పాపులర్ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ షాదీడాట్‌కామ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఏ మ్యారేజ్ మ్యాట్రిమోనియల్ వేయని అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ కోసం ఓ ప్లాట్‌పామ్‌ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది.
LGBTQ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్) కమ్యూనిటీ, విదేశాల్లో నివసించేవాళ్ల కోసం ఈ ప్లాట్‌ఫామ్ సేవల్ని అందించబోతుందట షాదీడాట్‌కామ్. సేమ్ సెక్స్ రిలేషన్‌షిప్స్‌పై అవాంతరాలను సుప్రీం కోర్టు తీర్పు తొలగించిన నాలుగేళ్లకు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే షాదీడాట్‌కామ్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ‘వివిధ ప్రాంతాలను, దేశాలను, జెండర్‌లను దృష్టిలో పెట్టకుని ఈ అడుగు వేస్తున్నాం. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అయినా ఫర్వాలేదు. కేవలం అవసరం అయినవాళ్లకు ‘తోడు’ అందించాలనే దానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని సీఈవో అనుపమ్ మిట్టల్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి లాభాపేక్షకు దూరంగా ఉంటోంది షాదీడాట్‌కామ్.
వాస్తవానికి కాజువల్ డేటింగ్ కంపెనీల్లాంటివి ఈ ఏడాదిలో సగం బిలియన్ దాకా ఆదాయం వెనకేసుకున్నాయనే అంచనాల నడుమ.. షాదీడాట్‌కామ్ మాత్రం ఆ లిస్ట్‌కు పూర్తి దూరంగా ఉంది. జీవిత భాగస్వామిని వెతకడం తామోక వ్యాపారంగా చూడట్లేదని ప్రకటించుకుంటోంది షాదీడాట్‌కామ్.
మరిన్ని సర్వీసులు.. 1996లో Sagaai.comగా మొదలై ఆ తర్వాత షాదీడాట్‌కామ్ గా పేరు మార్చేసుకుంది. భారత్‌తో పాటు పాక్, బంగ్లాదేశ్, మరికొన్ని దేశాల్లో మ్యాచ్‌మేకింగ్ సెంటర్‌లతో రిటైల్ నెట్‌వర్క్‌లను సైతం నడిపిస్తోంది. భారత్‌మ్యాట్రిమోనీ, జీవన్‌సాథీ డాట్‌కామ్‌లకు గట్టిపోటీ ఇస్తోంది. వీటితో పాటు కమ్యూనిటీలకు తగ్గట్లు సంగం పేరుతో మరో ప్లాట్‌ఫామ్‌ను నడిపిస్తోంది. కరోనా టైంలో షాదీమీట్ పేరుతో వెడ్డింగ్ ప్రిపరేషన్ గైడ్‌ను లాంఛ్ చేసింది. తద్వారా ఆన్‌లైన్‌లోనే తోడు వెతుక్కునేందుకు లక్షల మందికి వీలు కలిగింది. అయితే ఈ ఐడియా అనుకున్నంత సక్సెస్ కాపోయినా.. పెద్ద నష్టమేమీ లేదని ప్రకటించుకుంది కంపెనీ.
Comments
Please login to add a commentAdd a comment