వెల్లివిరిసిన సాహితీ సౌరభం
మండ్య: మాండవ్య రుషుల తపోభూమి అచ్చ కన్నడ జిల్లా అని ప్రసిద్ధి చెందిన మండ్యలో మూడు రోజుల అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళనం ఆదివారం సాయంత్రంతో సమాప్తమైంది. వేలాది మంది భాషాప్రేమికులు, సాహితీవేత్తలు మధుర జ్ఞాపకాలతో పయనమయ్యారు.
4.69 లక్షల భోజనాలు
కాగా, సమ్మేళనంలో తరలివచ్చిన జన సాగరానికి నిరాటంకంగా ఆహార పంపిణీ సాగింది. సుమారు 4.69 లక్షల మంది భోజనాలు చేశారు. మూడు రోజుల పాటు నుడి జాతరలో విఐపిలకు, వీవీఐపీలకు, సామాన్య ప్రజలకు ఉపాహారం, భోజనాలు అందజేశారు. మొదటిరోజు శుక్రవారం 1.90 లక్షల మంది భోజనాలు చేశారు. రెండవ రోజు 1.70 లక్షల మంది, 3వ రోజు 2 లక్షల మంది భోజనం గావించారు. ఇందుకోసం 625 క్వింటాళ్ల బియ్యం, బెల్లం 53 టన్నులు, వంట నూనె 15 వేల లీటర్లు, రాగులు 50 క్వింటాళ్లు, చెక్కర 75 టన్నులు, కూరగాయాలు 500 క్వింటాళ్లు, టన్నుల కొద్దీ నెయ్యి, అంతే స్థాయిలో కూరగాయలు, ఇతర దినుసులను ఉపయోగించారు. 1.76 లక్షల ఓళిగలు, 1.60 లక్షల బాదూషాలు, 1.50 లక్షల మైసూరు పాక్ తదితర తీపి వంటకాలు ఆరగించారు. టన్నుల మొత్తంలో క్యారెట్ హల్వా, తీయని అన్నం చేశారు.
హుషారుగా సంగీత కచేరీ
సమ్మేళనంలో ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య సంగీత విభావరి వీనుల విందు చేసింది. మంత్రి ఎన్.చలువరాయ స్వామి ఎమ్మెల్యేలు నరేంద్ర స్వామి, రవికుమార్ తదితరులు వేదిక ఎక్కి స్టెప్పులు వేశారు. సంగీత గానాలకు అందరూ చప్పట్లు కొడుతు, విజిల్స్ వేశారు.
మండ్యలో కన్నడ సమ్మేళనం ముగింపు
మధుర జ్ఞాపకాలతో తిరుగుముఖం
Comments
Please login to add a commentAdd a comment