క్లాస్ కట్.. మాస్ స్టిచ్
అనార్కలీ చాకొలెట్ బ్రౌన్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసి పొడవాటి అనార్కలీ డ్రెస్ ఇది. హై నెక్, బ్యాక్ అండ్ ఫ్రంట్ మిర్రర్ వర్క్ చేయడంతో సంప్రదాయ కళ ఉట్టిపడుతోంది.ఫ్యాషన్‌షోలలో ఓ వెలుగు వెలిగి ప్రముఖుల ప్రశంసలు అందుకున్న రెడ్ బ్లూ కాంబినేషన్ స్టైల్...
ట్రెడిషనల్ లవర్స్ బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకునే గ్రీన్, బ్రౌన్ కలర్‌ఫుల్ స్మైల్...
సూపర్ కట్‌తో క్లాస్‌ని మెప్పించడమే కాదు కంఫర్ట్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఇలాగే స్టిచ్ చేసి డూపర్‌గా మాస్‌లోనూ మెరిసిపోవచ్చు.
ఫ్యాషన్ షోలో ఓ వెలుగు వెలిగిన కట్స్‌ని మీ కోసం తీసుకువచ్చాం... ట్రై చేయండి.. అదరహో అనిపించండి.
ఇండో-వెస్ట్రన్..
టై అండ్ డై చేసిన చిలకపచ్చ జార్జెట్ ఇండో వెస్ట్రన్ లాంగ్ గౌన్. మిర్రర్ వర్క్ చేసిన రా సిల్క్ ఫ్లాప్‌ను
ఛాతి భాగంలో జత చేశారు.
రెడ్ బ్లూ కలెక్షన్...
స్వచ్ఛమైన సిల్క్ క్లాత్ మీద కొల్‌కతా చేనేతకారులు బంగారు జరీతో మోటిఫ్స్‌ను రూపొందించారు. ఈ క్లాత్‌తో ఇండో వెస్ట్రన్ డ్రెస్
రూపొందించారు డిజైనర్. ఇటీవల కలంత ఫెస్టివల్‌లో బెస్ట్ జ్యూరీ అవార్డ్ పొందిన ఈ కలెక్షన్, లాక్మే ఫ్యాషన్‌వీక్‌కూ ఎంపికైంది. పలాజో ప్యాంట్, స్లీవ్‌లెస్ బ్లౌజ్, అదనంగా జత చేసిన ఫ్లాప్.. నేటితరం అమ్మాయిల స్టైల్‌కు బాగా నప్పుతుంది. పూర్తిగా నీలం రంగు పట్టు క్లాత్‌తో డిజైన్ చేశారు. పలాజో ప్యాంట్‌కు నడుము భాగంలో పూర్తి కాంట్రాస్ట్ కలర్ ప్యాటర్న్‌ను జత చేస్తే న్యూలుక్‌తో వెలిగిపోవచ్చు. రెడ్ కలర్ స్టైల్ లాంగ్ జాకెట్టును చీరల మీదకూ ధరించవచ్చు. ఎంత ట్రెడిషనల్ చీర కట్టుకున్నా ఈ తరహా బ్లౌజ్ వల్ల లుక్ పూర్తి స్టైలిష్‌గా మారిపోతుంది.
డ్రెస్ డిజైనింగ్‌లో మనసు పెట్టి చేస్తేనే అనుకున్న ఫలితాలు వస్తాయి. జార్జెట్, క్రేప్ మెటీరియల్స్ వెస్ట్రన్‌వేర్‌కి బాగా నప్పుతాయి. ఇండోవెస్ట్రన్ స్టైల్‌కి కూడా పట్టును చాలా బాగా చూపించవచ్చు. పట్టు, జార్జెట్ క్లాత్‌లతో ఈ డిజైన్స్‌ని రూపొందించాను. తక్కువ ఖర్చుతో ఈ డిజైన్స్ కావాలంటే కాటన్, టస్సర్ వంటి మంచి ఫాల్ ఉన్న ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవచ్చు. ఈ డిజైనర్ దుస్తులు ఇటు సంప్రదాయ, అటు పాశ్చాత్య వేడుకలకూ బాగా నప్పుతాయి.
- ఆల్టియా కృష్ణ, ఫ్యాషన్ డిజైనర్, సుధర్మ బొటిక్, హైదరాబాద్
(డిజైన్స్‌కి సరైన సూచనలకోసం
fashion A° MøsŒæ ^ólçÜ*¢ features.sakshi@gmail.comకు
మెయిల్ చేయండి)