సర్వేజనాః
మన ప్రాంతంలో పెళ్లి కాగానే అమ్మాయి ఇంటి పేరు మారుతుంది. కొన్నిచోట్ల భర్త పేరును సెకండ్ నేమ్‌గా చేసుకొంటున్నారు భార్యలు. అయితే తాజాగా షాదీ డాట్‌కామ్ వారు చేసిన ఒక సర్వేలో ఓ అభిప్రాయం వ్యక్తమైంది. దాదాపు 66 శాతం మంది మహిళలు పెళ్లితో తమ ఇంటి పేరును మార్చుకోవడం, భర్త పేరును వెనుక తగిలించుకోవడం అనవసరం అని అభిప్రాయపడ్డారు. మిగిలిన 34 శాతం మంది మాత్రం పెళ్లితో ఇంటి పేరును మార్చుకోవడం స్వాగతించదగ్గ పరిణామమేనని అభిప్రాయపడ్డారు. సర్టిఫికెట్లలో ఎలాగూ పుట్టినింటి పేరే ఉంటుంది. విద్యా, ఉద్యోగాల్లో తప్పనిసరిగానైనా అదే పేరును కొనసాగించాల్సి ఉంటుంది. ఇక భర్త ఇంటి పేరును తన పేరు పక్కకు తెచ్చుకోవడం అలంకరణే అవుతుందనే అభిప్రాయం ఈ సర్వేలో వ్యక్తమైంది.
పెళ్లితో పేరు మార్చుకోవాలా!
Published Wed, Nov 5 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement