తల్లి పాలతో పిల్లల్లో బ్లడ్‌క్యాన్సర్ల నివారణ | Prevention of blood cancer in children with mother milk | Sakshi
Sakshi News home page

తల్లి పాలతో పిల్లల్లో బ్లడ్‌క్యాన్సర్ల నివారణ

Published Mon, Apr 24 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM

తల్లి పాలతో పిల్లల్లో బ్లడ్‌క్యాన్సర్ల నివారణ

తల్లి పాలతో పిల్లల్లో బ్లడ్‌క్యాన్సర్ల నివారణ

మహాభాగ్యం

తల్లిపాలు... ఎంత మేలు చేస్తాయన్నది అందరికీ తెలిసిందే. ఆ పాలకు ఉన్న అనేక మహత్యాలను ఇజ్రాయెల్‌ పరిశోధకులు తెలుసుకున్నారు. చిన్నారుల్లో వచ్చే అన్ని రకాల రక్త సంబంధమైన క్యాన్సర్లను తల్లిపాలు నివారిస్తాయని పేర్కొంటున్నారు. చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లలో రక్తసంబంధమైనవి (ల్యూకేమియా) దాదాపు 30 శాతం ఉంటాయి. కనీసం ఆర్నెల్లపాటైనా తల్లిపాలు తాగిన పిల్లల్లో ఇలాంటి బ్లడ్‌క్యాన్సర్లు వచ్చే అవకాశాలు 14 శాతం నుంచి 19 శాతం వరకు తగ్గుతాయని దాదాపు 18 రకాల అధ్యయనాల్లో తేలింది.

అంతేకాదు... సడన్‌ ఇన్‌ఫ్యాంట్‌ డెత్‌ సిండ్రోమ్‌ (ఎస్‌ఐడిఎస్‌), ఉదరకోశవ్యాధులు (గ్యాస్ట్రో ఇంటస్టినల్‌ ఇన్ఫెక్షన్స్‌), చెవి ఇన్ఫెక్షన్లనూ తల్లిపాలు నివారిస్తాయని తేలింది. ఇక చాలా కాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలకు భవిష్యత్తులో స్థూలకాయం, టైప్‌–2 డయాబెటిస్‌ వచ్చే రిస్క్‌ కూడా చాలా తక్కువనే మరో విషయం సైతం తేటతెల్లమైంది. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘జామా పీడియాట్రిక్స్‌’ అనే మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement