పునీత్ విగ్రహం తొలగింపు
తుమకూరు: లక్షలాది మంది అభిమానుల ఆరాధ్యనీయుడు, కన్నడ పవర్ స్టార్, కర్ణాటక రత్న.. దివంగత పునీత్ రాజ్‌కుమార్ విగ్రహాన్ని తొలగించారు. జిల్లాలోని హోన్నహళ్లి గ్రామంలో ఈ సంఘటన ఉద్రిక్తత కలిగించింది. గ్రామంలో గురువారం రాత్రి అభిమానులు పునీత్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు వచ్చి విగ్రహం ఏర్పాటుకు అనుమతి లేదని అక్కడి నుంచి తీసివేశారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 18న విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కన్నడ రక్షన వేదిక, అప్పు సేన సభ్యులు గ్రామ పంచాయతీని కోరినట్లు తెలిపారు. అయితే అనుమతి రాకముందే వేదికపై విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు తొలగించడం చర్చనీయాంశమైంది.
అనుమతి లేదని తీసేసిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment