చిన్నారుల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబంధమైన క్యాన్సర్లను తల్లిపాలు నివారిస్తాయని ఇజ్రాయెల్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాలలో తేలింది. చిన్నపిల్లలో వచ్చే క్యాన్సర్లలో రక్తసంబంధమైనవి (ల్యూకేమియా) దాదాపు 30 శాతం ఉంటాయి. దాదాపు 18 రకాల అధ్యయనాల్లో తేలిన విషయం ఏమిటంటే కనీసం ఆర్నెల్ల పాటైనా తల్లిపాలు తాగిన వారిలో బ్రెస్ట్ మిల్క్ ఈ బ్లడ్‌క్యాన్సర్లు వచ్చే అవకాశాలను 14 శాతం నుంచి 19 శాతం వరకు తగ్గిస్తుందని తేలింది.
కేవలం క్యాన్సర్ల నివారణ మాత్రమేగాక... తల్లిపాలు అకస్మాత్తుగా కారణం తెలియకుండా పిల్లలు మృతిచెందే కండిషన్ అయిన సడన్ ఇన్‌ఫ్యాంట్ డెత్ సిండ్రోమ్ (ఎస్‌ఐడిఎస్), ఉదరకోశవ్యాధులు (గ్యాస్ట్రో ఇంటస్టినల్ ఇన్ఫెక్షన్స్), చెవి ఇన్ఫెక్షన్లను నివారిస్తుందని తేలింది. అంతేకాదు... చాలాకాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువని తేలింది. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘జామా పీడియాట్రిక్స్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment