
చీకటనీ వెలుతురనీ
రెండుంటాయంటాం కానీ
ఉండేది చీకటే
వెలుతురు వచ్చి వెళుతుంది
శబ్దాన్నీ నిశ్శబ్దాన్నీ
వేరు పరుస్తాం కానీ
ఉండేది నిశ్శబ్దమే
దాన్ని భగ్నం చేస్తే
శబ్దం పుడుతుంది
నిద్దురనీ మెలకువనీ
రెండు స్థితులు చెబుతాం కానీ
ఉండేది నిద్దురే
ముందు నిద్ర
వెనుక నిద్ర
చిరంతన నిద్ర
ఆద్యంతాలు లేని నిద్రలో
జీవితం
ఒక ఉలికిపాటు
-కొప్పర్తి
(యాభై ఏళ్ల వాన’ సంపుటిలోంచి; ప్రచురణ: 2014; ప్రచురించిన కవిత 2006లో రాసింది.)
Comments
Please login to add a commentAdd a comment