Shaadi dot com
-
10 యాప్ సంస్థలపై గూగుల్ చర్యలు
న్యూఢిల్లీ: సర్వీస్ ఫీజు చెల్లింపుల వివా దం కారణంగా టెక్ దిగ్గజం గూగుల్ పలు యాప్ సంస్థలపై చర్యలకు ఉపక్రమించింది. వాటిని తమ ప్లేస్టోర్ నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించింది. అనేక అవకాశాలు ఇచి్చనప్పటికీ, తమ ప్లాట్‌ఫామ్‌తో ప్రయోజనం పొందుతున్న ‘పేరొందిన’ పది సంస్థలు ఫీజులు చెల్లించడం లేదని సంస్థ పేర్కొంది. అయితే, గూగుల్ సదరు సంస్థల పేర్లను నిర్దిష్టంగా వెల్లడించలేదు. కానీ, షాదీ, మ్యాట్రిమోనీడాట్కా మ్, భారత్ మ్యాట్రిమోనీ వంటి యాప్స్ కోసం ఆండ్రాయిడ్ ఫోన్లపై సెర్చి చేస్తే వాటి పేర్లు కనిపించకపోవడంతో జాబితాలో అవి ఉన్నట్లుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బాలాజీ టెలీఫిలిమ్స్కి చెందిన ఆల్ట్ (గతంలో ఆల్ట్‌బాలాజీ), ఆడియో ప్లాట్‌ఫాం కుకు ఎఫ్ఎం, డేటింగ్ సర్వీస్ యాప్ క్వాక్‌క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ కూడా ప్లేస్టోర్ నుంచి మాయమయ్యాయి. ఇన్–యాప్ పేమెంట్స్‌పై గూగుల్ 11 నుంచి 26 శాతం ఫీజులను విధిస్తుండటంపై నెలకొన్న వివాదం ఈ పరిణామానికి దారి తీసింది. ప్లాట్‌ఫాం ఫీజుపై పోరాడుతున్న కంపెనీలకు అనుకూలంగా సుప్రీం కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో నిబంధనలను పాటించని యాప్‌లను గూగుల్ తొలగించడం ప్రారంభించింది. ఉచిత డిజిటల్ మార్కెట్‌ప్లేస్‌ను ఆఫర్ చేస్తూ ఇండస్ యాప్ స్టోర్‌ను ఫోన్‌పే ప్రవేశపెట్టిన తరుణంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది గుత్తాధిపత్య ధోరణి..: కుకు ఎఫ్ఎం కాగా, గూగుల్ గుత్తాధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందని కుకు ఎఫ్ఎం సహ–వ్యవస్థాపకుడు వినోద్ కుమార్ వ్యాఖ్యానించగా, ఇది భారత్‌లో ఇంటర్నెట్కు దుర్దినంగా భారత్ మ్యాట్రిమోనీ వ్యవస్థాపకుడు మురుగవేల్ జానకిరామన్ అభివరి్ణంచారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నందున ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, ఏ యాప్‌ను డీలిస్ట్ చేయొద్దని గూగుల్‌కి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ (ఏఐఎంఏఐ) సూచించింది. -
నేను అమెరికాలో ఎముకల డాక్టరిని.. మీరు నచ్చారు పెళ్లి చేసుకుంటా...
బనశంకరి: వరుడు కావాలని ఒక యువతి ఉంచిన ప్రొఫైల్ చూసి సైబర్ మోసగాడు ఆమెను పెళ్లాడతానని నమ్మించి రూ.40 లక్షలు స్వాహా చేశాడు. బెంగళూరు జేపీ నగరకు చెందిన యువతి (29) బాధితురాలు. ఈమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమెరికా సంబంధం వద్దనడంతో.. వివరాలు.. షాదీ డాట్‌కామ్‌లో యువతి తన ప్రొఫైల్ ను అప్లోడ్ చేసింది. దీనిని గమనించిన వంచకుడు వాట్సాప్‌లో.. నేను అమెరికాలో ఎముకల డాక్టరుగా పనిచేస్తున్నాను. మీరు నచ్చారు, పెళ్లి చేసుకుంటానని మెసేజ్ పంపాడు. విదేశాల్లో ఉన్నవారితో ఇష్టం లేదని, బెంగళూరువాసి కావాలని యువతి తెలిపింది. అమెరికాలో స్వంత ఇల్లు ఉంది, ఇంటిని విక్రయించి బెంగళూరుకు వచ్చి కొత్త ఆసుపత్రి నిర్మించి అక్కడే పర్మినెంట్‌గా ఉంటానని యువతిని నమ్మించాడు. కొద్దిరోజుల్లో బెంగళూరుకు వస్తానని విమానం టికెట్, హోటల్ బుక్ చేయాలని మీ ఇంటికి వచ్చి మాట్లాడతానని యువతికి తెలిపాడు. కానీ యువతి సాధ్యం కాదని మిన్నకుండిపోయింది. ఢిల్లీ.. డాలర్లు పేరుతో నాటకం పట్టువీడని వంచకుడు నేనే విమానం టికెట్, రూమ్ బుక్ చేసుకుని వస్తానని చెప్పాడు. మార్చి 16వ తేదీన యువతికి ఫోన్‌చేసి అమెరికా నుంచి ఢిల్లీ కి వచ్చాను, నా వద్ద అమెరికన్ డాలర్లు ఉన్నాయి. వాటికి రూ.1.38 లక్షలు కస్టమ్స్ పన్ను చెల్లించాలి. నా వద్ద లక్ష రూపాయలు మాత్రమే ఉంది. మిగిలిన రూ.38 వేలు ఇవ్వాలని తెలిపాడు. ఇతడి మాటలు నమ్మిన యువతి రూ.38 వేలు అతడి అకౌంట్ కు జమచేసింది. మళ్లీ రికార్డులు పరిశీలన, ఆర్బీఐ ఫీజు అని రకరకాలుగా చెప్పి దశలవారీగా రూ.40.89 లక్షలు తన బ్యాంక్ అకౌంట్ కు జమచేసుకున్నారు. మరింత డబ్బు అడగడంతో యువతికి అనుమానం వచ్చి దక్షిణ విభాగ సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో ఉంది. అక్క కొడుకుతో సన్నిహితంగా.. భార్యను హత్య చేసిన భర్త -
షాదీడాట్‌కామ్ సంచలన నిర్ణయం
పాపులర్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ షాదీడాట్‌కామ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఏ మ్యారేజ్ మ్యాట్రిమోనియల్ వేయని అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ కోసం ఓ ప్లాట్‌పామ్‌ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది. LGBTQ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్) కమ్యూనిటీ, విదేశాల్లో నివసించేవాళ్ల కోసం ఈ ప్లాట్‌ఫామ్ సేవల్ని అందించబోతుందట షాదీడాట్‌కామ్. సేమ్ సెక్స్ రిలేషన్‌షిప్స్‌పై అవాంతరాలను సుప్రీం కోర్టు తీర్పు తొలగించిన నాలుగేళ్లకు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే షాదీడాట్‌కామ్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ‘వివిధ ప్రాంతాలను, దేశాలను, జెండర్లను దృష్టిలో పెట్టకుని ఈ అడుగు వేస్తున్నాం. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అయినా ఫర్వాలేదు. కేవలం అవసరం అయినవాళ్లకు ‘తోడు’ అందించాలనే దానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని సీఈవో అనుపమ్ మిట్టల్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి లాభాపేక్షకు దూరంగా ఉంటోంది షాదీడాట్‌కామ్. వాస్తవానికి కాజువల్ డేటింగ్ కంపెనీల్లాంటివి ఈ ఏడాదిలో సగం బిలియన్ దాకా ఆదాయం వెనకేసుకున్నాయనే అంచనాల నడుమ.. షాదీడాట్‌కామ్ మాత్రం ఆ లిస్ట్‌కు పూర్తి దూరంగా ఉంది. జీవిత భాగస్వామిని వెతకడం తామోక వ్యాపారంగా చూడట్లేదని ప్రకటించుకుంటోంది షాదీడాట్‌కామ్. మరిన్ని సర్వీసులు.. 1996లో Sagaai.comగా మొదలై ఆ తర్వాత షాదీడాట్‌కామ్ గా పేరు మార్చేసుకుంది. భారత్‌తో పాటు పాక్, బంగ్లాదేశ్, మరికొన్ని దేశాల్లో మ్యాచ్‌మేకింగ్ సెంటర్లతో రిటైల్ నెట్‌వర్క్‌లను సైతం నడిపిస్తోంది. భారత్‌మ్యాట్రిమోనీ, జీవన్సాథీ డాట్కామ్లకు గట్టిపోటీ ఇస్తోంది. వీటితో పాటు కమ్యూనిటీలకు తగ్గట్లు సంగం పేరుతో మరో ప్లాట్‌ఫామ్‌ను నడిపిస్తోంది. కరోనా టైంలో షాదీమీట్ పేరుతో వెడ్డింగ్ ప్రిపరేషన్ గైడ్‌ను లాంఛ్ చేసింది. తద్వారా ఆన్లైన్లోనే తోడు వెతుక్కునేందుకు లక్షల మందికి వీలు కలిగింది. అయితే ఈ ఐడియా అనుకున్నంత సక్సెస్ కాపోయినా.. పెద్ద నష్టమేమీ లేదని ప్రకటించుకుంది కంపెనీ. -
పెళ్లితో పేరు మార్చుకోవాలా!
సర్వేజనాః మన ప్రాంతంలో పెళ్లి కాగానే అమ్మాయి ఇంటి పేరు మారుతుంది. కొన్నిచోట్ల భర్త పేరును సెకండ్ నేమ్‌గా చేసుకొంటున్నారు భార్యలు. అయితే తాజాగా షాదీ డాట్‌కామ్ వారు చేసిన ఒక సర్వేలో ఓ అభిప్రాయం వ్యక్తమైంది. దాదాపు 66 శాతం మంది మహిళలు పెళ్లితో తమ ఇంటి పేరును మార్చుకోవడం, భర్త పేరును వెనుక తగిలించుకోవడం అనవసరం అని అభిప్రాయపడ్డారు. మిగిలిన 34 శాతం మంది మాత్రం పెళ్లితో ఇంటి పేరును మార్చుకోవడం స్వాగతించదగ్గ పరిణామమేనని అభిప్రాయపడ్డారు. సర్టిఫికెట్లలో ఎలాగూ పుట్టినింటి పేరే ఉంటుంది. విద్యా, ఉద్యోగాల్లో తప్పనిసరిగానైనా అదే పేరును కొనసాగించాల్సి ఉంటుంది. ఇక భర్త ఇంటి పేరును తన పేరు పక్కకు తెచ్చుకోవడం అలంకరణే అవుతుందనే అభిప్రాయం ఈ సర్వేలో వ్యక్తమైంది.