ఇంటెక్స్ ఆక్వా వై2ప్రో... | INTEX Aqua y 2 Pro | Sakshi
Sakshi News home page

ఇంటెక్స్ ఆక్వా వై2ప్రో...

Published Wed, Oct 8 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

ఇంటెక్స్ ఆక్వా వై2ప్రో...

ఇంటెక్స్ ఆక్వా వై2ప్రో...

దేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇంటెక్స్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌తో నడిచే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇంటెక్స్ ఆక్వా వై2ప్రో పేరుతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.4,333 ధరతో బడ్జెట్ శ్రేణిలో ఉండటం విశేషం. ఇందుకు తగ్గట్టుగానే దీంట్లో ఒక గిగాహెర్ట్జ్ డ్యుయెల్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీంట్లో ర్యామ్ 512 మెగాబైట్లు మాత్రమే కాగా, ప్రధాన మెమరీ నాలుగు జీబీలుగా ఉంది.

మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా దీన్ని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ఇక కెమెరా విషయానికొస్తే ప్రధాన కెమెరా రెజల్యూషన్ 5 ఎంపీ మాత్రమే. సెల్ఫీ కెమెరా 0.3 ఎంపీ రెజల్యూషన్ కలిగి ఉంది. ప్రధాన కెమెరాలో ఆటో పనోరమిక్ ఫీచర్ ఉండటం విశేషం. ఆక్వా వై2 ప్రో స్క్రీన్ సైజు 4.5 అంగుళాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement