కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.
చెన్నై: కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై నిన్న ఆయన చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఈ దాడి జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏఐసీసీ సమావేశాలు వేదికగా కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ నిన్న రెచ్చిపోయారు. 21వ శతాబ్దంలో నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రి కాలేరనన్నారు. నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం బిజెపి తెలివితక్కువ పనంటూ విమర్శించారు. మోడీ కారణంగా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రాంతీయ పార్టీలు ఆసక్తి చూపడం లేదన్నారు. ఆయన టీ అమ్మదలచుకుంటే ఏఐసీసీ ప్రాంగణంలో ఏర్పాట్లు కూడా చేస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల ఫలితంగానే ఈ రోజు ఆయన కార్యాలయంపై దాడులు జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.