బనశంకరి: వరుడు కావాలని ఒక యువతి ఉంచిన ప్రొఫైల్ చూసి సైబర్ మోసగాడు ఆమెను పెళ్లాడతానని నమ్మించి రూ.40 లక్షలు స్వాహా చేశాడు. బెంగళూరు జేపీ నగరకు చెందిన యువతి (29) బాధితురాలు. ఈమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అమెరికా సంబంధం వద్దనడంతో..
వివరాలు.. షాదీ డాట్‌కామ్‌లో యువతి తన ప్రొఫైల్ ను అప్‌లోడ్ చేసింది. దీనిని గమనించిన వంచకుడు వాట్సాప్‌లో.. నేను అమెరికాలో ఎముకల డాక్టరుగా పనిచేస్తున్నాను. మీరు నచ్చారు, పెళ్లి చేసుకుంటానని మెసేజ్ పంపాడు. విదేశాల్లో ఉన్నవారితో ఇష్టం లేదని, బెంగళూరువాసి కావాలని యువతి తెలిపింది. అమెరికాలో స్వంత ఇల్లు ఉంది, ఇంటిని విక్రయించి బెంగళూరుకు వచ్చి కొత్త ఆసుపత్రి నిర్మించి అక్కడే పర్మినెంట్‌గా ఉంటానని యువతిని నమ్మించాడు. కొద్దిరోజుల్లో బెంగళూరుకు వస్తానని విమానం టికెట్, హోటల్ బుక్ చేయాలని మీ ఇంటికి వచ్చి మాట్లాడతానని యువతికి తెలిపాడు. కానీ యువతి సాధ్యం కాదని మిన్నకుండిపోయింది.
ఢిల్లీ.. డాలర్లు పేరుతో నాటకం
పట్టువీడని వంచకుడు నేనే విమానం టికెట్, రూమ్ బుక్ చేసుకుని వస్తానని చెప్పాడు. మార్చి 16వ తేదీన యువతికి ఫోన్‌చేసి అమెరికా నుంచి ఢిల్లీ కి వచ్చాను, నా వద్ద అమెరికన్ డాలర్లు ఉన్నాయి. వాటికి రూ.1.38 లక్షలు కస్టమ్స్ పన్ను చెల్లించాలి. నా వద్ద లక్ష రూపాయలు మాత్రమే ఉంది. మిగిలిన రూ.38 వేలు ఇవ్వాలని తెలిపాడు. ఇతడి మాటలు నమ్మిన యువతి రూ.38 వేలు అతడి అకౌంట్ కు జమచేసింది. మళ్లీ రికార్డులు పరిశీలన, ఆర్‌బీఐ ఫీజు అని రకరకాలుగా చెప్పి దశలవారీగా రూ.40.89 లక్షలు తన బ్యాంక్ అకౌంట్ కు జమచేసుకున్నారు. మరింత డబ్బు అడగడంతో యువతికి అనుమానం వచ్చి దక్షిణ విభాగ సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో ఉంది.
అక్క కొడుకుతో సన్నిహితంగా.. భార్యను హత్య చేసిన భర్త
Comments
Please login to add a commentAdd a comment