డివైడర్‌కు కారు ఢీ, ముగ్గురికి తీవ్ర గాయాలు
దొడ్డబళ్లాపురం: ఓవర్‌టేక్ చేసే క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డ సంఘటన నగరంలో ఎలక్ట్రానిక్ సిటీ–సిల్క్ బోర్డు పై వంతెన పై చోటుచేసుకుంది. తంజిమ్, తాంజె, మహమ్మద్ సాహిల్, అబ్దుల్,మహమ్మద్ సిదార్ అనేవారు కారులో పిక్నిక్‌కి వెళ్లి తిరిగి వస్తుండగా సింగసంద్ర వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారు ముందుభాగం పూర్తిగా తుక్కయింది. ఎయిర్‌బ్యాగ్‌లు తెరచుకోవడంతో మరికొందరికి ముప్పు తప్పింది. ముగ్గురు తీవ్రంగా గాయపడగా ఇద్దరు స్వల్ప గాయాలపాలయ్యారు. స్థానికులు, పోలీసులు కలిసి క్షతగాత్రులను స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఈపీఎఫ్‌తో సంబంధం లేదు : రాబిన్
శివాజీనగర: ఉద్యోగుల ఈపీఎఫ్ సొమ్ము వంచన కేసులో తన పాత్ర లేదని, ఆ కంపెనీకి చాలా ఏళ్ల కిందటే రాజీనామా చేసినట్లు మాజీ క్రికెటర్ రాబిన్ ఉత్తప్ప చెప్పారు. ఈ కేసులో వారెంట్ జారీ అయిన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. రెండు కంపెనీలు నన్ను డైరెక్టర్‌గా నియమించాయి. వాటిలో నేను పెట్టుబడి పెట్టాను. అయినా ఆ కంపెనీల కార్యకలాపాలలో నేను ఎప్పుడూ పాల్గొనలేదు. ఇక నేను ఇచ్చిన సొమ్మును కూడా నాకు చెల్లించలేదు. అందుచేత చాలా ఏళ్ల కిందటే డైరెక్టర్ స్థానానికి రాజీనామా చేశాను అని చెప్పారు. ఈపీఎఫ్ సంస్థకూ ఇదే విషయం తెలియజేశానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment