ఆవాల అచ్చటా ముచ్చటా...
తిండి గోల
ఆవాలు లేకుండా ఆంధ్రుల మనుగడను ఊహించడం కష్టం. ఎందుకంటే, ఆంధ్రుల అభిమాన ఆవకాయ పెట్టాలంటే అవే కీలకం మరి. పాశ్చాత్య ప్రపంచంలో రోమన్లు ప్రాచీన కాలంలోనే ఆవాల వాడుకను ప్రారంభించినట్లు ఆధారాలు ఉన్నాయి. మన దేశంలో ఆవాల వాడుక క్రీస్తుపూర్వం ఐదో శతాబ్ది నాటికే ఉండేదనేందుకు బుద్ధుని చరిత్రే నిదర్శనం.
యూదు పురాణాల్లోను, బైబిల్‌లోను కూడా ఆవాల ప్రస్తావన ఉంది. ఆవాల ఉత్పాదనలో కెనడా అగ్రస్థానంలో ఉండగా, మన పొరుగు దేశాలైన నేపాల్, మయన్మార్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉండటం విశేషం. మనం ఎక్కువగా నల్లని ఆవాలనే వాడుతుంటాము. అయితే, పసుపు రంగులో ఉండే ఆవాలు కూడా చాలా ప్రాంతాల్లో వాడతారు. మన దేశంలో బెంగాలీలు ఎక్కువగా ఆవనూనెను వాడతారు.