అమ్మపాలు..అమృతం | Ammapaluamrtam | Sakshi
Sakshi News home page

అమ్మపాలు..అమృతం

Published Mon, Aug 1 2016 5:32 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

అమ్మపాలు..అమృతం

అమ్మపాలు..అమృతం

  • తాగితే బిడ్డకు.. తాపిపే జననీకి రక్ష
  • తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం
  •  ఇంతకు మించిన పౌష్టికాహారం లేదంటున్న నిపుణులు
  • తల్లిపాలతో శిశుమరణాలూ తగ్గుతాయ్‌
  •  జోగిపేటబిడ్డకు అమ్మ పాలు వరం. సహాజం.. సురక్షితం .. పుష్టికర  ఆహారం , అన్ని పోషకాలు అందించి.. అన్నిరోగాల నుంచి రక్షించగలిగే అమృతం. పోతపాల కంటే తల్లి పాలు తాగే పిల్లలు బలంగా తెలివిగా ఉంటారన్నది నిరూపితమైన వాస్తవం. అపోహలు పోగొట్టి.. మరింత విస్తృత ప్రచారం కల్పించడానికి తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. వారోత్సవాలు ఈ నెల 1న ప్రారంభమయ్యాయి. 7వ తేదీ వరకు జరుగుతాయి.

    తల్లిపాలకు మించిన ఆహారం బిడ్డకు మరెందులోనూ దొరకదు. రోగ నిరోధక శక్తి అధికంగా ఉండే అమ్మపాల అద్భుతాలెన్నో.. కాన్పు అయిన మొదటి 3-4రోజులు వచ్చే ముర్రు పాలలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. బిడ్డకు విటమిన్‌ ఏ, బీ, ఐరన్‌ పుష్కలంగా అందుతాయి. జిల్లా వ్యాప్తంగా తల్లిపాల అవశ్యకత గురించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివిధ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నారు. ఆశ వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి తల్లి పాల ఆవశ్యకతను గురించి అవగాహన కల్పిస్తున్నారు.
    6 నెలల వరకు ...
    బిడ్డ పుట్టిన గంటలోపు నుంచి 6 నెలల వరకు తల్లిపాలు తప్ప మరే పదార్థాలూ ఇవ్వకూడదు. తల్లి పాలు తేలికగా అరుగుతాయి. అంతే కాకుండా శుభ్రంగా ఎటువంటి క్రిములు లేకుండా ఉంటాయి. శ్వాసకోశ, అలర్జీ అస్తమా, చర్మవ్యాధుల నుంచి పిల్లలను రక్షిస్తాయి. బిడ్డ మానసిక శారీరక వికాసానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. రోజులో బిడ్డకు 8-10 సార్లు పాలు ఇవ్వాలి.
    తల్లీబిడ్డ క్షేమం..
    ఆరు మాసాల తర్వాత నుంచి బిడ్డకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా పాలు పట్టాలి. దీనివల్ల ఎలాంటి చర్మవ్యాధులు దరి చేరకుండా బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. బిడ్డలకు పాలివ్వడం తల్లికి కూడా ప్రయోజనకరమే. తల్లికి రొమ్ము, గర్భసంచి క్యాన్సర్‌ వంటి వ్యాధులు దరిచేరవు. నెలసరిలో రక్తస్రావం తక్కువగా ఉంటుంది. పాలిచ్చినంత కాలం మళ్లీ గర్బ నిరోధకంగా కూడా పనిచేస్తుంది.
    సంజీవని ..
    తల్లి పాలు అమృతంతో సమానం. ఖరీదు కట్టలేనివి, బిడ్డకు తల్లికి కుటుంబానికి ఉపయోగం డబ్బా పాలతో అన్ని కష్టాలే. తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి.శిశువు పుట్టిన వెంటనే గంటలోపే తల్లిరొమ్ము అందించి ముర్రుపాలు  తప్పని సరిగా పట్టాలి. వ్యాధుల నుంచి రక్షించే శిశువుకు కావలసిన ఖనిజాలు, మాంసకృత్తులు, విటమిన్‌ ఏ సమృద్ధిగా ఉంటాయి.

    వ్యాధుల నుంచి రక్షించే యాంటీబాడీలు ఉంటాయి. బిడ్డపేగుల నుంచి విసర్జకాలను తొలగించడానికి, అలర్జీలు రాకుండా నిరోధించడానికి ముర్రుపాలు తోడ్పడతాయి. ఒక్కమాటలో చెప్పా లంటే ముర్రుపాలలో శిశువుకు కావలసిన అన్ని పోషకవిలువలు బిడ్డ శరీరానికి అందుతాయి.బిడ్డకు మొదట వ్యాధి నిరోధక టీకాగా పనిచేస్తుంది.శిశువులకు ప్రకృతి ప్రసాదించిన సహజ అత్యుత్తమమైన పౌష్టికాహరం‡ బిడ్డకు  సులువుగా జీర్ణమవుతాయి.

    తల్లి పాలవలన మలవిసర్జన సులభంగా జరుగుతుంది. శిశువులకు దృష్టిలోపం రాకుండా నివారించడానికి దోహదపడతాయి.తల్లికీ, బిడ్డకు చక్కని అనుబంధం ఏర్పడుతుంది. వ్యాధుల బారి నుంచి తల్లిపాలు రక్షిస్తుంది.  తల్లిపాలు సురక్షితమైనవి రోజులో 24 గంటలూ తల్లిపాలు లభిస్తాయి. తల్లిపాలలో శిశువులకు కావలసిన అన్ని పోషక పదార్థాలన్నీ పూర్తి మోతాదులో ఉంటాయి. తల్లిపాలు తాగే పిల్లలు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశం (సడన్‌ ఇన్‌ ఫాంట్‌ డెత్‌ సిండ్రోం) తక్కువని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది.తల్లిపాల వలన పోషకాహార లోపాలు తగ్గి 13 శాతం శిశుమరణాలరేటు తగ్గించవచ్చు.

    శస్త్రచికిత్స ద్వారా (సిజేరియన్‌) పుట్టిన పిల్లలకు కూడా వెంటనే తల్లిపాలు ఉగ్గుగిన్నెతో పట్టించాలి. తల్లిపాలు తాగే శిశువులకు తల్లి పాల నుండి తగినంత నీరు లభిస్తుంది.దీర్ఘకాల వ్యాధులు ఉన్న తల్లులు వైద్యులు సలహామేరకు శిశువులకు పాలివ్వాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు ప్రకారం శిశువుల గరిష్ఠ పెరుగుదలను మానసికాభివృద్ధిని ఆరోగ్యాన్ని సాధించాలంటే వారికి మొదట 6 నెలలపాటు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలి.ఆరునెలల తర్వాత ఎదుగుతున్న శిశువు, పెరుగుతున్న అవసరాలు తీర్చడం కోసం శిశువులకు ఇష్టపూర్వ కమైన ఇంట్లోనే లభ్యమయ్యే పౌష్ఠిక విలువలున్న ద్రవ /ఘణ అనుబంధ ఆహారాన్ని ఇస్తూ... రెండు సంవత్స రాల వరకు తల్లిపాల పోషణను కొనసాగించాలి.

    అనుబంధ ఆహారాన్ని తయారు చేయడంలోనూ, తినిపించడం లోనూ పరిశుభ్రతను పాటించాలి.ఆరునెలల తర్వాత ఎదుగుతున్న శిశువు, పెరుగుతున్న అవసరాలు తీర్చడం కోసం శిశువులకు ఇష్టపూర్వ కమైన ఇంట్లోనే లభ్యమయ్యే పౌష్ఠిక విలువలున్న ద్రవ /ఘణ అనుబంధ ఆహారాన్ని ఇస్తూ... రెండు సంవత్స రాల వరకు తల్లిపాల పోషణను కొనసాగించాలి. అనుబంధ ఆహారాన్ని తయారు చేయడంలోనూ, తినిపించడం లోనూ పరిశుభ్రతను పాటించాలి.
    ఇద్దరికి మంచిదే...
     ఉభయులకు లాభదాయకమే.. తల్లిపాలవల్ల శిశువుకే కాదు...తల్లికి కూడా అనేక లాభాలు ఉన్నాయి. కొన్ని రకాల (ఉదాహరణకు : రొమ్ము గర్భసంచి, అండాశయం మొదలగు క్యాన్సర్లు) క్యాన్సర్లు తక్కువగా వస్తాయని, అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రసవ సమయంలో స్థిరత్వం కోల్పోయిన గర్భసంచి పూర్వ స్థితికి వచ్చి అధిక రక్తస్రావం తగ్గడం, శిశువుకు తల్లిపాలతోనే పెంచినట్లయితే హార్మోన్లు ప్రభావంతో 6 నెలల వరకు అండం విడుదల కానందువలన గర్భధారణ జరుగదు

    కాబట్టి తల్లికి ఇది తాత్కాలిక కుటుంబ నియంత్రణగా ఉపయోగపడుతుంది. (ఈ పద్థతినే ’’లాక్టేషనల్‌ ఎమోనోరియా లేదా లామ్‌’’ అని అంటారు.)తల్లిపాల సంస్కృతి ఒక సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించి తల్లిపాల సంస్కృతిని పెంపొందించుకోవాలి.ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించి తల్లిపాల సంస్కృతిని పెంపొందించుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement