మహేందర్ గౌడ్ అత్త, భార్య లక్ష్మి, పిల్లలు
మెదక్ జిల్లా కొండపాక మండలం జప్తి నాంచారం గ్రామానికి చెందిన రైతు చింతల మహేందర్ గౌడ్‌కు 30 గుంటల భూమి ఉంది. దీనికి తోడు 4 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేసేవాడు. నీటి వసతి కోసం 3 బోర్లు వేయగా మూడింటిలో ఒక్కదానిలో కూడా చుక్క నీరు పడలేదు. బోర్లు విఫలం కావటం, కౌలుకు కూడా అప్పుతెచ్చి చెల్లించడం, వరుసగా రెండేళ్లు పంట పూర్తిగా నష్టపోవటం వల్ల అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చడానికి మహేందర్ కొన్ని రోజులు లారీ డ్రైవర్‌గా కూడా పనిచేశాడు. భార్య నగలను కుదువపెట్టి కొంత అప్పు తీర్చాడు. అయినా అప్పుల ఒత్తిడి తట్టుకోలేక 2016 సెప్టెంబర్ 11న ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య లక్ష్మి, పిల్లలు నికితేస్(4), భవ్యశ్రీ(19 నెలలు) ఉన్నారు. తండ్రి చనిపోయేనాటికి భవ్యశ్రీ తల్లి కడుపులోనే ఉంది. ఈ కౌలు రైతు కుటుంబానికి ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయమూ అందలేదు.
Comments
Please login to add a commentAdd a comment