mothers milk
-
తల్లిపాలతో వ్యాపారానికి అనుమతించబోము
తల్లిపాలతో వ్యాపారం వద్దే వద్దని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తేల్చి చెప్పేసింది. మానవ తల్లిపాలు, దాని ఉత్పత్తులను విక్రయించరాదని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.‘మానవ తల్లిపాలు, దాని ఉత్పత్తుల వాణిజ్యీకరణకు సంబంధించి వివిధ రిజిస్టర్డ్ సొసైటీల నుంచి ఈ కార్యాలయానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. ఎఫ్ఎస్ఎస్ చట్టం, 2006 కింద మానవ తల్లిపాలను ప్రాసెసింగ్ చేయడానికి, విక్రయించడానికి ఎఫ్ఎస్ఎస్ఎఐ అనుమతించదు’ ప్రకటనలో ఎఫ్ఎస్ఎస్ఎఐ తెలిపింది.మానవ తల్లిపాలు, దాని ఉత్పత్తుల వాణిజ్యీకరణకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎఫ్ఎస్ఎస్ చట్టం, 2006తోపాటు దాని అనుబంధ నియమనిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను (ఎఫ్బీఓ) హెచ్చరించింది.తల్లి పాలను విక్రయించే ఇలాంటి యూనిట్లకు అనుమతి ఇవ్వవద్దని ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సింగ్ అధికారులను కోరింది. 'మదర్స్ మిల్క్/హ్యూమన్ మిల్క్' ప్రాసెసింగ్ లేదా అమ్మకంలో పాల్గొనే ఇలాంటి ఎఫ్‌బీఓలకు ఎలాంటి లైసెన్స్/ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా రాష్ట్ర, కేంద్ర లైసెన్సింగ్ అథారిటీలు చూసుకోవాలని సూచించింది.జాతీయ మార్గదర్శకాల ప్రకారం డోనర్ హ్యూమన్ మిల్క్ (డీహెచ్ఎం)ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించకూడదు. కాంప్రహెన్సివ్ పాలిటీ మేనేజ్మెంట్ సెంటర్స్ (సీఎల్ ఎంసీ)ల్లోని ఆరోగ్య కేంద్రాల్లో చేరిన శిశువులకు దీన్ని అందించవచ్చు. తల్లిపాలను ఇచ్చే దాత ఇందుకోసం ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు లేకుండా స్వచ్ఛందంగా దానం చేయాలి. దానం చేసిన పాలను ఆసుపత్రిలోని నవజాత శిశువులు, ఇతర తల్లుల శిశువులకు ఆహారం అందించడానికి ఉచితంగా ఉపయోగించాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. -
చిన్నపిల్లల్లో వచ్చే లుకేమియాను నివారించే తల్లి పాలు
చిన్నారుల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబంధమైన క్యాన్సర్లను తల్లిపాలు నివారిస్తాయని ఇజ్రాయెల్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాలలో తేలింది. చిన్నపిల్లలో వచ్చే క్యాన్సర్లలో రక్తసంబంధమైనవి (ల్యూకేమియా) దాదాపు 30 శాతం ఉంటాయి. దాదాపు 18 రకాల అధ్యయనాల్లో తేలిన విషయం ఏమిటంటే కనీసం ఆర్నెల్ల పాటైనా తల్లిపాలు తాగిన వారిలో బ్రెస్ట్ మిల్క్ ఈ బ్లడ్‌క్యాన్సర్లు వచ్చే అవకాశాలను 14 శాతం నుంచి 19 శాతం వరకు తగ్గిస్తుందని తేలింది. కేవలం క్యాన్సర్ల నివారణ మాత్రమేగాక... తల్లిపాలు అకస్మాత్తుగా కారణం తెలియకుండా పిల్లలు మృతిచెందే కండిషన్ అయిన సడన్ ఇన్‌ఫ్యాంట్ డెత్ సిండ్రోమ్ (ఎస్ఐడిఎస్), ఉదరకోశవ్యాధులు (గ్యాస్ట్రో ఇంటస్టినల్ ఇన్ఫెక్షన్స్), చెవి ఇన్ఫెక్షన్లను నివారిస్తుందని తేలింది. అంతేకాదు... చాలాకాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువని తేలింది. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘జామా పీడియాట్రిక్స్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
చంటిపిల్లలకు పాలెలా పట్టాలి?
చంటి పిల్లలకు సాధ్యమైనంతవరకు తల్లిపాలే పట్టాలి. చనుబాలు చాలా మేళ్లు చేస్తాయి. అయితే ఒక్కోసారి తల్లికి పాలు పడని సందర్భాల్లో మాత్రం పోత పాలు ఇవ్వవచ్చు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. పాడి పశువుల పాలు : ఆవు, గేదె, మేక వంటి పాడి పశువుల పాలు ఇవ్వవచ్చు. డబ్బా పాలు : పిల్లల కోసం ఉద్దేశించి అమ్మే పాల పౌడర్‌ను ఉపయోగించి కలిపి ఇచ్చేవి కూడా కొందరు ఇస్తుంటారు. బిడ్డకు సీసాతో పాలు పట్టాల్సి వస్తే... ►ముందుగా సీసాను, పాల పీకను సబ్బు నీళ్లతో శుభ్రంగా కడగాలి. ►పాల సీసాను పది నిమిషాల పాటు మరిగే నీళ్లలో ఉంచాలి. అలాగే పాల పీకను కనీసం రెండు నిమిషాల పాటు వేడి నీళ్లలో మరగనివ్వాలి. ►పాలు పట్టాక బిడ్డను వెంటనే పడుకోబెట్టకూడదు. పాలు పట్టగానే బిడ్డను మొదట భుజంపై వేసుకుని నెమ్మదిగా తట్టాలి. ఇలా తేన్పు వచ్చే వరకు తట్టాలి. ఆ తర్వాతే పడుకోబెట్టాలి. ► సీసాలో పాలు తాగించే సమయంలో ఒకసారి తాగాక మిగిలిన పాలను తప్పక పారబోయాలి. ►బిడ్డ నిద్రపోయే సమయంలో పాలు తాగించకూడదు. ►బిడ్డకు తల్లి సీసాతో పాలు తాగించే సమయంలో బిడ్డను ఒళ్లో పడుకోబెట్టి పాలు ఇవ్వాలి. చంటిబిడ్డకు తల్లిపాలే మంచివి... ఎందుకంటే... ►బిడ్డకు తల్లి పాలు ఇవ్వలేని సమయంలో తప్ప... మరెప్పుడూ పోతపాల గురించి ఆలోచించవద్దు. ►బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టడం ప్రారంభించాలి. ►కొందరు తల్లులు ముర్రుపాలను బిడ్డకు ఇవ్వరు. కానీ అందులో ఎన్నో వ్యాధి నిరోధక శక్తి కలిగిన పోషకాలు ఉంటాయి. వాటిని ఇవ్వడం వల్ల కొన్నిసార్లు బిడ్డ జీవితాంతం ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ►బిడ్డకు నాలుగు నుంచి ఆర్నెల్ల వయసు వచ్చేవరకు కేవలం చనుబాలే సరిపోతాయి. మరే ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ►తల్లిపాలు చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. ►బిడ్డను అనేక అంటువ్యాధుల నుంచి తల్లిపాలు రక్షిస్తాయి. ముఖ్యంగా బిడ్డ పుట్టిన తొలినాళ్లలో పాలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ►బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో రుతుస్రావం ఆలస్యంగా మొదలతుంది. అంటే చాలా సందర్భాల్లో పాలిచ్చే తల్లుల్లో బిడ్డకూ బిడ్డకూ ఎడం ఉండేలా ప్రకృతే సహాయపడుతుందన్నమాట. ►తల్లికీ, బిడ్డకూ మధ్య మానసికంగా, శారీరకంగా అనుబంధాలు, ఉద్వేగాలు పెంపొందుతాయి. తల్లి దగ్గర బిడ్డకు పుష్కలంగా పాలు దొరుకుతూ ఉంటే... ►తల్లిపాలు పుష్కలంగా తాగిన బిడ్డ కనీసం 2–3 గంటల పాటు హాయిగా నిద్రపోతుంది. ►తల్లి నుంచి కడుపునిండా పాలు లభ్యమయ్యే బిడ్డ రోజుకు 7 నుంచి 8 సార్లు మల విసర్జన చేస్తుంది. ►బిడ్డలో ఎదుగుదల బాగుంటుంది. ►బిడ్డ హుషారుగా ఆడుకుంటూ ఉంటుంది. ►బిడ్డకు సరిపడా పాలు పడుతున్నంతకాలం అమ్మ పాలే శ్రేష్టమైనవన్న విషయం తల్లి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. -
పాపకు నత్తి వస్తోంది... తగ్గేదెలా?
మా పాపకు పదేళ్లు. చదువులో ముందుంటుంది. కానీ మాట్లాడుతుంటే కొద్దిగా నత్తిగా వస్తుంటుంది. డాక్టర్‌ను కలిస్తే అంతా మామూలు అయిపోతుంది. మాటలు చక్కగానే వస్తాయి, కాకపోతే కాస్త ఆలస్యంగా కావచ్చు. అయితే మా పాప కంటే చిన్నవాళ్లు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మా అమ్మాయి చక్కగా మాట్లాడాలంటే మేమేం చేయాలో సలహా ఇవ్వండి. ఉచ్చారణ విషయంలో మీ పాపకు ఉన్న సమస్యను స్టామరింగ్ లేదా స్టట్టరింగ్ అంటారు. ఈ కండిషన్ ఉన్న పిల్లలు ఒక పదాన్ని ఉచ్చరించే ముందు అదేమాటను పదే పదే పలుకుతూ ఉండటం, లేదా గబుక్కున అనలేక దాన్ని పొడిగించడం, ఒక్కోసారి మాట ఆగిపోవడం కూడా జరగవచ్చు. మన జనాభాలో దాదాపు ఒక శాతం మందికి ఈ సమస్య ఉంటుంది. ఇది అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువ. ఈ సమస్యకు నిర్దిష్టంగా ఇదే కారణం అని చెప్పలేకపోయినా... జన్యుపరమైన, న్యూరోఫిజియలాజికల్ మార్పుల వల్ల ఒక్కోసారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటి పిల్లల్లో కొందరికి వినికిడి సమస్య కూడా ఉండవచ్చు. కాబట్టి పై సమస్యలు ఉన్నాయా లేదా అని పరీక్షించడం చాలా ముఖ్యం. పిల్లల మానసిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకోకుండా వారిని ఇతరులతో పోల్చిచూడటం, బాగా రాణించాలని కోరుతూ ఒత్తిడి పెంచడం వంటి కారణాలతో స్టామరింగ్ ఇంకా ఎక్కువ కావచ్చు. మాటలు నేర్చుకునే వయసు పిల్లల్లో స్టామరింగ్ అన్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే వాళ్లలో వయసు పెరుగుతున్నకొద్దీ సమస్య తగ్గుతూ ఉంటుంది. పిల్లల్లో ఒకవేళ స్టామరింగ్ ఉంటే... ఐదేళ్లు వచ్చేనాటికి 65 శాతం మంది పిల్లల్లో, యుక్తవయసు వచ్చేదానికి ముందర (అర్లీ టీన్స్‌లో) 75 శాతం మందిలో ఈ సమస్య తగ్గిపోతుంది. ఇలాంటి పిల్లల్లో వాళ్లు చెప్పేది పూర్తిగా వినడం తల్లిదండ్రుల బాధ్యత. వాళ్లను తొందరపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. వాళ్లు చెప్పదలచుకున్నది పూర్తిగా చెప్పేలా ప్రోత్సహించడం అవసరం. ఇలాంటి పిల్లలకు నిర్దిష్టంగా ఒకే ప్రక్రియతో సమస్య మటుమాయం అయ్యేలా చేయడం జరగదు. కొన్ని మందులు వాడుకలో ఉన్నా వాటి వల్ల అంతగా ప్రయోజనం లేదు. స్పీచ్ ఫ్లుయెన్సీ, స్టామరింగ్ మాడిఫికేషన్ వంటి స్పీచ్‌థెరపీ ప్రక్రియల ద్వారా మీ పాపకు సమస్య చాలావరకు నయమవుతుంది. మీరు మొదట స్పీచ్ థెరపిస్ట్ కలిసి తగు చికిత్స తీసుకోండి. బాబుకు గేదెపాలు పట్టించవచ్చా? మా బాబు వయసు నెల రోజులు. తల్లికి పాలు పడకపోవడంతో ఆమె దగ్గర తగినన్ని పాలు లేవు. దాంతో గేదెపాలు పట్టిస్తున్నాం. ఇంత చిన్న బాబుకు గేదెపాలు తాగించవచ్చా? దీనివల్ల బాబుకి ఏమైనా సమస్యలు ఎదురవుతాయా? నెలల బిడ్డకు గేదె పాలు పట్టించడం అంత మంచిదికాదు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం... పోతపాల (యానిమల్ మిల్క్)పై పెరిగే పిల్లల్లో కడుపునొప్పి వంటి ఉదరసంబంధమైన సమస్యలు, ఆస్తమా వంటి అలర్జిక్ వ్యాధులు, చెవి ఇన్ఫెక్షన్లు, స్థూలకాయం వంటి అనేక సమస్యలు రావచ్చని, ఆ సమస్యలకు ఇలా గేదె పాలు పట్టడం కూడా ఒక కారణమని తెలుస్తోంది. పైగా ఇటీవల పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి అనేక హార్మోన్లు, మందులు, యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తున్నారు. వీటి ఫలితంగా పిల్లల దీర్ఘకాలిక ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం కనిపిస్తోంది. కాబట్టి పోతపాలు, సురక్షితం కాని పాలు (అన్పాష్చరైజ్డ్ మిల్క్) పిల్లలకు ఇవ్వడం సరికాదు. ఇక తల్లి పాలు ఇవ్వలేని తప్పనిసరి పరిస్థితుల్లో (అంటే లాక్టోజెన్ ఇన్టాలరెన్స్, ప్రోటీన్ ఇన్టాలరెన్స్ వంటి సమస్యలు ఉన్నప్పుడు) మార్కెట్లో దొరికే కొన్ని స్పెషల్ ఫార్ములా ఫీడ్స్ ఉపయోగించవచ్చు. కానీ వీటన్నింటికంటే తల్లిలోనే పాలు పెరిగేలా స్వాభావిక విధానాలు (ప్రోటీన్లు పుష్కలంగా ఉంటే పుష్టికరమైన ఆహారం ఇవ్వడం వంటివి) అనుసరించడం మంచిది. ఇక తప్పనప్పుడు డాక్టర్ సలహా మేరకు తల్లిలో పాలు పెరిగేందుకు కొన్ని మందులు ఉపయోగించాల్సి ఉంటుంది. పిల్లలకు తల్లిపాలే శ్రేయస్కరం. మీరు మరొకసారి మీ గైనకాలజిస్ట్‌ను కలిసి రొమ్ముకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నాయేమో పరీక్షించుకోండి. వాటికి చికిత్స తీసుకుని తల్లిపాలే పట్టడానికి ప్రయత్నించండి. అదేమీ సాధ్యం కానప్పుడు మాత్రమే ఫార్ములా ఫీడ్స్ వెళ్లాల్సి ఉంటుంది. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,హైదరాబాద్ -
తల్లి పాలతో పిల్లల్లో బ్లడ్‌క్యాన్సర్ల నివారణ
మహాభాగ్యం తల్లిపాలు... ఎంత మేలు చేస్తాయన్నది అందరికీ తెలిసిందే. ఆ పాలకు ఉన్న అనేక మహత్యాలను ఇజ్రాయెల్ పరిశోధకులు తెలుసుకున్నారు. చిన్నారుల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబంధమైన క్యాన్సర్లను తల్లిపాలు నివారిస్తాయని పేర్కొంటున్నారు. చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లలో రక్తసంబంధమైనవి (ల్యూకేమియా) దాదాపు 30 శాతం ఉంటాయి. కనీసం ఆర్నెల్లపాటైనా తల్లిపాలు తాగిన పిల్లల్లో ఇలాంటి బ్లడ్‌క్యాన్సర్లు వచ్చే అవకాశాలు 14 శాతం నుంచి 19 శాతం వరకు తగ్గుతాయని దాదాపు 18 రకాల అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు... సడన్ ఇన్‌ఫ్యాంట్ డెత్ సిండ్రోమ్ (ఎస్ఐడిఎస్), ఉదరకోశవ్యాధులు (గ్యాస్ట్రో ఇంటస్టినల్ ఇన్ఫెక్షన్స్), చెవి ఇన్ఫెక్షన్లనూ తల్లిపాలు నివారిస్తాయని తేలింది. ఇక చాలా కాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, టైప్–2 డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువనే మరో విషయం సైతం తేటతెల్లమైంది. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘జామా పీడియాట్రిక్స్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
తల్లి పాలు తాగడం పిల్లల హక్కు
సాక్షి,సిటీబ్యూరో: తల్లి పాలు తాగడం పిల్లల హక్కుగా భావించి.. తల్లి పాల బ్యాంకులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు ప్రభుత్వానికి సూచించారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ప్రచార ఆర్భాటానికే పరిమితమవుతున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పసిబిడ్డలు తల్లి పాలకు ఎందుకు దూరమవుతున్నారనే అంశంపైన, తల్లికి, బిడ్డకు పెరుగుతున్న దూరాన్ని తగ్గించడం పైన శిశు సంక్షేమ సంస్థలు, ఆరోగ్య శాఖ దృష్టి సారించడం లేదన్నారు. దేశంలో ఏటా లక్షన్నరకు పైగా తల్లులు సరైన వైద్య సదుపాయాలు లేక ప్రసవ సమయంలోనే కన్నుమూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా తల్లులను కోల్పోయిన పిల్లలు పాలకు నోచుకోలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. పౌష్టికాహార లోపంతో 48 శాతం తల్లులు, భయంకరమైన వ్యాధులు, జన్యుపరమైన కారణాల వల్ల 7 శాతం మహిళలు పిల్లలకు పాలు ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. -
అమ్మ పాలు.. అమృతం!
సాక్షి, సిటీ బ్యూరో: నవ మాసాలు మోసిన తల్లి.. తన బిడ్డ ఈ లోకంలో అడుగు పెట్టగానే ఆరోగ్యాన్ని...రోగ నిరోధక శక్తిని కానుకగా ఇవ్వాలంటున్నారు వైద్యులు. ఇది కేవలం తల్లి పాలతోనే సాధ్యమని చెబుతున్నారు. పుట్టిన 15 నిమిషాల నుంచి గంట వ్యవధి లోపు ఇచ్చే ముర్రుపాలు చిన్నారులకు రోగ నిరోధక ఔషధమని అంటున్నారు. దాదాపు 30 శాతం శిశు మరణాలను తగ్గించేది ఇవేనని యూనిసెఫ్ నివేదిక స్పష్టం చేసింది. ముర్రుపాలు పట్టకూడదనే అపోహతో చాలా మంది గ్రామీణ మహిళలు గంటలోపు పాలు పెట్టనివ్వరు. నిజానికి ఆ రెండు మూడు చుక్కల పాలలాంటి నీళ్లు బిడ్డకు వారం రోజులకు సరిపడా పౌషక విలువలను అందిస్తాయి. పోషకాలు పుష్కలం బిడ్డ పుట్టిన 15 నిమిషాల నుంచి మూడు రోజుల పాటు వచ్చే ముర్రుపాలల్లో అత్యంత ఆరోగ్యవంతంగా ఉంచగలిగే పోషక విలువలు ఉంటాయి. ఆరు నెలల వరకు ఎంత ఎండాకాలమైనా సరే నీళ్లు కూడా ఇవ్వకుండా తల్లి పాలే ఇవ్వాలి. ఇది బిడ్డ ఎదుగుదలకు అత్యంత కీలకం. తల్లి పాలల్లో బాక్టీరియా ఉండదు. ఎలాంటి పోషకాలు అవసరమో... ఎంత వేడి కావాలో... ఎటువంటి రోగ నిరోధకాలు అవసరమో... ఎంత తియ్యదనం కావాలో తల్లి పాలలో సహజసిద్ధంగా లభిస్తాయి. పిల్లల్లో మలబద్ధకం ఉండదు. పొట్టలో గ్యాస్ తయారు కాదు. డయేరియా, దగ్గు, జలుబు లాంటివి దరిచేరవు. ఇన్ఫెక్షన్లు సోకవు. రెండు గంటలకొకసారి తప్పనిసరిగా తల్లి బిడ్డకు పాలివ్వాలి. 24 గంటల్లో 8 సార్లు తప్పనిసరిగా పాలు ఇవ్వాల్సి ఉంటుంది. – డాక్టర్ బాలాంబ, గైనకాలజిస్ట్ మానసిక వికాసానికి తోడ్పాటు భవిష్యత్‌లో బిడ్డకు మానసిక సమస్యలు రాకుండా తల్లి పాలు నిరోధించగలుగుతాయి. పర్సనాలిటీ డిజార్డర్స్ని దూరం చేస్తాయి. కూలి పని చేసుకునే తల్లులకు గ్రామీణ ఉపాధిహామీ పథకంలో కూడా పిల్లల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉంది. కానీ ఇదెవ్వరూ పట్టించుకోరు. ఐటీæసంస్థలు, కార్పొరేట్ ఆఫీసుల్లోనూ బిడ్డలకు ప్రత్యేకించి సంరక్షణ కేంద్రాలు 99 శాతం లేవనే చెప్పాలి. ఎన్ని అవగాహనా కార్యక్రమాలు పెట్టినా అందుకు అనుగుణమైన వాతావరణాన్ని కల్పించడం అవసరం. –డాక్టర్ రమాదేవి, కన్వీనర్, జనవిజ్ఞాన వేదిక క్యాన్సర్ దూరం వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ అనే సంస్థ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే అంశాల్లో బిడ్డలకు పాలివ్వడం కూడా ఒకటని ప్రచారం చేస్తోంది. పాలిచ్చే తల్లుల కంటే పాలివ్వని వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా నమోదవుతున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. పుట్టిన గంటలోపు పాలివ్వకపోవడం వల్లనే తల్లుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. మిల్క్ బ్రెడ్, తృణధాన్యాలు, ఓట్స్ లాంటివి తక్షణమే తల్లిపాల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. అందం తరిగిపోతుందన్నది కూడా అపోహే. –డాక్టర్ భావన కాసు -
అమ్మపాలు అమృతంతో సమానం
దుబ్బాక: అమ్మ పాలు అమృతంతో సమానమని, బిడ్డలకు అమ్మ పాలే శ్రేష్ఠమని ఎంపీపీ ర్యాకం పద్మ అన్నారు. బుధవారం మండలంలోని చిట్టాపూర్, పోతారం, హబ్షీపూర్, తిమ్మాపూర్, బల్వంతాపూర్, అప్పనపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు. తల్లి పాల విశిష్టతపై తల్లులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన అరగంటలోపే తల్లి పాలను పారబోయకుండా బిడ్డకు పట్టించాలని సూచించారు. తల్లి పాలల్లో రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుందని, మూఢ నమ్మకాలతో ముర్రుపాలను వృథా చేస్తున్నారన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న సేవలను గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింత మరణాలు తగ్గించడానికి అంగన్వాడీ, ఆశా వర్కర్లు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌లు పోతనక రాజయ్య, ఇప్పలపల్లి నాగమణి, అబ్బుల లావణ్య, కొంగరి కనకవ్వ, చెర్లపల్లి బాలమణి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు హేమలత, యాస్మిన్ భాషా బేగం, అంగన్వాడీలు కవిత, జ్యోతి, జయ, మంజుల, బాల్‌లక్ష్మి, మంజుల, తార, పుష్పలత, శైలజ, రాజమణి, కవిత ఏఎన్ఎంలు మంజులు, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. -
తల్లిపాల ప్రాధాన్యతను తెలుసుకోవాలి
తల్లిపాల ప్రాధాన్యతను తెలుసుకోవాలి మహబూబ్‌నగర్ న్యూటౌన్: తల్లిపాల ప్రాధాన్యతను ప్రజలందరు తెలుసుకోవాల్సిన అవసరముందని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జ్యోత్సS్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి ప్రారంభమైన తల్లిపాల వారోత్సవాలు ఈ నెల 6వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణిలు, బాలింతలు, కిశోరబాలికలు, ఏఎ¯Œæఎంలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలో ప్రతి మహిళ ప్రసవించిన వెంటనే ముర్రుపాలు పట్టడం, 6 నెలల వరకు ముర్రు పాలు పట్టడం వంటి విషయాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ నెల 3న స్కూళ్లలో కిశోరబాలికలకు తల్లిపాల ఆవశ్యకతపై వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 4న జిల్లా స్థాయిలో తల్లిపాలు, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వటం, ఆ తర్వాత అనుబంధ ఆహారం ప్రారంభించడం వంటి వాటిపై అవగాహన, 5న ప్రాజెక్టు స్థాయిలో అవగాహన, 6న వెల్‌బేబీ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. -
అమ్మపాలు..అమృతం
తాగితే బిడ్డకు.. తాపిపే జననీకి రక్ష తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం ఇంతకు మించిన పౌష్టికాహారం లేదంటున్న నిపుణులు తల్లిపాలతో శిశుమరణాలూ తగ్గుతాయ్ జోగిపేటబిడ్డకు అమ్మ పాలు వరం. సహాజం.. సురక్షితం .. పుష్టికర ఆహారం , అన్ని పోషకాలు అందించి.. అన్నిరోగాల నుంచి రక్షించగలిగే అమృతం. పోతపాల కంటే తల్లి పాలు తాగే పిల్లలు బలంగా తెలివిగా ఉంటారన్నది నిరూపితమైన వాస్తవం. అపోహలు పోగొట్టి.. మరింత విస్తృత ప్రచారం కల్పించడానికి తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. వారోత్సవాలు ఈ నెల 1న ప్రారంభమయ్యాయి. 7వ తేదీ వరకు జరుగుతాయి. తల్లిపాలకు మించిన ఆహారం బిడ్డకు మరెందులోనూ దొరకదు. రోగ నిరోధక శక్తి అధికంగా ఉండే అమ్మపాల అద్భుతాలెన్నో.. కాన్పు అయిన మొదటి 3-4రోజులు వచ్చే ముర్రు పాలలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. బిడ్డకు విటమిన్ ఏ, బీ, ఐరన్ పుష్కలంగా అందుతాయి. జిల్లా వ్యాప్తంగా తల్లిపాల అవశ్యకత గురించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివిధ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నారు. ఆశ వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి తల్లి పాల ఆవశ్యకతను గురించి అవగాహన కల్పిస్తున్నారు. 6 నెలల వరకు ... బిడ్డ పుట్టిన గంటలోపు నుంచి 6 నెలల వరకు తల్లిపాలు తప్ప మరే పదార్థాలూ ఇవ్వకూడదు. తల్లి పాలు తేలికగా అరుగుతాయి. అంతే కాకుండా శుభ్రంగా ఎటువంటి క్రిములు లేకుండా ఉంటాయి. శ్వాసకోశ, అలర్జీ అస్తమా, చర్మవ్యాధుల నుంచి పిల్లలను రక్షిస్తాయి. బిడ్డ మానసిక శారీరక వికాసానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. రోజులో బిడ్డకు 8-10 సార్లు పాలు ఇవ్వాలి. తల్లీబిడ్డ క్షేమం.. ఆరు మాసాల తర్వాత నుంచి బిడ్డకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా పాలు పట్టాలి. దీనివల్ల ఎలాంటి చర్మవ్యాధులు దరి చేరకుండా బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. బిడ్డలకు పాలివ్వడం తల్లికి కూడా ప్రయోజనకరమే. తల్లికి రొమ్ము, గర్భసంచి క్యాన్సర్ వంటి వ్యాధులు దరిచేరవు. నెలసరిలో రక్తస్రావం తక్కువగా ఉంటుంది. పాలిచ్చినంత కాలం మళ్లీ గర్బ నిరోధకంగా కూడా పనిచేస్తుంది. సంజీవని .. తల్లి పాలు అమృతంతో సమానం. ఖరీదు కట్టలేనివి, బిడ్డకు తల్లికి కుటుంబానికి ఉపయోగం డబ్బా పాలతో అన్ని కష్టాలే. తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి.శిశువు పుట్టిన వెంటనే గంటలోపే తల్లిరొమ్ము అందించి ముర్రుపాలు తప్పని సరిగా పట్టాలి. వ్యాధుల నుంచి రక్షించే శిశువుకు కావలసిన ఖనిజాలు, మాంసకృత్తులు, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి. వ్యాధుల నుంచి రక్షించే యాంటీబాడీలు ఉంటాయి. బిడ్డపేగుల నుంచి విసర్జకాలను తొలగించడానికి, అలర్జీలు రాకుండా నిరోధించడానికి ముర్రుపాలు తోడ్పడతాయి. ఒక్కమాటలో చెప్పా లంటే ముర్రుపాలలో శిశువుకు కావలసిన అన్ని పోషకవిలువలు బిడ్డ శరీరానికి అందుతాయి.బిడ్డకు మొదట వ్యాధి నిరోధక టీకాగా పనిచేస్తుంది.శిశువులకు ప్రకృతి ప్రసాదించిన సహజ అత్యుత్తమమైన పౌష్టికాహరం‡ బిడ్డకు సులువుగా జీర్ణమవుతాయి. తల్లి పాలవలన మలవిసర్జన సులభంగా జరుగుతుంది. శిశువులకు దృష్టిలోపం రాకుండా నివారించడానికి దోహదపడతాయి.తల్లికీ, బిడ్డకు చక్కని అనుబంధం ఏర్పడుతుంది. వ్యాధుల బారి నుంచి తల్లిపాలు రక్షిస్తుంది. తల్లిపాలు సురక్షితమైనవి రోజులో 24 గంటలూ తల్లిపాలు లభిస్తాయి. తల్లిపాలలో శిశువులకు కావలసిన అన్ని పోషక పదార్థాలన్నీ పూర్తి మోతాదులో ఉంటాయి. తల్లిపాలు తాగే పిల్లలు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశం (సడన్ ఇన్ ఫాంట్ డెత్ సిండ్రోం) తక్కువని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది.తల్లిపాల వలన పోషకాహార లోపాలు తగ్గి 13 శాతం శిశుమరణాలరేటు తగ్గించవచ్చు. శస్త్రచికిత్స ద్వారా (సిజేరియన్) పుట్టిన పిల్లలకు కూడా వెంటనే తల్లిపాలు ఉగ్గుగిన్నెతో పట్టించాలి. తల్లిపాలు తాగే శిశువులకు తల్లి పాల నుండి తగినంత నీరు లభిస్తుంది.దీర్ఘకాల వ్యాధులు ఉన్న తల్లులు వైద్యులు సలహామేరకు శిశువులకు పాలివ్వాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు ప్రకారం శిశువుల గరిష్ఠ పెరుగుదలను మానసికాభివృద్ధిని ఆరోగ్యాన్ని సాధించాలంటే వారికి మొదట 6 నెలలపాటు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి.ఆరునెలల తర్వాత ఎదుగుతున్న శిశువు, పెరుగుతున్న అవసరాలు తీర్చడం కోసం శిశువులకు ఇష్టపూర్వ కమైన ఇంట్లోనే లభ్యమయ్యే పౌష్ఠిక విలువలున్న ద్రవ /ఘణ అనుబంధ ఆహారాన్ని ఇస్తూ... రెండు సంవత్స రాల వరకు తల్లిపాల పోషణను కొనసాగించాలి. అనుబంధ ఆహారాన్ని తయారు చేయడంలోనూ, తినిపించడం లోనూ పరిశుభ్రతను పాటించాలి.ఆరునెలల తర్వాత ఎదుగుతున్న శిశువు, పెరుగుతున్న అవసరాలు తీర్చడం కోసం శిశువులకు ఇష్టపూర్వ కమైన ఇంట్లోనే లభ్యమయ్యే పౌష్ఠిక విలువలున్న ద్రవ /ఘణ అనుబంధ ఆహారాన్ని ఇస్తూ... రెండు సంవత్స రాల వరకు తల్లిపాల పోషణను కొనసాగించాలి. అనుబంధ ఆహారాన్ని తయారు చేయడంలోనూ, తినిపించడం లోనూ పరిశుభ్రతను పాటించాలి. ఇద్దరికి మంచిదే... ఉభయులకు లాభదాయకమే.. తల్లిపాలవల్ల శిశువుకే కాదు...తల్లికి కూడా అనేక లాభాలు ఉన్నాయి. కొన్ని రకాల (ఉదాహరణకు : రొమ్ము గర్భసంచి, అండాశయం మొదలగు క్యాన్సర్లు) క్యాన్సర్లు తక్కువగా వస్తాయని, అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రసవ సమయంలో స్థిరత్వం కోల్పోయిన గర్భసంచి పూర్వ స్థితికి వచ్చి అధిక రక్తస్రావం తగ్గడం, శిశువుకు తల్లిపాలతోనే పెంచినట్లయితే హార్మోన్లు ప్రభావంతో 6 నెలల వరకు అండం విడుదల కానందువలన గర్భధారణ జరుగదు కాబట్టి తల్లికి ఇది తాత్కాలిక కుటుంబ నియంత్రణగా ఉపయోగపడుతుంది. (ఈ పద్థతినే ’’లాక్టేషనల్ ఎమోనోరియా లేదా లామ్’’ అని అంటారు.)తల్లిపాల సంస్కృతి ఒక సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించి తల్లిపాల సంస్కృతిని పెంపొందించుకోవాలి.ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించి తల్లిపాల సంస్కృతిని పెంపొందించుకోవాలి. -
అమ్మపాలే అమృతం
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఆగస్టు 1 - 7 వరకు పసిపిల్లలకు అమ్మపాలే అమృతం. శిశువు పుట్టిన గంట సేపట్లోగా మొదట తల్లిపాలనే పట్టాలి. రెండేళ్ల వయసు వచ్చేంత వరకు పిల్లలకు తల్లిపాలే ప్రధాన పోషకాహారం. చిన్నారులకు కనీసం ఆరు నెలల వయసు వచ్చేంత వరకైనా తల్లిపాలు పట్టాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. మిల్క్ ఫార్ములాలు అందుబాటులోకి రాని కాలంలో ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు అందరూ తల్లిపాలనే పట్టేవారు. మిల్క్ ఫార్ములాలు అందుబాటులోకి వచ్చాక ఫ్యాషన్ల ప్రభావంలో పడి అగ్రరాజ్యాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను చాలామంది తల్లులు పిల్లలకు ఫార్ములా పాలను అలవాటు చేయడం ప్రారంభించారు. కొన్ని దశాబ్దాలు ఇదే ధోరణి కొనసాగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు అంతర్జాతీయ సంస్థలు చొరవ తీసుకుని, తల్లిపాల ప్రాధాన్యంపై విస్తృతంగా ప్రచారం సాగించడంతో ఇటీవలి కాలంలో మహిళలు తల్లిపాలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఫార్ములా పాలపొడులను తయారు చేసే కంపెనీలు తమ ఉత్పత్తుల ప్యాకెట్లపై ‘శిశువులకు తల్లిపాలే అత్యంత శ్రేష్ఠమైనవి’ అని తప్పనిసరిగా ముద్రించే పరిస్థితి అనివార్యంగా మారింది. శిశువులకు తల్లిపాలు పట్టడం ఇటు శిశువుల ఆరోగ్యానికీ, అటు తల్లుల ఆరోగ్యానికీ మంచిదని పలు వైద్య పరిశోధనల్లో రుజువవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదే అంశాన్ని తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఇదీ పరిస్థితి శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలను మించినవేవీ లేవు. తల్లిపాలకు ప్రత్యామ్నాయం కూడా ఏదీ లేదు. తల్లిపాల ద్వారా శిశువుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా ఆరు నెలల లోపు వయసున్న శిశువుల్లో దాదాపు 40 శాతం మంది తల్లిపాలు లభించక అల్లాడుతున్నారు. రోగనిరోధక శక్తి సన్నగిల్లి వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితి వల్ల కొందరు శిశువులు నిష్కారణంగా కన్నుమూస్తున్నారు. ప్రపంచంలోని శిశువులందరికీ తల్లిపాలు అందే పరిస్థితే ఉన్నట్లయితే, ఏటా 8 లక్షల శిశుమరణాలను నివారించే అవకాశాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. అయితే, తల్లిపాల వినియోగంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, వెనుకబడిన దేశాలే ముందంజలో ఉన్నాయి. తల్లిపాల వినియోగంలో తొలి పది స్థానాల్లో నిలుస్తున్న దేశాలు, వాటి వివరాలు... తల్లిపాలను నిల్వచేయవచ్చు ఉద్యోగాలు, ఇతర పనుల కోసం బయటకు వెళ్లే మహిళలకు పిల్లలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు పట్టే అవకాశం దొరక్కపోవచ్చు. అలాంటి తల్లులు తమ పాలను బయటకు తీసి, ఫ్రిజ్‌లో భద్రపరచి ఉంచే పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. తల్లిపాలను తేలికగా బయటకు తీసేందుకు పంపులు వంటి పరికరాలూ అందుబాటులోకి వచ్చాయి. ముందుగానే తీసి, నిల్వచేసిన తల్లిపాలను పిల్లలకు అవసరమైనప్పుడు పట్టవచ్చు. కొందరు తల్లులకు తగినంతగా పాలు పడకపోవచ్చు. అలాంటప్పుడు దాతల నుంచి సేకరించిన తల్లిపాలను కూడా పిల్లలకు పట్టే పద్ధతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. నెలలు నిండకుండా పుట్టిన వారికి తల్లిపాలు తగినంతగా అందకపోవచ్చు. అలాంటి వారికే కాకుండా, రకరకాల కారణాల వల్ల తల్లిపాలు అందని శిశువులకు తల్లిపాలు సరఫరా చేయడానికి ఇటీవల పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మెర్) సంస్థ ఇటీవల తల్లిపాల ఏటీఎం ప్రారంభించింది. ‘అముదం తైప్పాల్ మయ్యమ్’ (ఏటీఎం) పేరిట ఏర్పాటు చేసిన ఈ తల్లిపాల నిల్వ కేంద్రాల ద్వారా అవసరమైన శిశువులకు తల్లిపాలు సరఫరా చేస్తోంది. తల్లిపాల గురించి అవీ ఇవీ...తల్లిపాలు చాలా విలువైనవి. ఇటీవలి కాలంలో ఆన్లైన్లో కొందరు తల్లిపాలను అమ్ముతున్నారు. ఔన్సు తల్లిపాల ధర 4 డాలర్లు (సుమారు రూ.270) పలుకుతోంది. * తల్లిపాలు తాగే శిశువులు వందమందిలో ఉన్నా తమ తల్లిని ఇట్టే గుర్తుపడతారు. ఒకవేళ తల్లిని పోలిన మనిషి తమ తల్లి పక్కనే ఉన్నా, వాసన ఆధారంగా తమ తల్లిని గుర్తుపట్టేస్తారు. * పాలిచ్చే తల్లుల్లో ‘ఆక్సిటోసిన్’ అనే హార్మోన్ సహజంగానే ఉత్పత్తవుతుంది. ఇది తల్లులే కాకుండా, వారి శిశువులు కూడా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండేందుకు దోహదపడుతుంది. * అమెరికాలో ఫ్యాషన్లు రాజ్యమేలిన 1960-70 దశకాల కాలంలో పాలిచ్చే తల్లుల సంఖ్య మరీ తక్కువగా... అంటే దాదాపు 20 శాతం మాత్రమే ఉండేది. తల్లిపాల ప్రాశస్త్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తృత ప్రచారం సాగించడంతో ఇప్పుడు ఈ పరిస్థితి చాలావరకు మెరుగుపడింది. * పిల్లలకు పాలు పట్టడం ద్వారా తల్లులకు వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుంది. రోజులో అవసరమైనన్ని సార్లు పిల్లలకు పాలుపట్టడం వల్ల ఏడు మైళ్ల నడక సాగించినంత వ్యాయామం లభిస్తుంది. * పిల్లలకు పాలు పట్టే తల్లులకు తరచూ దాహం వేస్తూ ఉంటుంది. ఇది సహజమే. దాహం వేసినప్పుడల్లా పుష్కలంగా నీరు తాగుతుంటేనే పిల్లలకు కావలసినంత పాలు ఉత్పత్తవుతాయి. * తల్లిపాలలో ప్రధానంగా వే, కీసిన్ అనే ప్రొటీన్లు ఉంటాయి. పిల్లల రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. -
పాలు పట్టే ముందు... ఆ మూడూ పట్టకండి!
‘తల్లి పాలు బిడ్డకు అమృతం’ అని రోజూ స్మరిస్తూ ఉంటాం. కానీ అవి పిల్లల ఆరోగ్యానికి ఏ పరిస్థితుల్లో క్షేమమో ముందు తెలుసుకోండి. తల్లిపాల అవసరం పిల్లలకు ఎంతో ఉందన్నది వాస్తవం. మరి అలాంటప్పుడు ఆ బిడ్డలు తమ పాలు తాగి ఆరోగ్యంగా ఉండాలంటే తల్లులు ఏం చేయకూడదో కూడా గ్రహించడం మంచిది కదా. ఇటీవల అమెరికాలోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విద్యార్థులు వెల్లడించిన పరిశోధన ఫలితాలను గమనిస్తే ప్రతిరోజూ మనం ఎంత తప్పు చేస్తున్నామో అర్థమవుతుంది. ఇంట్లో నాన్‌స్టిక్ ప్యాన్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు వాడటం ఎంత ప్రమాదమో తెలుస్తుంది. వాటికీ, తల్లి పాలకు ఏం సంబంధం అనుకుంటున్నారా? ఉంది.. దగ్గర సంబంధమే ఉంది. ఈ వస్తువుల్లో ఉండే పీఎఫ్ఏ (పర్‌ఫ్లోరినేటెడ్ ఆల్కలేట్) అనే రసాయనం తల్లి తినే ఆహారంలోకి చేరి స్తన్యం ద్వారా శిశువులపై ప్రభావం చూపుతుందట. అంతేకాదు, ఈ పరిశోధనలో తేలిన ఎన్నో అంశాలు భయాందోళనకు గురి చేస్తున్నాయంటున్నారు డాక్టర్లు. ఈ పీఎఫ్ఏలు పిల్లలలో చేరి కాలేయం, ఒబెసిటి, కిడ్నీ సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్ బారిన కూడా పడేలా చేస్తాయని పరిశోధనలు వెల్లడించాయి. పిల్లలు ఎదుగుతున్న కొద్ది ఆ పీఎఫ్ఏ శాతం వారి శరీరంలో పెరుగుతుందట. దాంతో వారిలో రోగనిరోధక శక్తి తగ్గి ఎప్పుడూ అనారోగ్యం పాలవుతారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని... కాబోయే తల్లులు ఇంట్లో నాన్‌స్టిక్ ప్యాన్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, మైక్రో ఒవెన్లు ఉపయోగించడం మానేసి పసి పిల్లల ఆరోగ్యాలను కాపాడాలని వైద్యులు సూచిస్తున్నారు. -
కొత్త పరిశోధన
చిన్నపిల్లల్లో వచ్చే లుకేమియాను నివారించే తల్లి పాలు చిన్నారుల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబంధమైన క్యాన్సర్లను తల్లిపాలు నివారిస్తాయని ఇజ్రాయెల్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాలలో తేలింది. చిన్నపిల్లలో వచ్చే క్యాన్సర్లలో రక్తసంబంధమైనవి (ల్యూకేమియా) దాదాపు 30 శాతం ఉంటాయి. దాదాపు 18 రకాల అధ్యయనాల్లో తేలిన విషయం ఏమిటంటే కనీసం ఆర్నెల్ల పాటైనా తల్లిపాలు తాగిన వారిలో ఈ బ్లడ్‌క్యాన్సర్లు వచ్చే అవకాశాలను 14 శాతం నుంచి 19 శాతం వరకు తగ్గినట్లు తేలింది. కేవలం క్యాన్సర్ల నివారణ మాత్రమేగాక... తల్లిపాలు అకస్మాత్తుగా కారణం తెలియకుండా పిల్లలు మృతిచెందే కండిషన్ అయిన సడన్ ఇన్‌ఫ్యాంట్ డెత్ సిండ్రోమ్ (ఎస్ఐడిఎస్), ఉదరకోశవ్యాధులు (గ్యాస్ట్రో ఇంటస్టినల్ ఇన్ఫెక్షన్స్), చెవి ఇన్ఫెక్షన్లను నివారిస్తుందని తేలింది. అంతేకాదు... చాలాకాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, టైప్-2 డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువని తేలింది. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘జామా పీడియాట్రిక్స్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
మురి‘పాలు’ దూరం చేయెద్దు..
తల్లి పాలు శిశువుల ఆరోగ్యానికి పౌష్టికాహారం లాగానే ఆవు పాలు కూడా వాటి దూడలకు అంతే ముఖ్యం. ఆ పాలను మనం తస్కరించవద్దంటూ ప్రసాద్ ఐ మ్యాక్స్ వద్ద ఆవు వేషధారణలతో జాగృతి కల్పిస్తున్న పెటా ఇండియా వలంటీర్లు వీరంతా. ఆదివారం మదర్స్ డే సందర్భంగా రెండు రోజుల ముందే శుక్రవారం... ఇలా పిల్లలు ఆవు వేషధారణల్లో కనిపించి... తల్లులందరూ తమ పాలను పిల్లలకు ఇవ్వాలనుకుంటారని... ఆవు కూడా అంతేననే నినాదాలు చేశారు. -సాక్షి, సిటీబ్యూరో -
తల్లిపాలు అమృతం
బిడ్డకు పాలివ్వడం వల్ల బాలింతల్లో రక్తస్రావ ప్రమాదం తగ్గడంతో పాటు త్వరగా కోలుకుంటారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు.ఊబకాయం రాదు. గర్భానికి పూర్వం ఉన్న బరువును తిరిగి పొందుతారు. బిడ్డకు పాలు పట్టించడం వల్ల రొమ్ము, గర్భ సంచి క్యాన్సర్లు రావు.తల్లులకు మలి వయసులో వచ్చే అస్టియేపొరోసిస్(ఎముకల బలహీనత) నుంచి బయటపడుతారు. తల్లి, శిశువుల మధ్య బంధాన్ని పెంపొందిస్తుంది. ఆరు నెలల వరకు బిడ్డకు తప్పని సరిగా రోజుకు 8 నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి. తల్లికి, శిశువుకు జ్వరం వచ్చినప్పుడు, టీకాలు వేసినప్పుడు కూడా పాలు పెట్టొచ్చు. శ్రీకాకుళం రూరల్/పాలకొండ: తల్లి పాలు పిల్లలకు అమృతంలో సమానం. శిశువు సంపూర్ణ ఆరోగ్యానికి దివ్య ఔషధం. తల్లిపాలలో ఉన్న రోగనిరోధక శక్తి ఎందులోనూ ఉండదని వైద్యనిపుణుల భావన. తల్లిపాలు సమృద్ధిగా లభించే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఎదుగుతారు. అయితే, ప్రస్తుత ఆధునిక పోకడలతో చాలా మంది తల్లులు పిల్లలకు పాలివ్వడం నామోషీగా భావిస్తున్నారు. ఇలాంటి వారికి తల్లిపాలు విశిష్టతను తెలియజేయడం... తల్లిపాలను బిడ్డకు ఎంత వయసు వచ్చే వరకు ఇవ్వాలి.. రోజుకు ఎన్ని సార్లు పట్టాలి.. తల్లిపాలు పుష్కలంగా పిల్లలకు అందాలంటే తల్లులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. తదితర అంశాలపై గ్రామీణ, పట్టణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి ఏడో తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించనున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో నాలుగు రోజుల పాటు ఆరోగ్యశాఖ అనుబంధంతో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. తల్లిపాలు శ్రేష్టమైనవని, ప్రతి ఒక్క బాలింత బిడ్డలకు పాలిచ్చి పిల్లలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని వైద్యులు సూచి స్తున్నారు. తల్లిపాల నుంచి పిల్లలకు లభించే పోషకాలను చూస్తే... బిడ్డ పుట్టిన మొదటి అరగంట లోపు పిల్లలకు పాలివ్వడం మం చిది. ఇందులో మాంసకృత్తులు, విటమిన్ ఏ ఉంటాయి. రోగ నిరోధక శక్తి లభిస్తుంది. ముర్రుపాలు బిడ్డను జీవితకాలం కాపాడతాయి. శిశువు పేగులను శుభ్రం చేసి, మొదటి మల విసర్జనకు తోడ్పడతాయి. తల్లులు సహజంగా బిడ్డకు సరిపడా పాలు రావడం లేదని అనుకోవడం అపోహా మాత్రమే. బిడ్డ పుట్టగానే పాలు మూడు, నాలుగు రోజుల వరకు పడవని తేనె నాకించడం, పంచధార, గ్లూకోజ్ నీళ్లు ఇవ్వరాదు. తల్లిపాలే శిశువుకు సంపూర్ణమైన సమతుల ఆహారం. నాణ్యమైన ప్రోటీన్లు లభిస్తాయి. బిడ్డ మెదడుకు వికాసానికి తోడ్పడతాయి. ఇందులోని లాక్టోజ్ వల్ల కాల్షియం నిల్వలు పెరుగుతాయి.బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి. తొలి నెలలో శిశువులకు వివిధ రకాల అంటువ్యాధుల భారినుంచి కాపాడతాయి. బిడ్డ మనోవికాశానికి దోహదపడతాయి. జీర్ణ మండలాన్ని వృద్ధి చేస్తాయి. తల్లిపాల ద్వారా బిడ్డలకు డయోరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధులు దరిచేరవు. క్యాన్సర్, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండె జబ్బులు వంటి వ్యాధులభారి నుంచి రక్షణ కల్పిస్తాయి. ఎలర్జీ, ఆస్తమా, డయాబెటీస్ వంటి వ్యాధులు రావు. బాల్యంలో, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ. తల్లిపాలు పుష్కలంగా రావాలంటే.. గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. పాలు, చేపలు, గుడ్లు, వెల్లుల్లిపాయ, తాజా కూరగాయలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. ఆహారంలో తీపి పదార్థాలు (స్వీట్లుకాదు) అంటే ప్రకృతి సహజంగా దొరికే పం డ్లు కడిగిన తర్వాత తినాలి. ఫ్యాషన్ పోకడలు వీడాలి నరసన్నపేట: అమ్మప్రేమ కన్నా మించినది లేదు. తల్లిపాలకు మించిన పోషక పదార్థం సృష్టిలో మరొకటి లేదు. అరుుతే, ప్రస్తుత పాశ్యాత్య సంస్కృతి, ఫ్యాషన్ ప్రపంచంలో అందం కాపాడుకునేందుకు, పిల్లలకు పాలిచ్చేం దుకు కూడా వెనుకంజవేసే తల్లులు ఎక్కువవుతున్నారని, ఇది సమాజ శ్రేయస్సుకు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాతృప్రేమ మాధుర్యాన్ని వదులుకోవడం ఆందోళనకర విషయంగా పేర్కొన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో రెడీమేడ్ దుస్తులు మాదిరిగా మార్కెట్లో బిడ్డలను అమ్మేవారు ఉంటే కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్న మహిళలు కళ్లెదుటే కనిపిస్తుండడం, చివరికి వృద్ధాప్యంలో పోషణకు పనికి వచ్చే పరికరాలుగా బిడ్డలను ఉపయోగించుకునే సంస్కృతి కూడా మరికొద్ది రోజులకి వస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో తల్లిపాత్ర, మాతృత్వంలో అనుభూతి , మానవత్వం విలువలు సమాజానికి తెలియజేయాల్సిన అవసరం స్వచ్ఛంద సంస్థలకు, మహిళా శిశుసంక్షేమ శాఖకు ఉంది. సెట్‌టాప్ విధానం అంటే... కేబుల్ టీవీ కనెక్షన్ ద్వారా ఎనలాగ్ సిగ్నల్స్‌తో టీవీ చానల్స్‌ను వీక్షించిన మనకు పదో, పన్నెండో చానల్స్ తప్ప మిగిలిన దాదాపు అన్ని చానల్స్ చుక్కలుచుక్కలతో ప్రసారాలు జరగుతున్నాయి. అలా కాకుండా ఈసెట్ టాప్ బాక్సుల ఏర్పాటుతో పూర్తిస్థాయి డిజిటల్ సిగ్నల్స్‌తో హెచ్డీ నాణ్యత (హాత్వే డిజిటల్ క్వాలిటీ)తో ప్రసారాలకు అవకాశముంటుంది. మనం కోరుకునే చానల్స్‌ను ఒక ప్యాకేజీగా చూసుకునే అవకాశముంది. అనవసర చానల్స్‌ను వద్దనుకునే సౌకర్యం కూడా ఉంది. కేవలం 500 మెగా హెడ్జ్ పౌనఃపుణ్యంతోనే సుమారు 300 నుంచి 400 చానల్స్‌ను అదే క్వాలిటీతో చూడవచ్చు. అదే ఎనలాగ్ ప్రసారాలతో పోల్చితే సుమారు 360 మెగా హెడ్జ్ ఫ్రీక్వెన్సీ తక్కువతోనే సెట్ టాప్ బాక్సులతో క్వాలిటీ దృశ్యం సాధ్యపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ తల్లిపాల లో అధిక వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. బిడ్డ పుట్టిన అరగంట నుంచే తల్లిపాలు తాగించడం నేర్పాలి. మొదటి మూడు రోజుల పాలు ఎంతో ప్రయోజనమైనవి. ఆరు నెలల వరకు పాలు పట్టించాలి. తల్లిపాలు పట్టించడం వల్ల పిల్లలకు సరిపడిన పాలు ఉత్పత్తి అవుతాయి. పిల్లలకు అవసరమయ్యే ప్రొటీన్లు, మాంసకృత్తులు, కాల్షియం, కొవ్వు పదార్థాలు, ఐరన్ వంటివి తల్లిపాలలో లభ్యమవుతాయి. -డాక్టర్ రౌతు భారతి, స్త్రీ వైద్య నిపుణురాలు, పాలకొండ -
అమృతాన్ని పంచే అమ్మలు!
తల్లిప్రేమకు సాటి మరేదీ రాదు. అలాగే తల్లిపాలకు కూడా. తల్లిపాలకు ప్రత్యామ్నాయం లేదు. అమ్మ పాలు అంటే అమృతమే... ఆ అమృతాన్ని పంచగలిగింది అమ్మలే!! మరి పురిటిలోనే తల్లికి దూరమైన బిడ్డకు? మరో తల్లి పెద్ద మనసుతో తన బిడ్డతోపాటు తల్లిలేని బిడ్డకూ పాలివ్వడం ఒక్కటే మార్గం. అందుకు ముందుకు వచ్చే వాళ్లెంతమంది? ఆ ప్రశ్నకు సమాధానంగా ‘నేనున్నాను’ అన్నారు లక్ష్మి. అలా ముందుకొచ్చే లక్ష్మిలాంటి ఎంతోమంది నుంచి పాలను సేకరించి, చంటి పాపలకు ఆ అమృతాన్ని అందించేందుకు ఇప్పుడు ఓ ‘అమ్మ పాల బ్యాంకు’ ప్రయత్నం జరుగుతోంది. లక్ష్మి తొమ్మిదవ నెల గర్భిణి. ప్రసవం అయిన తర్వాత తన బిడ్డతోపాటు మరో బిడ్డకు కూడా తన పాలనిచ్చి ఆ బిడ్డకు తల్లిపాల లోటును భర్తీ చేస్తానంటూ ‘అమ్మ పాల బ్యాంకు’కు పాలను దానమిచ్చే తొలి దాత అయ్యారు. తన సంకల్పానికి భగవంతుడు సహకరించి తగినన్ని పాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారామె. అమ్మ పాలను నిల్వ చేయడం, దానమివ్వడమనే ఆలోచన ఇప్పుడు ‘అమ్మ పాల బ్యాంకు’గా హైదరాబాద్‌లో ఆచరణలోకి వస్తోంది. తల్లిదండ్రులకు దూరమైన బిడ్డలు, తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యానికి బలైపోయి చెత్తకుప్పలోకి విసిరివేతకు లోనయిన చంటిబిడ్డలకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. వారిని పెంచి పెద్ద చేసి పిల్లల్లేని వారికి దత్తతనిస్తోంది కూడా. అలాంటి పిల్లలు హైదరాబాద్‌లోని ఒక్క శిశువిహార్‌లోనే వందల్లో ఉంటున్నారు. సరాసరిన రోజుకు పదహారు మంది చంటిబిడ్డలు కొత్తగా వచ్చి చేరుతూనే ఉన్నారు. కొందరిని పెంపకానికి తీసుకునే వాళ్లు తీసుకెళ్లే ప్రక్రియ కొనసాగుతూ ఉండగా... ఏడాదిలోపు పిల్లలు దాదాపు 80 మంది వరకు ఉంటున్నారు. వారందరినీ ప్రభుత్వం పోతపాలతో పోషిస్తోంది. వైద్యం అందిస్తోంది. తల్లిపాలు అందకపోతే అంటువ్యాధులు సులభంగా దాడిచేస్తాయి. పుట్టిన ప్రతి ఐదుగురిలో ఒక బిడ్డ మొదటి పుట్టిన రోజును చూడకనే కన్నుమూస్తోందని, పిల్లలకు తల్లిపాలతోనే ఆరోగ్యకరమైన భావితరం తయారవుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎ.పి బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనూరాధారావు అనాథ పిల్లలకు తల్లిపాలను అందించడానికి ‘అమ్మ పాల బ్యాంకు’ను ఏర్పాటు చేశారు. పాలను దానం చేయాలనుకునే తల్లులను గుర్తించడం, పాలను సేకరించడం, నిల్వ చేయడం, ఆ పాలను అవసరమైన పిల్లలకు చేర్చడం ఈ ప్రక్రియకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రపంచ పిల్లల దినోత్సవం సందర్భంగా ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్‌కే పరిమితమైన ఈ ప్రయత్నంలో పేరు నమోదు చేసుకున్న తల్లుల దగ్గరకు ‘అమ్మపాల బ్యాంకు’ కార్యకర్తలు రోజుకొకసారి వెళ్లి పాలను సేకరిస్తారు. తమతోపాటు సక్కర్, చల్లదనాన్ని నిలిపి ఉంచే ఫ్లాస్కు తీసుకెళ్తారు. ఆ పాలను స్థానిక లోటస్ హాస్పిటల్‌లోని ఫ్రీజర్‌లో ఉంచడానికి హాస్పిటల్ నిర్వాహకులు అంగీకరించారు. ఆ పాలను చంటిబిడ్డలకు చేర్చడం కూడా కార్యకర్తలే చేస్తారు. పాల సేకరణ పనిలో మహిళలే ఉంటారు. మరో బిడ్డకు ప్రాణదానం చేసిన సంతృప్తి! పాల దానం చేయడం ద్వారా మరో బిడ్డకు ప్రాణం పోసిన తల్లిగా సంతృప్తిని పొందవచ్చు. అయితే ‘‘నీ ఉదారత చాటుకోవడం కోసం కన్న బిడ్డను అర్ధాకలితో ఉంచుతావా’’ అని భర్త, అమ్మానాన్నలు, అత్తమామలు ప్రశ్నించడం సహజమే. సంగతిని వివరించి వాళ్లను సమాధానపరచడం చాలా ముఖ్యం. ఈ సందేహాలను నిపుణులు నివృత్తి చేస్తారు. పాలను దానం చేసే తల్లులు క్యాల్షియం లోపం రాకుండా, రక్తహీనతకు లోనుకాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలు... ఇద్దరు బిడ్డలకు పాలివ్వడం కష్టమేమీ కాదు. తల్లిపాలదానం అనే జ్యోతిని లక్ష్మి ఉదాత్తమైన మనసుతో అందుకున్నారు. ఆమె నుంచి ఈ జ్యోతిని అందుకుంటూ ప్రస్థానాన్ని కొనసాగించడానికి మరెందరో తల్లులు ముందుకు వస్తారు. ఇందుకు నిదర్శనం ప్రారంభోత్సవం రోజునే హైదరాబాద్‌లోని మదీనాగూడలోని సత్యవేణి మురుగన్ నుంచి వచ్చిన ఫోన్‌కాలే!. బిడ్డ కోసం తల్లి ఏం చేయడానికైనా సిద్ధమవుతుంది. తల్లి మనసు... తల్లి లేని బిడ్డకు తల్లి ప్రేమను పంచడానికి ఏ మాత్రం సంశయించదు. తల్లి పాలు లేని బిడ్డను కూడా ఆదరించగలుగుతుంది. అందుకే ప్రపంచంలో అన్నింటికంటే తల్లి గొప్పది, తల్లి మనసు ఇంకా గొప్పది. అచ్చం తల్లిపాలలాగే. - వాకా మంజులారెడ్డి ఫొటో: ఠాకూర్ దేశంలో ఇదే తొలి ప్రయత్నం! దేశంలో ఈ ప్రక్రియ దాదాపు పది హాస్పిటళ్లలో ఉంది. అనారోగ్య కారణాల వల్ల తల్లి లేదా బిడ్డ ఐసియులో ఉన్నప్పుడు తల్లి నేరుగా పాలివ్వడం కుదరదు. అలాంటప్పుడు తల్లి నుంచి సేకరించిన పాలను హాస్పిటల్ వాళ్లే బిడ్డకు టైమ్ ప్రకారం పడతారు. అయితే ఈ పద్ధతిని తల్లికి దూరమైన బిడ్డలకు పట్టే ప్రయత్నం చేయడం మాత్రం మన దేశంలో ఇదే మొదటిసారి. గతంలో పురిట్లో తల్లిపోయిన బిడ్డలకు మరో తల్లి విశాల దృక్పథంతో తనబిడ్డతోపాటుగా పాలిచ్చి బతికించేది. అలాంటిదే ఇది కూడా. - అనూరాధారావు, ఎ.పి బాలల హక్కుల సంఘం నిర్వాహకురాలు తల్లులకు ఏ రకంగా మేలు! సెల్ఫ్ కాంట్రాసెప్టివ్... సాధారణంగా పాలిస్తున్నంత కాలం గర్భధారణ జరగదు. బినైన్ కణుతులు... పాలు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా వినియోగించుకోని వారిలో రొమ్ములలో బినైన్ కణుతులు ఏర్పడడాన్ని గమనిస్తుంటాం. ఇవ్వగలిగినంత కాలం బిడ్డకు పాలివ్వడం వల్ల ఈ కణుతులను నివారించవచ్చు. బిడ్డను కోల్పోయిన మహిళ మానసిక స్థితి ఆందోళనకరంగా ఉంటుంది. అలాంటి వారు ఈ సమయాన్ని మరో బిడ్డకు పాలివ్వడానికి కేటాయిస్తే మానసిక సాంత్వన కలుగుతుంది. ఒక బిడ్డ ప్రాణాన్ని నిలుపుతున్నాననే సంతోషం ఉంటుంది. తల్లి పాల గురించి ... - చంటిబిడ్డకు రోజుకు 150 మిల్లీలీటర్ల తల్లిపాలు కావాలి. - ఆరోగ్యవంతమైన తల్లికి రోజుకు 600- 700 మి.లీ పాలు ఉత్పత్తి అవుతాయి. - ఒక బిడ్డ గరిష్ఠంగా 300 మిల్లీలీటర్ల పాలను మాత్రమే తాగుతుంది. - తల్లి నుంచి సేకరించిన పాలను 63 డిగ్రీల ఫారన్హీట్లోపు ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తే 90 రోజులు ఉంటాయి. పాశ్చరైజేషన్ చేస్తే ఆరు నెలలు పాడవవు. - ఎందరు తల్లుల పాలనైనా కలిపి ఒకే పాత్రలో నిల్వ చేయవచ్చు. - మొదటిసారి పాలను సేకరించిన తర్వాత ఆ పాలను స్క్రీనింగ్ చేస్తారు. అవకాశం ఉంటే వదులుకోవద్దు! అవసరం నుంచి వచ్చిన ఆలోచన ఇది. పాలు లేని పిల్లలు ఎదురుగా కనిపిస్తుంటే చూస్తూ ఊరుకోవడం చేతకాలేదు. నా భర్త వెంటనే ఒప్పుకున్నారు. తర్వాత నా బిడ్డకు వచ్చిన నష్టం ఏమీ లేదని అమ్మకు, అత్తగారికి వివరించాను. నేను బాలింతలకు చెప్పేది ఒక్కటే... ‘మరో బిడ్డను కాపాడే అవకాశం ఉంటే దానిని అనవసరమైన భయాలతో వదులుకోవద్దు. ప్రాణం పోయడంలో ఉండే ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి’ అని. - లక్ష్మి, అమ్మపాల దానానికి సిద్ధపడిన కాబోయే తల్లి