప్రారంభమవుతుందని, అప్పుడు ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాల బ్రేక్ జూలై 7 వరకు కొనసాగవచ్చని, ఆ తరువాత బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు ఉత్తర భారతదేశానికి చేరిన తర్వాత రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని అంటోంది. -
తలుపులు మూస్తే... వాసన!
ఇంటిప్స్ వేసవి సెలువులు. బంధువుల ఇళ్లకు వెళ్లాలని, టూర్లకు వెళ్లాలని పిల్లలు సరదాపడుతుంటారు. అయితే... ఓ వారం రోజులు ఇంటికి తాళం పెడితే... తలుపు తెరిచిన తర్వాత ఏమైంది ఇంటికి? అనిపిస్తుంటుంది. తలుపు తీసిన వెంటనే ఒక్కసారిగా అదోరకమైన వాసన వస్తుంది. రెండు – మూడు రోజుల వరకు ఆ వాసన వదలదు. అలర్జీలు ఉన్న వాళ్లకు ఇది మరీ కష్టం. ఈ కష్టాన్ని గట్టెక్కాలంటే... ఇంటికి తాళం తీసిన వెంటనే... గాలి వెలుతురు రావడానికి అన్ని గదుల తలుపులు, కిటికీలు తెరిచి, కర్టెన్లు పక్కకు తీయాలి. ఆ తరవాత ఒక ప్లేట్లో కర్పూరం వెలిగించి అన్ని గదుల్లోకి తిప్పితే వాసనపోతుంది. ధూప్ స్టిక్ వెలిగించి గదులలో తిప్పాలి లేదా ప్రతి గదిలో ఒక స్టిక్ వెలిగించి పెట్టాలి. ఎలుకల బాధ ఉంటే పుదీన రసంలో దూదిని ముంచి ఎలుకలు తిరిగే చోట కాని కలుగుల దగ్గర కాని పెడితే సరి. ఆ ఛాయలకు కూడా రావు. ఈ పని టూర్ వెళ్లక ముందే చేయాలి.