ఇటలీ ప్రధానిగా ముస్సోలినీ
ఆ నేడు 30 అక్టోబర్,1922
ఇటలీలో ప్రముఖ రాజకీయ నాయకుడు, జర్నలిస్టు, ఫాసిజం సృష్టికర్త, జాతీయ ఫాసిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు బెనిటో ముస్సోలినీ ప్రధానిగా ఇటలీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టాడు. మొదట ప్రజలచేత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై, రాజ్యాంగబద్ధంగా పాలించిన ముస్సోలినీ, 1925లో నియంతగా మారి, 1943లో జరిగిన తిరుగుబాటుతో పదవీచ్యుతి పొందేవరకు సుదీర్ఘకాలం ఇటలీని పాలించాడు.
రెండవ ప్రపంచ యుద్ధంలో కీలకపాత్ర పోషించిన ముస్సోలినీ, ఫ్రాన్స్, జర్మనీలతో కలిసి అక్షరాజ్యాలను ఏర్పాటు చేశాడు. ఇటలీ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ముస్సోలినీ పేరు ఫాసిస్టుగా, నియంతగా శాశ్వతంగా నిలిచి పోయింది.