మిస్టర్ పర్ఫెక్ట్ దక్కనందుకు బాధ!
తమన్నా అందంగా ఉంటుంది. చక్కగా నటిస్తుంది. హిందీ అమ్మాయి అయినా తెలుగు స్వీట్‌గా మాట్లాడుతుంది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. తమన్నా గురించి ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని...
ఇంట్లో ఉన్నప్పుడు తన పెంపుడు కుక్క పిల్ల ‘బబుల్స్’తో రోజంతా ఆడుకోవడం తమన్నాకి చాలా ఇష్టం. వేరే పని ఏదీ పెట్టుకోకుండా రోజంతా బబుల్స్‌తో ఆడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి మంచం మీద పడుకుని, సీలింగ్ వైపు అదే పనిగా చూడటం ఈ బ్యూటీకి ఉన్న అలవాట్లలో ఒకటి తమన్నాకి వంట చేయడం చాలా ఇష్టం. కానీ, మంచి కుక్ కాదు. ఎప్పుడైనా గరిటె తిప్పితే వంట మొత్తం వండుతారు. ఉప్పు మాత్రం వెయ్యడం మర్చిపోతారు. చివరికి ఆమ్లెట్ తయారు చేసుకున్నా సాల్ట్ యాడ్ చేసుకోవడం మర్చిపోతారు. ఎప్పుడైనా ఉప్పు మర్చిపోకపోతే అది తినేవాళ్ల అదృష్టం అన్నమాట ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం తమ్మూ అలవాటు. ముఖ్యంగా ఓషో రాసే పుస్తకాలను ఇష్టపడి చదువుతారు. అలాగే, పాలో కొయిలో రాసిన పుస్తకాలు కూడా చదువుతారు ఒంటరితనం అంటే ఈ బ్యూటీకి అసహ్యం. నలుగురితో కలిసి ఉన్నప్పుడు ఆ ఆనందమే వేరు అంటారు ముంబయ్‌లో ఉంటే ఫ్రెండ్స్‌తో షాపింగ్ మాల్స్‌కి వెళ్లి, భారీగా షాపింగ్ చేస్తారు. రెస్టారెంట్స్‌కి వెళ్లి నచ్చివన్నీ ఓ పట్టుపడతారు. స్ట్రీట్ ఫుడ్ కూడా లాగిస్తారు. ఇంకా స్నేహితులతో సినిమాలకు కూడా వెళుతుంటారు తమన్నాకు నచ్చే రంగులు తెలుపు, ఎరుపు, నీలం. వైట్ కలర్ తనకు బాగా నప్పుతుందంటారామె.
రంగు రంగుల గౌన్లు, చీరలంటే ఆమెకు ఇష్టం తాను నటించిన చిత్రాలు కాకుండా ఇతర కథానాయికలు నటించిన చిత్రాల్లో తమన్నాకి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చాలా ఇష్టం. ఆ చిత్రంలో కాజల్ అగర్వాల్ చేసిన పాత్ర తనకు వచ్చి ఉంటే బాగుండేదని ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చూసినప్పుడల్లా అనుకుంటారు హీరోయిన్ అవ్వాలని చిన్నప్పుడే తమన్నాకు ఉండేది. అందుకే తనకు నచ్చిన హీరోయిన్లను అనుకరిస్తూ. అద్దం ముందు నిలబడి యాక్ట్ చేసి చూసుకునేదట చిన్ని తమన్నా ఈ మధ్య తమన్నా ఒక విషయానికి బానిస అయ్యారు. కొత్త ఫోన్ కొనుక్కున్నారు. బాగా డ్రెస్ చేసుకున్న ప్రతిసారీ సెల్ఫీ దిగుతున్నారు. సెల్ఫీకి బానిస అయ్యానని ఇటీవల ఓ సందర్భంలో తమ్మూ పేర్కొన్నారు.