
గుజరాత్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలూ వచ్చాయి. అయితే పోలింగ్ జరగక ముందే, ఫలితాలు రాకముందే మణిశంకర్ అయ్యర్ అనే కాంగ్రెస్ పార్టీ లీడర్ జోస్యం చెప్పేశారు.. బీజేపీనే గెలుస్తుందని! ఆయన జోస్యం నిజమైంది కూడా!! అయితే అయ్యర్‌గారు డైరెక్టుగా బీజేపీ గెలుస్తుందని చెప్పలేదు. మోదీని ‘నీచ్’ అని తిట్టి, తనకేం తెలీనట్లు ఊరుకున్నాడు. ఆ తిట్టే చివరికి మోదీని గెలిపించింది. అయ్యర్ తిట్టుకు గుజరాత్ ప్రజలు హర్ట్ అయి, కాంగ్రెస్‌ని ఓడించి, బీజేపీని గెలిపించారని ఎనాలిసిస్. మోదీని ‘నీచ్’ అన్నందుకు రాహుల్‌గాంధీ ఇమీడియట్‌గా పార్టీ నుంచి అయ్యర్‌ను తొలగించినా ఆ ఎఫెక్ట్ ఏమీ కనిపించలేదు.
పైపెచ్చు, ఎన్నికల ఫలితాలు వచ్చాక అయ్యర్‌కి బీజేపీ సర్కిళ్లలో గౌరవం పెరిగింది. రెండుమూడు రోజులుగా అయ్యర్ ఇంటి ముందు బీజేపీ నేతలు క్యూ కట్టి మరీ ఆయనకు స్వీట్ ప్యాకెట్ ఇచ్చి, ధన్యవాదాలు సమర్పించి వస్తున్నారు. కొందరైతే స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి మరీ, అందులోంచి లడ్డూలు తీసి అయ్యర్‌కి తినిపిస్తున్నారు! కాంగ్రెస్ నేతలకు ఈ సంగతి తెలిసి అయ్యర్‌ను వెంటనే బీజేపీలో చేరిపోయి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి పాటుపడమని ఆల్రెడీ వర్తమానం పంపారట!
Comments
Please login to add a commentAdd a comment