Mani Shankar Iyer
-
Respect Pakistan: అయ్యర్ వీడియో కలకలం
న్యూఢిల్లీ: వరసబెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేతల జాబితాలో మణిశంకర్ అయ్యర్ చేరిపోయారు. దక్షిణభారత వాసులు ఆఫ్రికన్లలా ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్యామ్ పిట్రోడా వివాదం ముగిసేలోపే అయ్యర్ పాత వీడియో ప్రస్తుతం బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిపోయింది. పాక్ పట్ల కాంగ్రెస్ పక్షపాత ధోరణి మరోసారి బట్టబయలైందని బీజేపీ దుమ్మెతిపోయగా అవి అయ్యర్ వ్యక్తిగత అభిప్రాయాలని, పారీ్టతో సంబంధం లేదని కాంగ్రెస్ ఖరాకండీగా చెప్పేసింది. అయ్యర్ అన్నదేంటి? ఏప్రిల్‌లో ‘చిల్పిల్ మణిశంకర్’ పేరిట జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయ్యర్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ‘‘ పొరుగుదేశమైన పాకిస్తాన్‌కు మనం గౌరవం ఇవ్వాల్సిందే. ఎందుకంటే అది కూడా సార్వ¿ౌమ దేశమే. దాయాది దేశంతో తగాదాలకు పోతే భారత్‌పై అణుబాంబు వేయాలనే దుర్బుద్ధి పాక్ పాలకుల్లో ప్రబలుతుంది. పాక్‌తో కఠినంగా వ్యవహరించొచ్చు. కానీ చర్చలైతే జరపాలికదా. సరిహద్దుల్లో తుపాకీ పట్టుకుని తిరిగినంతమాత్రాన ఒరిగేదేమీ ఉండదు. ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతాయి. పాక్‌లో పిచ్చోడు అధికారంలోకి వస్తే భారత్‌కు ప్రమాదమే కదా. పాక్ వద్ద కూడా అణుబాంబులు ఉన్నాయి. మన అణుబాంబును లాహోర్‌లో పేలిస్తే తిరిగి దాని రేడియోధారి్మక ప్రభావం కేవలం ఎనిమిది సెకన్లలోనే మన అమృత్సర్పై పడుతుంది. అందుకే పాక్‌తో చర్చల ప్రక్రియ మొదలెట్టాలి’’ అని అన్నారు. -
నిజంగానే అంత చెడ్డ దేశమా?!
‘‘పాక్ పాలకులపై ఆగ్రహంతో మనం ఎందుకని పాకిస్తాన్ పౌరులకు వీసాలను తిరస్కరిస్తున్నాం? పాకిస్తానీయులందరూ జిహాదీలేనని మనం నమ్ముతున్నామా? పాకిస్తానీ జనాభాలోని 99.99 శాతం మందికి ఏ మాత్రం సంబంధం లేని ఉగ్రవాద చర్యలకు ప్రతీకారం తీర్చుకోవడానికి సంఝౌతా ఎక్స్‌ప్రెన్‌ను ఎందుకు రద్దు చేయాలి? పాకిస్తానీయులను భారతదేశంలోని తమ బంధువులతో కలవనీయకుండా చేస్తే హురియత్ తన ఆజాదీ పిలుపును విరమించుకుంటుందని నిజంగానే మనం భావిస్తున్నామా?’’... ఈ ప్రశ్నలన్నిటినీ మనం ఎదుర్కోవలసిన అవసరం ఉందని మణి శంకర్ అయ్యర్ తన ఆత్మకథలో రాశారు. కరాచీలో కాన్సుల్–జనరల్‌గా ఆయన నాలుగేళ్ల కాలాన్ని పొందుపరచిన అధ్యాయం... మనవాళ్లలో చాలామంది శత్రువుగా భావించే దేశంలోని ప్రేమ, అవగాహనలను తెలియబరుస్తుంది. మణి శంకర్ అయ్యర్ ఆత్మకథలోని మొదటి సంపుటం గురించి నా అభిప్రాయం ఏంటంటే – చెప్పడంలోని సొగసంతా క్లుప్తతలోనే ఉంటుందన్న మాటపై ఆయనకు నమ్మకం లేదని. ‘మెమోయిర్స్ ఆఫ్ ఎ మావెరిక్’లోని ప్రారంభ అధ్యాయాలు మరీ అంత మితిమీరిన సమాచారంతో ఉండవలసింది కాదు. ఉల్లాసమైనవీ విసుగు తెప్పించేవీ, ఆసక్తికరమైనవీ అసంబద్ధమైనవీ, హాస్యభరితమైనవీ నిస్సారమైనవీ... అన్నిటినీ కూడా అయ్యర్ తనకు సాధ్యమైనంతగా వివరాలతో కిక్కిరిసిపోయేలా చేశారు. అందంగా రాశారు, అందులో సందేహం లేదు. కానీ అవస రంలేని దీర్ఘమైన నిరంతరాయ సాగతీతలు ఉన్నాయి. నిజానికి ఆ విషయాన్ని ఆయన ఒప్పుకొన్నారు. అనివార్యంగా కథనంలో అంత స్సూత్రతను కోల్పోయానని తనను తాను తిట్టుకున్నారు కూడా. అయితే అంతకుమించి ఆయన్ని తప్పు పట్టేందుకేమీ లేదని వెంటనే నేను గుర్తించాను. తన జన్మనక్షత్రాలు, కుటుంబ వివరాలు, పెంపుడు జీవుల విశేషాలు, లేదా తన డూన్ స్కూల్ నాటి జ్ఞాపకాలను అలుపు తెప్పించేలా చెప్పడంలోని ఆయన స్వీయ సంతృప్తిని మీరు క్షమించాలి. కేవలం యూనియన్ (విద్యార్థి సంఘం) అంటే ఉన్న మక్కువతో మాత్రమే ఆయన కేంబ్రిడ్జిలో చేరే సమయం రాగానే పుస్త కంలోని పఠనీయ పరిస్థితులు మెరుగవుతాయనడంలో సందేహం లేదు. యూనియన్ అధ్యక్షుడవడం ఆయన ఏకైక ఆశయం. పాపం ఆ ఆశయాన్ని సాధించలేకపోయారు. వాస్తవానికి యూనియన్ అధ్యక్ష స్థానానికి చేరువయ్యే సోపాన క్రమంలో అట్టడుగున ఉండే స్థాయీ సంఘానికి ఎన్నికవడానికి కూడా ఆయనకు కష్టమయింది. కానీ ఆయన ప్రయత్నంలోని మనోహరమైన నిజాయితీ మీ మనసును గెలుచుకుంటుంది. అంతేకాదు, 21వ శతాబ్దపు తొలి దశాబ్దానికి చెందిన ఈ రాజకీయ నాయకుడు పన్నెండవ శతాబ్దపు రౌండ్ చర్చి వెనుక ఉన్న కేంబ్రిడ్జి యూనియన్ చాంబర్లో రూపొందాడన్నది స్పష్టంగా తెలుస్తుంది. బంజరు భూముల వంటి ఈ ప్రారంభ పుటలను దాటితే డిసెంబరు మాసపు మొఘల్ గార్డెన్స్‌లా పుస్తకం వికసించి కనిపిస్తుంది. హఠాత్తుగా ఆయన అలవిమాలిన సమాచారం... చూపు తిప్పని వివరాలతో కూడిన కథనంగా మారిపోతుంది. కథకు అందే ప్రతి చిన్న చేరికతో ఆయన చూపుతున్న ప్రపంచం మనల్ని మరింతగా ఆకర్షిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి నేను పుస్తకాన్ని కింద పెట్టలేకపోయాను. రాత్రి బాగా పొద్దుపోయే వరకు కూడా, దానికి ఏదీ సాటిరాని స్కాట్లాండ్ జలాలతో బలోపేతం అయిన పేజీలను తిప్పుతూ ఉండి పోయాను. ఓ, ఢిల్లీలోని ఉష్ణో గ్రతల కారణంగా కొంచెం ఐసుతో కూడా! ఆయన ఫారిన్ సర్వీసుకు ఎప్పటికీ ఎలా చేరుకోలేక పోయా రనే గాథను పుస్తకంలోని ముఖ్యాంశంగా పత్రికలు ఇచ్చి తీరాలి. మన ప్రముఖ పత్రికలలో ఒకటేదైనా ఇస్తుందని నాకు గట్టి నమ్మకం కనుక ఆ వివరాలను ఇక్కడ వెల్లడించడం ద్వారా పాఠకుల ఆసక్తిని ముందే చెప్పి పాడు చేయలేను. ఒకటైతే చెబుతాను. పుస్తకంలోని ఈ ముఖ్యాంశాన్ని ఇవ్వకపోతే మీ అభిమాన దిన పత్రికను కొనడం మానేయండి. ఏదేమైనా, కరాచీలో కాన్సుల్–జనరల్‌గా పాకిస్తాన్‌లోని ఆయన నాలుగేళ్ల కాలాన్ని పొందుపరచిన అధ్యాయం... మనవాళ్లలో చాలా మంది శత్రువుగా భావించే దేశంలోని ప్రేమ, అవగాహనలను తెలియ బరుస్తుంది. మీలో చాలామందిని అది అక్షరాలా ఆకట్టుకునేలా ఉంటుంది. పాకిస్తాన్‌ని ఆయన ఉన్నదున్నట్లుగా లేదా, నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ అప్పట్లో ఉన్న విధంగా... మనవాళ్లు మనలో కలిగించిన, విధేయతతో సత్యం అని మనం నమ్మిన అపోహలను, అబద్ధాలను చెల్లాచెదురు చేసేలా ఆయన చిత్రీకరించారు. మర్యాదపూర్వకంగా, ఆప్యాయతతో ఉండండి, అప్పుడు పాకి స్తానీలు అదే విధమైన తమ ప్రతి స్పందనతో మిమ్మల్ని ముంచె త్తుతారు అని మణి కటువైనది కాని సూచనగా మీకు చెబుతారు. ‘‘భారతీయ శత్రుత్వం, లేదా శత్రుత్వ భావన పాకిస్తానీలను వారి ప్రభుత్వం లేదా సైన్యం వెనుక సమైక్యం అయ్యేలా చేస్తోంది’’అంటారు మణి. ఇప్పుడూ అంతే కదా... మనం వారిని వారి సైన్యం బాహువుల్లోకి విజయవంతంగా నెట్టేస్తున్నాం. మనం ఎదుర్కోవలసిన అవసరం ఉన్న ప్రశ్నలను మణి లేవ నెత్తారు. ‘‘పాక్ పాలకులపై ఆగ్రహంతో మనం ఎందుకని పాకిస్తాన్ పౌరులకు వీసాలను తిరస్కరిస్తున్నాం? పాకిస్తానీయులందరూ మన దేశంలో విధ్వంసాన్ని సృష్టించే జిహాదీలేనని మనం నిజంగా నమ్ము తున్నామా? పాకిస్తానీ జనాభాలోని 99.99 శాతం మందికి ఏ మాత్రం సంబంధం లేని ఉగ్రవాద చర్యలకు ప్రతీకారం తీర్చు కోవడానికి సంఝౌతా ఎక్స్‌ప్రెన్‌ను ఎందుకు రద్దు చేయాలి? మనం కనుక పాకిస్తానీయులను భారతదేశంలోని తమ బంధువులతో కలవ నీయకుండా చేస్తే హురియత్ తన ఆజాదీ పిలుపును విరమించు కుంటుందని నిజంగానే మనం భావిస్తున్నామా?’’ ఇందుకు ఆయన ఇచ్చిన సమాధానాన్ని నేను సమర్థిస్తాను... అది భౌగోళికంగా కచ్చితంగా లేకుండా ధ్వనిపూర్వకంగా మాత్రమే దగ్గరగా ఉన్నప్పటికీ. ‘‘పరాగ్వేలో మనం పడిపోకుండా ఉన్నాం. పొరుగు దేశమైన పాకిస్తాన్లో నిలబడలేకున్నాం.’’ మనలో చాలా మందికి తెలియని ఒక సత్యాన్ని సంగ్రహించే ఒక వాక్యాన్ని మీకు వదిలేస్తాను. అయితే కొద్ది మంది దానిని అంగీకరించరు. ‘‘శాంతి కోసం జరిగే ప్రయత్నాలు భారతదేశంలో కంటే పాకిస్తాన్‌లోనే ఎక్కువని అయిష్టంగానే నేను ముగించాల్సి వచ్చింది.’’ ఈ మాటను మీరు అంగీకరిస్తే... మీరు ఈ పుస్తకాన్ని చదివేందుకు, మీరెంత కచ్చితమైన వారో తెలుసుకునేందుకు అది మిమ్మల్ని ప్రలోభపెడుతుందని నా ఆశ. అలా కాకపోతే మీకు ఎన్నడూ చెప్పని, లేదా మీ నుండి దాచి పెట్టినవాటిని ఎదుర్కోడానికి మీలో కోపాన్నైనా రేకెత్తించనివ్వండి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అయ్యర్ ఇంటి ముందు క్యూ!
గుజరాత్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలూ వచ్చాయి. అయితే పోలింగ్ జరగక ముందే, ఫలితాలు రాకముందే మణిశంకర్ అయ్యర్ అనే కాంగ్రెస్ పార్టీ లీడర్ జోస్యం చెప్పేశారు.. బీజేపీనే గెలుస్తుందని! ఆయన జోస్యం నిజమైంది కూడా!! అయితే అయ్యర్‌గారు డైరెక్టుగా బీజేపీ గెలుస్తుందని చెప్పలేదు. మోదీని ‘నీచ్’ అని తిట్టి, తనకేం తెలీనట్లు ఊరుకున్నాడు. ఆ తిట్టే చివరికి మోదీని గెలిపించింది. అయ్యర్ తిట్టుకు గుజరాత్ ప్రజలు హర్ట్ అయి, కాంగ్రెస్‌ని ఓడించి, బీజేపీని గెలిపించారని ఎనాలిసిస్. మోదీని ‘నీచ్’ అన్నందుకు రాహుల్‌గాంధీ ఇమీడియట్గా పార్టీ నుంచి అయ్యర్‌ను తొలగించినా ఆ ఎఫెక్ట్ ఏమీ కనిపించలేదు. పైపెచ్చు, ఎన్నికల ఫలితాలు వచ్చాక అయ్యర్‌కి బీజేపీ సర్కిళ్లలో గౌరవం పెరిగింది. రెండుమూడు రోజులుగా అయ్యర్ ఇంటి ముందు బీజేపీ నేతలు క్యూ కట్టి మరీ ఆయనకు స్వీట్ ప్యాకెట్ ఇచ్చి, ధన్యవాదాలు సమర్పించి వస్తున్నారు. కొందరైతే స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి మరీ, అందులోంచి లడ్డూలు తీసి అయ్యర్‌కి తినిపిస్తున్నారు! కాంగ్రెస్ నేతలకు ఈ సంగతి తెలిసి అయ్యర్‌ను వెంటనే బీజేపీలో చేరిపోయి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి పాటుపడమని ఆల్రెడీ వర్తమానం పంపారట! -
నాపై 'సుపారీ' ఇచ్చారు
భాబర్: కాంగ్రెస్ నుంచి సస్పెండైన కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్‌పై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. తన అడ్డుతొలగించుకునేందుకు పాకిస్తాన్ వెళ్లి సుపారీ (కాంట్రాక్టు) ఇచ్చారని పేర్కొన్నారు. ఉత్తర గుజరాత్లో రెండో దశ ఎన్నికలు జరగనున్న భాబర్లో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు ‘నీచ’ పదాన్ని వినియోగించి తనపై విమర్శలు చేయటం ఇది తొలిసారేం కాదని.. గతంలోనూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఆమె కుటుంబసభ్యులు ఇలాంటి పదాలను వాడి చులకనగా మాట్లాడారని ప్రధాని పేర్కొన్నారు. అయ్యర్ వ్యాఖ్యల వివాదంతో గుజరాత్ ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తకుండా.. ఆయనపై చర్యలేమీ లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసి సమస్యను పక్కదారి పట్టించారని విమర్శించారు. అయోధ్య కేసును రాజకీయ కారణాలతో ముడిపెట్టిన న్యాయవాద నేత (కపిల్ సిబల్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ)ను పార్టీ నుంచి ఎందుకు తొలగించరని ప్రశ్నించారు. ‘నీచ’ పదాన్ని వాడుతూనే ఉన్నారు ‘శ్రీమాన్ మణిశంకర్ అయ్యర్ ఏం చేశారో మీకు తెలుసా? ఆయన ‘నీచ్ ఆద్మీ’ అని నన్ను తిట్టాడా, లేక మిమ్మల్నా? భారత సంస్కృతిని అవమానించాడా? లేక నన్నా? గుజరాత్ ప్రజలు ఓటు ద్వారా వారికి (కాంగ్రెస్) బుద్ధి చెప్పాలి’ అని మోదీ పేర్కొన్నారు. ‘నేను ప్రధాని అయ్యాక, ఈయన (అయ్యర్) పాక్‌కు వెళ్లారు. అక్కడ పాకిస్తానీలతో మాట్లాడుతూ.. ఎప్పటివరకు మోదీని అడ్డుతొలగించుకోలేమో అప్పటివరకు భారత్–పాక్ మధ్య సంబంధాలు మెరుగవ్వవని అన్నారు. ఇవన్నీ మీకు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. మీరెవరైనా చెప్పండి అడ్డు తొలగించుకోవటమంటే అర్థమేంటి? పాక్‌కు వెళ్లి నన్ను చంపేందుకు సుపారీ ఇచ్చారు. ఇదంతా మూడేళ్ల క్రితం జరిగింది. కాంగ్రెస్ ఈ అంశాన్ని దాచాలని ప్రయత్నించింది’ అని అన్నారు. కాంగ్రెస్ నేతలను తనపై వాడిన పరుషపదజాలాన్ని గుర్తుచేశారు. ‘కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ మూర్ఖ ప్రధాని అన్నారు. దిగ్విజయ్ దేశంలో రాక్షస రాజ్యం నడుస్తోందన్నారు. మరో కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ అయితే.. నియంతలైన గడాఫీ, ముస్సోలిని, హిట్లర్లతో పోల్చారు. సోనియా మృత్యుబెహారీ అన్నారు. ఆనంద్‌శర్మ, మన్మోహన్లైతే ప్రధాని మానసిక స్థైర్యం కోల్పోయారన్నారు. ఓ చాయ్‌వాలా ప్రధాని అవటాన్నీ జీర్ణించుకోలేకే మీరు ఇలాంటి పదాలు వాడుతున్నారు. అయినా నేనెప్పుడూ మిమ్మల్ని ఏమీ అనలేదు. ఇప్పుడు మళ్లీ మీరు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు’ అని కాంగ్రెస్ నేతలనుద్దేశించి మోదీ పేర్కొన్నారు. అదే కాంగ్రెస్ సంస్కృతి ‘కాంగ్రెస్ పార్టీ అట్కానా (అడ్డుకోవటం), లట్కానా (అంశాలను పక్కన పెట్టడం), భట్కానా (పక్కదారి పట్టించటం)లపైనే ఎక్కువ విశ్వసిస్తుంది. ఇదే ఆ పార్టీ పని సంస్కృతికి నిదర్శనం’ అని మోదీ విమర్శించారు. ప్రజలెవరూ ఈ సుపారీల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని, తనను ఎప్పుడూ భగవంతుడు కాపాడుతూనే ఉంటాడన్నారు. సర్జికల్ దాడులు జరిగినప్పుడు యావద్భారతం హర్షం వ్యక్తం చేస్తే.. కాంగ్రెస్‌పార్టీ మాత్రం సర్జికల్ దాడులకు సంబంధించిన ఆధారాలివ్వాలంటూ ప్రశ్నించిందన్నారు. కాలోల్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లోనూ మోదీ పాల్గొన్నారు. రాజ్‌కోట్ సభలో మాజీ ప్రధాని మన్మోహన్‌కు కాంగ్రెస్ హయాంలోని కుంభకోణాలపై రాసిన పుస్తకాన్ని బహూకరించిన మన్సుఖ్ కాకాను మోదీ అభినందించారు. ఈ సభలకు భారీ సంఖ్యలో పటీదార్లు పాల్గొని బీజేపీకి మద్దతు తెలిపారు. -
మణిశంకర్ అయ్యర్ కార్యాలయంపై దాడి
చెన్నై: కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై నిన్న ఆయన చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఈ దాడి జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఏఐసీసీ సమావేశాలు వేదికగా కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ నిన్న రెచ్చిపోయారు. 21వ శతాబ్దంలో నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రి కాలేరనన్నారు. నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం బిజెపి తెలివితక్కువ పనంటూ విమర్శించారు. మోడీ కారణంగా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రాంతీయ పార్టీలు ఆసక్తి చూపడం లేదన్నారు. ఆయన టీ అమ్మదలచుకుంటే ఏఐసీసీ ప్రాంగణంలో ఏర్పాట్లు కూడా చేస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల ఫలితంగానే ఈ రోజు ఆయన కార్యాలయంపై దాడులు జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.