The design
-
కూల్ కుచ్చులు...
కొత్త డిజైన్‌లో ఏదొచ్చినా ‘అబ్బో ఎంత కూల్‌గా ఉంది’... అంటారు. ఇప్పుడు సింగిల్పీస్కుచ్చుల కుర్తాలు మార్కెట్లో కూల్ హల్చల్ చేస్తున్నాయి. డిజైన్ చాలా సింపుల్. మీకు మీరే డిజైనర్ అయిపోవచ్చు. వేడుకలో కూల్ అండ్ కలర్ఫుల్గా వెలిగిపోవచ్చు. పటియాలా, ధోతీ స్టైల్ బాటమ్స్ని ఇప్పటి వరకు చూశాం. ఇప్పుడవే కుచ్చులను కుర్తీలకు పెట్టేస్తున్నారు. ఇలా అందంగా, ప్రెజెంట్ డేస్నికలర్ఫుల్గా మార్చేస్తున్నారు డిజైనర్లు. షల్వార్, కమీజ్‌లు కంఫర్ట్ నుంచి కంటికి ఇంపుగా మార్చే దిశగా డిజైనర్లు ఎన్నో కసరత్తులు చేస్తూనే ఉన్నారు. దీంట్లో భాగంగా డ్రేప్ కుర్తీలు రెడ్ కార్పెట్‌పై తెగ హడావిడి చేస్తున్నాయి. చూపరుల మది దోచేస్తున్నాయి. కుచ్చుల కుర్తీ... పైన లాంగ్ జాకెట్ పూర్తి ఎంబ్రాయిడరీతో ఉండగా దానికి అటాచ్ చేసిన ప్లెయిన్ జార్టెట్ క్లాత్ నడుము భాగాన ఫిట్‌గా ఉండి, కింది భాగంలో కుచ్చులు కుచ్చులుగా వదులుగా ఉంటుంది. సాధారణ కుర్తాలతో బోరెత్తిపోయినవారికి ఇప్పుడీ కుర్తీలు తెగ ఆకర్షిస్తున్నాయి. టాప్ టు బాటమ్... జాకెట్, బాటమ్ రెండూ ఒకే రంగుతోనూ, పూర్తి కాంట్రాస్ట్ కలర్స్‌తోనూ డిజైన్ చేసుకోవచ్చు. షిఫాన్, జార్టెట్ క్లాత్‌లు కుచ్చులు ఉన్న భాగాన్ని, జాకెట్ భాగానికి వెల్వెట్, బెనారస్, రా సిల్క్... వంటి మంచి ఫాల్ ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి. ఇలా డిజైన్ చేసుకున్న కుర్తాకి బాటమ్‌గా అదే రంగు లేదా పూర్తి కాంట్రాస్ట్ లెగ్గింగ్ ధరిస్తే డ్రేప్డ్ కుర్తా సెట్ అయిపోతుంది. -
ఇంగిల్పీసువారి... సింగిల్పీసు!
ఈమధ్య మన దృష్టి అంతా ఇంగ్లిషువారి మీదే ఉన్నట్టు ఉంది. మోడ్రన్ లుక్, సెక్సీ లుక్, ప్రెట్టీ లుక్, మెట్రో లుక్... ఎదుటివారి లుక్స్ కొల్లకొట్టేయడానికి వారి నుంచే బోలెడన్ని మార్గాలు వెతుకుతున్నారు. దాంట్లో భాగంగా వచ్చిందే ఈ సింగిల్పీసు... అదేనండి సింగిల్‌పీస్ క్లాత్‌తో డిజైన్ చేసిన మ్యాక్సీ స్టైల్. పొడవాటి గౌను, ఫ్రాక్ అని పిలిచే ఈ డ్రెస్ పాదాలను తాకుతున్నట్టుగా ఉంటుంది. ఇది ఫార్మల్గా వేసుకోదగిన డ్రెస్కాదు.పాశ్చాత్యపార్టీలకు బాగా నప్పే డ్రెస్. పై నుంచి కిందవరకు వదులుగా ఉండే ఈ డ్రెస్ నైటీకి తక్కువ, ఫ్రాక్‌కి ఎక్కువ అన్నట్టు ఉంటుంది. 70ల కాలం నుంచి నేటి వరకు ఈ స్టైల్ ప్రపంచమంతా తన హవా కొనసాగిస్తూనే ఉంది. ఇంగ్లిష్ దొరసానుల గౌన్‌గా ప్రసిద్ధి చెందిన మ్యాక్సీలో ఇటీవల మన బాలీవుడ్, టాలీవుడ్... యువతారలు తెగ మెరిసిపోతున్నారు. వీటిలోనే చిన్నా చితకా మార్పులు తెచ్చి డిజైనర్లు యువతరాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. చలికాలంలో జీన్స్ జాకెట్ ధరిస్తే మ్యాక్సీ స్టైల్మరింత మోడ్రన్‌గానూ, సౌకర్యంగానూ ఉంటుంది. మూడుకాలాల్లోనూ ముచ్చటగా... దీనిని కాటన్, పాలిస్టర్.. ఏ క్లాత్తోనైనా రూపొందించవచ్చు. స్లీవ్‌లెస్ చేతులు, హాల్టర్నెక్ లైన్స్, రంగురంగుల ప్యాటర్స్తో మ్యాక్సీని అందంగా రూపుకట్టవచ్చు. వేసవిలో సౌకర్యం అనిపించే డ్రెస్ ఇప్పుడుఅన్ని కాలాల్లోనూ చిన్న చిన్న మార్పులతో స్టైల్‌గా తయారుచేస్తున్నారు. ఎందుకంటే... సులువుగా ధరించవచ్చు. చాలా చాలా సౌకర్యంగా ఉంటుంది. స్టైల్‌గా పాశ్చాత్యయువరాణుల్లా కనిపిస్తారు. ఇతర అలంకరణలేవీ అంతగా అవసరం లేదు. మూడుకాలాల్లోనూ ముచ్చటగా... పువ్వుల మ్యాక్సీ ధరిస్తే ప్లెయిన్ జాకెట్ వేసుకోండి. ప్లెయిన్ మ్యాక్సీ వేసుకుంటే పువ్వుల ప్రింట్లు ఉన్న జాకెట్‌ను ధరించండి. వర్షంలో అయితే వాటర్‌ప్రూఫ్ షూ వేసుకోండి. వింటర్కైతే లెదర్షూ ధరించండి. సమ్మర్ అయితే, ఎంచక్కా ప్లాటర్స్, శాండిల్స్ వేసుకుని, ఓ హ్యాట్పెట్టుకుంటే స్టైల్ అంతా మీదే! గుర్తుంచుకోవాలి... పాదాలను తాకుతున్నట్టుగా లేదంటే కాస్త మడమల పైకి ఉన్నా బాగుంటుంది. అంతుకుమించి పొడవు ఉండకూదు.ఛాతి వెడల్పుగా ఉన్నవారికి మ్యాక్సీ గౌన్ బాగా నప్పుతుంది.మ్యాక్సీపైన పెద్ద పెద్ద ప్రింట్లు ఉంటే డ్రెస్ చీప్‌గా లేదా, మీకు నప్పకపోవడమో ఉంటుంది. అందుకని ఎప్పుడైనా చిన్న చిన్న ప్రింట్లున్న మ్యాక్సీలను ఎంచుకోవాలి. ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకుంటే క్యాజువల్‌గా ఈవెనింగ్ వాక్స్కీ వెళ్లవచ్చు. పార్టీలకు వెళ్లినప్పుడు పెద్ద హీల్ ఉన్న చెప్పులను వేసుకోవాలి. - ఎన్.ఆర్. -
‘పట్టిసీమ’లో మరో మోసం
రూ. 260 కోట్లు కొట్టేయడానికి వ్యూహం ఖర్చు తగ్గించుకోవడానికి డిజైన్ మార్చిన కాంట్రాక్టు సంస్థ మోటార్లు ఆర్డర్ ఇచ్చి, పైపులైన్లు కూడా వేసిన తర్వాత ప్రతిపాదన ఆమోదముద్ర వేసేందుకు సర్కారు సిద్ధం! హైదరాబాద్: ‘యమలీల’ అని ఓ సినిమా ఉంది. అందులో హీరో ఆలీకి భవి ష్యత్ విషయాలు ముందే తెలిసిపోతుంటాయి. అలాగే పట్టిసీమ కాంట్రాక్టర్‌కు కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ముందే తెలిసిపోతున్నాయా? తానేం చేసినా ప్రభుత్వం ఆమోదిస్తుందని ముందే తెలుసుకాబట్టే ఇష్టమొచ్చినట్టుగా ఎత్తిపోతల డిజైన్‌లో మార్పు చేశారా? పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో 30 మోటార్ పంపులు, 15 వరుసల పైపులైన్ ఏర్పాటు చేసి (రెండు మోటార్ పంపులకు ఒక పైపులైన్ చొప్పున) 8,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయాలని కాంట్రాక్టు సంస్థ మెగా, ప్రభుత్వం మధ్య ఒప్పందం ఉంది. అయితే కాంట్రాక్టర్ మోటార్ పంపులను 24కు, పైపులైన్లను 12కు తగ్గించేశారు. దీనివల్ల పథకం మొత్తం అంచనా వ్యయం రూ.1,300 కోట్లలో కనీసం 20 శాతం అంటే రూ.260 కోట్లు అప్పనంగా కొట్టేయవచ్చనేది కాంట్రాక్టర్, ప్రభుత్వ పెద్దల వ్యూహమని నీటిపారుదల శాఖ వర్గాలంటున్నాయి. మోటార్ పంపుల సరఫరా కోసం కాంట్రాక్టర్ ఇప్పటికే చైనాకు ఆర్డర్ ఇచ్చారు. 4 వరుసల పైపులైన్లు వేయడం పూర్తి చేశారు. ఆగస్టు 15న ప్రారంభోత్సవం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. అంటే మరో 18 రోజుల్లో పథకాన్ని ప్రారంభించడానికి వీలుగా పనులు ముగింపు దశకు రావలసిన సమయంలో.. మోటార్ పంపులు, పైపులైన్ల సంఖ్యను తగ్గించి, ఆ మేరకు డిజైన్‌లో మార్పు కోరుతూ ఈ నెల 27న కాంట్రాక్టర్ నుంచి సీడీవో (సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్)కు ప్రతిపాదన వచ్చింది. మోటార్ పంపులు, పైపులైన్ల సంఖ్య తగ్గితే వ్యయం కూడా ఆ మేరకు తగ్గడం సహజం. కానీ వ్యయం ఏమీ తగ్గదట. ఇదే విషయాన్ని ప్రతిపాదనలో పేర్కొన్నారు. అంతేకాదు ఒప్పందానికి విరుద్ధంగా కాంట్రాక్టర్ పైపుల సైజును పెంచి నాలుగు వరుసలు వేసేశారు. వీటన్నిటినీ పట్టించుకోకుండా డిజైన్ మార్పు ప్రతిపాదనపై ఆమోదముద్ర వే యడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. తన ఇష్ట ప్రకారం మార్చిన డిజైన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని కాంట్రాక్టర్‌కు ముందే తెలిస్తే తప్ప ఇష్టారాజ్యంగా పనులు చేసేయడం సాధ్యం కాదని అంటున్నారు. ‘దోపిడీ వ్యూహం’ వెనుక ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారు కాబట్టే పైపుల వ్యాసం ఒప్పందంలో పేర్కొన్న దానికి భిన్నంగా ఉన్నా.. పనులు పర్యవేక్షించిన అధికారులకు అది కనిపించలేదు. డిజైన్ మార్పుపై ఇటు కాంట్రాక్టర్‌కు, అటు ప్రభుత్వ పెద్దలకు అవగాహన ఉంటే తప్ప ఇది సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 24 మోటార్లకే ఆర్డర్! మోటార్ పంపులను చైనాలో కొనుగోలు చేసేందుకు కాంట్రాక్టు సంస్థ ఆర్డర్ ఇచ్చింది. కేవలం 24 మోటార్ పంపులకే ఆర్డర్ ఇచ్చినట్టు సమాచారం. మోటార్ పంపుల పనితీరు, సామర్థ్యం, మోడల్ తనిఖీ చేయడానికి వీలుగా అధికారుల బృందం చైనా వెళ్లడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఈనెల 17నే ఉత్తర్వులు (జీవో-472) ఇచ్చింది. వీటి సామర్థ్యం ఎంత? వాటి పనితీరు ఏమిటి? ఏ మోడల్ వి కొంటున్నారు?.. ఈ వివరాలు అధికారులకు ఇస్తే తప్ప పరిశీలన, తనిఖీ సాధ్యం కావు. అంటే ప్రభుత్వం అనుమతి ఉత్తర్వులు ఇచ్చేటప్పటికే మోటార్ పంపుల అన్ని వివరాలు ప్రభుత్వం వద్ద ఉండాలి. కాంట్రాక్టర్ 24 మోటార్ పంపులకే ఆర్డర్ ఇస్తే ప్రభుత్వం ఎలా అనుమతించింది అన్నది ప్రశ్న. అలాగే డిజైన్ మార్పునకు ప్రభుత్వం అంగీకరించకముందే, మోటార్ పంపుల కొనుగోలుకు కాంట్రాక్టర్ ఎలా ఆర్డర్ ఇచ్చారనేది మరో ప్రశ్న. దీన్నిబట్టే తాము సమర్పించే ప్రతిపాదనకు ప్రభుత్వం తలాడిస్తుందని కాంట్రాక్టర్‌కు ముందే తెలుసనేది స్పష్టమవుతోంది. పైపుల సైజు 3.2 మీటర్లకు పెంపు ఒప్పందం ప్రకారం 3 మీటర్ల వ్యాసం ఉన్న పైపులను 15 వరుసలు వేయాలి. పనులు కొనసాగుతుంటే.. ఒప్పందంలో పేర్కొన్న మేరకే, 3 మీటర్ల వ్యాసం ఉన్న పైపులే ఏర్పాటు చేస్తున్నారని ఎవరైనా అనుకుంటారు. కానీ కాంట్రాక్టర్ 3.2 మీటర్ల వ్యాసం ఉన్న పైపులు ఏర్పాటు చేశారు. పైపుల వరుసలను 15 నుంచి 12కు కుదిస్తూ, పైపుల వ్యాసాన్ని పెంచుతూ డిజైన్ మార్చారన్నమాట. ఖర్చు గణనీయంగా తగ్గించుకోవడానికి కాంట్రాక్టర్ పథకం డిజైన్ మార్చినా, ప్రభుత్వం నుంచి అనుమతి రాకుండానే పనులు చేస్తున్నా.. అధికారులు కిమ్మనకపోవడానికి కారణమేమిటనేది ప్రశ్న. పైగా మోటార్ పంపులు, పైపులైన్ల సంఖ్య తగ్గిస్తే ఖర్చు తగ్గుతుందనే విషయం ముఖ్యకార్యదర్శి, ఈఎన్సీతో సహా అధికారులు ఎవ రూ పట్టించుకోకపోవడం గమనార్హం. కనీసం రూ.260 కోట్లు కొట్టేయడానికే! కాంట్రాక్టర్ చెబుతున్నట్లుగా డిజైన్ మారిస్తే.. మొత్తం అంచనా వ్యయం రూ.1,300 కోట్లలో కనీసం 20 శాతం వ్యయం తగ్గుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. వ్యయాన్ని తగ్గించకుండానే డిజైన్ మార్పునకు ప్రభుత్వం ఆమోదిస్తున్నదంటే ఆ 20 శాతం.. అంటే రూ. 260 కోట్లు నొక్కేయడానికి వీలుగానే అనే ప్రచారం జరుగుతోంది. -
క్లాస్ కట్.. మాస్ స్టిచ్
అనార్కలీ చాకొలెట్ బ్రౌన్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసి పొడవాటి అనార్కలీ డ్రెస్ ఇది. హై నెక్, బ్యాక్ అండ్ ఫ్రంట్ మిర్రర్ వర్క్ చేయడంతో సంప్రదాయ కళ ఉట్టిపడుతోంది.ఫ్యాషన్‌షోలలో ఓ వెలుగు వెలిగి ప్రముఖుల ప్రశంసలు అందుకున్న రెడ్ బ్లూ కాంబినేషన్ స్టైల్... ట్రెడిషనల్ లవర్స్ బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకునే గ్రీన్, బ్రౌన్ కలర్‌ఫుల్ స్మైల్... సూపర్ కట్‌తో క్లాస్‌ని మెప్పించడమే కాదు కంఫర్ట్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఇలాగే స్టిచ్ చేసి డూపర్‌గా మాస్‌లోనూ మెరిసిపోవచ్చు. ఫ్యాషన్ షోలో ఓ వెలుగు వెలిగిన కట్స్‌ని మీ కోసం తీసుకువచ్చాం... ట్రై చేయండి.. అదరహో అనిపించండి. ఇండో-వెస్ట్రన్.. టై అండ్ డై చేసిన చిలకపచ్చ జార్జెట్ ఇండో వెస్ట్రన్ లాంగ్ గౌన్. మిర్రర్ వర్క్ చేసిన రా సిల్క్ ఫ్లాప్‌ను ఛాతి భాగంలో జత చేశారు. రెడ్ బ్లూ కలెక్షన్... స్వచ్ఛమైన సిల్క్ క్లాత్ మీద కొల్కతా చేనేతకారులు బంగారు జరీతో మోటిఫ్స్‌ను రూపొందించారు. ఈ క్లాత్‌తో ఇండో వెస్ట్రన్ డ్రెస్ రూపొందించారు డిజైనర్. ఇటీవల కలంత ఫెస్టివల్లో బెస్ట్ జ్యూరీ అవార్డ్ పొందిన ఈ కలెక్షన్, లాక్మే ఫ్యాషన్వీక్కూ ఎంపికైంది. పలాజో ప్యాంట్, స్లీవ్‌లెస్ బ్లౌజ్, అదనంగా జత చేసిన ఫ్లాప్.. నేటితరం అమ్మాయిల స్టైల్‌కు బాగా నప్పుతుంది. పూర్తిగా నీలం రంగు పట్టు క్లాత్‌తో డిజైన్ చేశారు. పలాజో ప్యాంట్‌కు నడుము భాగంలో పూర్తి కాంట్రాస్ట్ కలర్ ప్యాటర్న్‌ను జత చేస్తే న్యూలుక్‌తో వెలిగిపోవచ్చు. రెడ్ కలర్ స్టైల్ లాంగ్ జాకెట్టును చీరల మీదకూ ధరించవచ్చు. ఎంత ట్రెడిషనల్ చీర కట్టుకున్నా ఈ తరహా బ్లౌజ్ వల్ల లుక్ పూర్తి స్టైలిష్‌గా మారిపోతుంది. డ్రెస్ డిజైనింగ్‌లో మనసు పెట్టి చేస్తేనే అనుకున్న ఫలితాలు వస్తాయి. జార్జెట్, క్రేప్ మెటీరియల్స్ వెస్ట్రన్వేర్కి బాగా నప్పుతాయి. ఇండోవెస్ట్రన్ స్టైల్‌కి కూడా పట్టును చాలా బాగా చూపించవచ్చు. పట్టు, జార్జెట్ క్లాత్‌లతో ఈ డిజైన్స్‌ని రూపొందించాను. తక్కువ ఖర్చుతో ఈ డిజైన్స్ కావాలంటే కాటన్, టస్సర్ వంటి మంచి ఫాల్ ఉన్న ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవచ్చు. ఈ డిజైనర్ దుస్తులు ఇటు సంప్రదాయ, అటు పాశ్చాత్య వేడుకలకూ బాగా నప్పుతాయి. - ఆల్టియా కృష్ణ, ఫ్యాషన్ డిజైనర్, సుధర్మ బొటిక్, హైదరాబాద్ (డిజైన్స్‌కి సరైన సూచనలకోసం fashion A° MøsŒæ ^ólçÜ*¢ features.sakshi@gmail.comకు మెయిల్ చేయండి) -
చేసంచిని కవర్ చేయొద్దు..!
మా పక్కింటావిడ రోజూ పూజకు పువ్వులు కొంటుంది. నిజానికి ఆ పూలు హోమ్ డెలివరీలో ఇంటికే వస్తాయి. రోజూ పూలబ్బాయి అరుపు వినపడగానే ఆవిడ బాల్కనీ నుంచి ఆ రోజుకు కావాల్సిన పువ్వులు ఆర్డర్ ఇస్తుంది. టకటకా పూలను తూకం వేసి కవర్లో కట్టి గుమ్మం వరకు వెళ్లి అందిస్తాడు ఆ అబ్బాయి. ఇది ప్రతి రోజూ మారని రొటీన్. కొన్నేళ్లుగా సాగుతోంది. రోజూ పువ్వులొస్తాయి.. రోజూ వాటిని మోసుకొస్తూ ఓ ప్లాస్టిక్ కవరొస్తుంది. కింద నుంచి పై వరకూ వచ్చే భాగ్యానికి మళ్లీ ప్లాస్టిక్ సంచీ ఎందుకు అని ఆవిడకు తట్టదు. నాలుగణాలు ఎక్కువైనా బేరం పోవద్దని ఆ పూలబ్బి తిప్పలు. ఈ మధ్యలో నాలాంటి థర్డ్ పార్టీ ఎవరైనా కల్పించుకుంటే ఇద్దరికీ గిట్టదు. ఏడాదికి 365 కవర్లతో నేను చూసిన ఐదేళ్లలో ఆవిడ కవర్ల సంపద 1,825. ఇలాంటి ఇళ్లు మన హైదరాబాద్‌లో ఎన్ని ఉన్నాయ్, అన్ని కవర్లూ ఎక్కడికి చేరుతున్నాయ్.. ఆలోచించండి. కేవలం ఈ ఒక్క సందర్భంలోనే కాదు అనాలోచితంగా, అప్రయత్నంగా మనం కవర్ల ఉచ్చులో చిక్కుకుపోయాం. చిన్నపాటి అవసరాలకు చేతి సంచినో, బుట్టనో వాడటం అనే సంస్కృతిని మర్చిపోయాం. మానస సంచిరరే.. మార్కెట్‌కి వెళ్తూ తప్పనిసరిగా సంచి పట్టుకెళ్లే రోజుల నుంచి డబ్బులు కూడా అక్కర్లేకుండా వట్టి చేతులతో.. జేబులో కార్డుతో వెళ్తున్నాం.. కవర్లతో తిరిగొస్తున్నాం. అయితే ప్రభుత్వం 40 మైక్రాన్ల మందం పాలిథిన్ కవర్లు వాడాలని రెగ్యులేషన్ పెట్టాక, కవర్లకు దుకాణదారులు చార్జి చేయడం మొదలుపెట్టాక.. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు తిరిగి చేతి సంచి వైపు చూస్తున్నారు. ఎంత మనం సంచి పట్టుకెళ్లినా గ్రాసరీ షాపులో ఉప్పులు, పప్పులన్నీ ప్లాస్టిక్ ప్యాకింగుల్లోనే కొలువుదీరుతున్నాయి. ఎంత వద్దన్నా.. మన వెంట పాలిథిన్ వస్తూనే ఉంది. అందుకని మనవంతు కొంత తగ్గించే అవకాశం ఎందుకు వదులుకోవాలి. ప్యాకింగ్‌కు వాడే మెటీరియల్ కొంత వరకూ రీసైక్లింగ్‌కి వీలు పడుతుంది. కానీ చిన్నని, పల్చని పాలిథిన్ సంచుల్లో పది శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. అక్కడ కనుక మన వంతు బాధ్యతగా మనం వాడకం తగ్గిస్తే చాలా పెద్ద మార్పు తేవచ్చు. రీసైక్లింగ్‌కు ప్యాక్అప్ చిన్నప్పుడు కిరాణాకొట్లో పచారీలు కొంటే న్యూస్పేపర్లో పొట్లం కట్టి దారంతో చుట్టి మన బుట్టలో పెట్టేవారు. ఆ ప్యాకింగ్ అంటే ఎంత అబ్బురంగా అనిపించేదో. ఎంత ప్రయత్నించినా.. అలా ప్యాకింగ్ చేయడం కుదిరేది కాదు. ఇప్పుడు ఆ కిరాణం తగ్గింది. సూపర్ షాపింగ్ సంప్రదాయం వచ్చేసింది. అన్ని వస్తువులు కనబడేలా పారదర్శక పాలిథిన్‌లలో ప్యాకింగ్ చేస్తున్నారు. టైమ్, కన్వీనియన్స్ రెండూ కలిసొస్తాయి సరే, కానీ ఈ మధ్యలో పర్యావరణ స్పృహ తప్పిపోతోంది. పాల బాటి ళ్ల రోజులు పోయి.. ప్యాకెట్లు వచ్చిన కొత్తల్లో ఆ పాల ప్యాకెట్లను దాచి పాతపేపర్లు కొనేవారికి అమ్మి డబ్బులు తీసుకునే అలవాటు ఉండేది. దానిపై వచ్చే ఆదాయం చులకనగా అనిపించి మెల్లగా ఆ సంప్రదాయాన్నీ మానేశాం. అది డబ్బులతో కొలవలేని గొప్ప కల్చర్. మనకు రీసైక్లింగ్ గురించి తెలియని రోజుల్లోనే మన బాధ్యతను చక్కగా నిర్వర్తించాం. మన ప్లాస్టిక్‌ని, పేపర్ని, ఇనుమును, గాజును వేరు చేసి మనమే స్వయంగా స్క్రాప్‌కి పంపించే వాళ్లం. ఇప్పుడు పర్యావరణం గురించి అవగాహన ఉంది కానీ, కార్యాచరణ మాత్రం మారిపోయింది. పాల ప్యాకెట్లు పోగేసి రీసైకిల్ చేసే ఇళ్లేవి..? పోనీ అమ్ముకోకపోయినా.. కనీసం మన వంతు బాధ్యతగా రీసైకిల్ చేద్దాం అన్న కల్చర్ మనం నేర్చుకోవాలి. బ్యాగుబాగు.. ప్రతి దానికీ ప్యాకింగ్ అలవాటు చేసుకున్నాం. ఒకప్పుడు బిగ్షాపర్ బ్యాగులైనా ఉండేవి. ఇప్పుడు అవి ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయాయట. పోనీ మారిన ఫ్యాషన్‌కు తగ్గట్టు కొత్త సంచులను డిజైన్ చేసుకోవచ్చుగా..! అసలు ఆలోచన అటు వెళ్తేగా, వాటి అవసరం గుర్తిస్తేనే కదా కొత్త డిజైన్లు వచ్చేవి. కొత్త వింత కావొచ్చు.. కొన్ని పాత పద్ధతులను కొత్తగా నేర్చుకుందాం. బజారుకు వెళ్లినప్పుడు చేతి సంచితోనే వెళ్దాం. మనవల్ల తయారైన చెత్తకు రీసైకిల్ దారి చూపిద్దాం. ఐ లవ్ హైదరాబాద్. -
శాశ్వత వ్యవసాయంపై 15 రోజుల శిక్షణా శిబిరం
భూమి, పర్యావరణాన్ని పాడుచేయకుండా పుష్కలంగా విషరహిత ఆహారోత్పత్తికి ఒకానొక సమగ్ర మార్గం ‘శాశ్వత ఫలాలనిచ్చే వ్యవసాయ (పర్మనెంట్ + అగ్రికల్చర్ = పర్మాకల్చర్)’ పద్ధతి. పొలాన్ని ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా డిజైన్ చేసి తగిన పంటలు పండించడం ఇందులో ప్రత్యేకత. పర్మాకల్చర్ డిజైన్ సర్టిఫికెట్ కోర్సు ద్వారా ఈ పద్ధతిలో లోతుపాతులను ఆకళింపు చేసుకోవచ్చు. హైదరాబాద్ నాగోల్‌కు చెందిన పర్మాకల్చరిస్టుల బృందం మే 10 నుంచి 15 రోజుల ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ శిక్షణా కోర్సు నిర్వహించనుంది. వివరాలకు.. సాయి ప్రసన్నకుమార్: 99514 52345 -
వన్నెవన్నెల పైకప్పు
హైదరాబాద్: ఇంట్లోని అందాన్ని రెట్టింపు చేసేది ఫాల్స్ సీలింగ్. ఇది మన అభిరుచులకు అద్దం పట్టేలా ఉండాలంటే సీలింగ్ డిజైన్‌తో పాటు సరైన వర్ణాల్ని ఎంచుకోవాలి. ఫాల్స్ సీలింగ్ ప్రధాన ఉద్దేశం... గదిలో ఆహ్లాదభరిత వాతావరణం ఏర్పర్చడమే .మిగతా గదులతో పోల్చుకుంటే పడకగది సీలింగ్‌నే ఎక్కువసేపు చూస్తాం. కాబట్టి వర్ణాల్లో సాదాసీదావి కాకుండా నేటి పోకడలకు అద్దంపట్టేలా ఉండాలి. డార్క్, బ్రౌన్ వర్ణాలు చక్కగా నప్పుతాయి. ఇది మన మనసులోని భావాలకు ప్రతీకగా నిలుస్తాయి. గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడే పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపించడంతో పాటు విశాలంగా ఉందనే భావన కలుగుతుంది. సీలింగ్ డిజైన్ ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదితో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోండి. తాజాదనం ఉట్టి పడుతున్నట్లు కనబడాలంటే మోనోక్రోమాటిక్ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు వర్ణాలు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సీలింగ్ ప్రశాంత భావనను కలగజేస్తుంది. -
సూపర్ ఫాస్ట్
మెట్రోరైలు వేగంగా కదులుతున్న ఫైలు డీపీఆర్ రూపకల్పనలో అవాంతరాలపై శ్రీధరన్ అధ్యయనం నగరంలో విస్తృత పర్యటన రైల్వేస్టేషన్ నుంచి అలంకార్ వరకు సింగిల్ ట్రాక్ స్వల్ప మార్పులతో మార్చి నాటికి డిజైన్ మెట్రోరైలు ప్రతిపాదన పరుగులు పెడుతోంది. నగరంలో మెట్రో కారిడార్ నిర్మాణానికి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా డిజైన్ రూపొందించడంలో ఏపీ మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ కసరత్తు మొదలుపెట్టారు. గురువారం నగరంలో పర్యటించిన ఆయన మెట్రో ప్రాజెక్టు వెళ్లే ప్రాంతాలను నిశితంగా గమనించారు. ఏలూరురోడ్డు, బందరు రోడ్డుపై ప్రతిపాదించిన మెట్రో రైల్వే కారిడార్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ బ్యూరో : నగరంలో మెట్రో కారిడార్ పనులు వేగవంతమయ్యూరుు. పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్లను కేంద్రాలుగా చేసుకుని మెట్రో సర్వీస్ తుళ్లూరుకు విస్తరించేలా ముందస్తు ప్రణాళికతో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట (డీపీఆర్) తయూరీకి ఏపీ మెట్రో ప్రాజెక్టుల సలహాదారు శ్రీధరన్ కీలక సూచనలు చేశారు. గురువారం ఉదయం ఆయన నగరంలో పర్యటించారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ల నుంచి రోజూ నగరానికి వచ్చి వెళ్లేవారు 2.50 లక్షల మంది ఉంటారని, వారిలో కనీసం 20శాతం మంది మెట్రో సర్వీసును ఉపయోగించుకున్నా దాని లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు. మెట్రోరైలు ప్రధాన స్టేషన్ నిర్మించే పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌ను పరిశీలించారు. బస్టాండ్ ప్రాంతం నుంచి గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి, కృష్ణానదికి మెట్రో రైల్వేలైను వేసేలా వారధి నిర్మాణానికి తొలిదశలోనే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. వంతెన నిర్మాణం పూర్తరుుతే భవిష్యత్‌లో రాజధాని తుళ్లూరుకు మెట్రో ప్రాజెక్టును విస్తరించే వీలుంటుందని చెప్పారు. బస్టాండ్ సమీపంలో ఉన్న త్రిశక్తి పీఠం వద్ద మెట్రో రైల్వేలైన్ ఎలైన్మెంట్ కొద్దిపాటి మార్పు చేయాలని సూచించారు. అక్కడి నుంచి కనకదుర్గమ్మ వారధికి మెట్రోరైల్‌ను అనుసంధానం చేసేలా డిజైన్ తయారు చేయాలని ఆదేశించారు. బస్టాండ్ ప్రాంతం నుంచి ఏపీ స్టేట్ ఫైర్ సర్వీసెస్ స్టేషన్‌ను, పోలీస్ కంట్రోల్ రూమ్‌లను పరిశీలించిన ఆయన మెట్రో రైల్వే లైన్ ఎలైన్‌మెంట్‌లో మార్పు చేయాలని నిర్ణయించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రాంతంలో ఏలూరు, బందరు రోడ్లు ఒకేచోట కలుస్తున్నందున ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. అక్కడి వరకు ఒకే లైనుగా వచ్చే మెట్రో సర్వీసును కొద్ది దూరం పొడిగించి బందరు, ఏలూరు రోడ్లకు వేరుపడేలా మార్పు చేశారు. కీలక మార్పులివే.. ఏలూరు రోడ్డుకు వెళ్లే మెట్రోరైలు మార్గాన్ని తుమ్మలపల్లి కళాక్షేత్రం వైపు నుంచి రైల్వేస్టేషన్ మీదుగా మళ్లింపు, రైల్వే పార్శిల్ కౌంటర్ వద్ద ఒకటి, రైల్వే స్టేషన్ వద్ద మరోటి మెట్రో స్టేషన్లను నిర్మించాలని తొలుత భావించారు. వీటి మధ్య కేవలం 400 మీటర్ల దూరం మాత్రమే ఉండటంతో ఒకచోట స్టేషన్ నిర్మిస్తే చాలని నిర్ణయించారు. రైల్వేస్టేషన్ నుంచి గాంధీనగర్ అలంకార్ హోటల్ వరకు రోడ్డు ఇరుకుగా, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందున ఆ ప్రాంతంలో మెట్రో రైల్వే లైను రెండు ట్రాక్‌లు కాకుండా ఒకటి నిర్మించేలా డిజైన్ రూపొందించాలని నిశ్చయించారు. లెనిన్ సెంటర్ మీదుగా ఏలూరు రోడ్డుకు వెళ్లే ప్రాంతంలో సౌత్ ఇండియన్ షాపింగ్‌మాల్ వద్ద ప్రైవేటు భవనం రెండు మీటర్ల మేర అడ్డు వస్తోందని, దాన్ని తప్పించి మెట్రో లైన్ ఎలైన్మెంట్ రూపొందించాలని శ్రీధరన్ భావించారు. మాచవరం సెంటర్లో మెట్రో స్టేషన్‌కు సమీపంలోని భవనం అడ్డు వచ్చే అవకాశం ఉన్నందున దానికి ఇబ్బంది లేకుండా డిజైన్ రూపొందించాలని ఆదేశించారు. గుణదల రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ), రామవరప్పాడు వద్ద ఇన్నర్ రింగ్‌రోడ్డు ఆర్వోబీ మెట్రో లైను తగిలే అవకాశం ఉన్నందున రైల్వే, ఆర్అండ్బీ అధికారులతో కలిసి డిజైన్‌లో మార్పులు చేసుకోవాలని నిర్ణయించారు. పలు అంశాలపై సంతృప్తి రామవరప్పాడు రింగురోడ్డు వద్ద మెట్రో స్టేషన్ నిర్మించేందుకు అవసరమైన స్థలం ఉందని శ్రీధరన్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బెంజిసర్కిల్ నుంచి కానూరు వరకు ప్రయాణించిన శ్రీధరన్ బృందం అటువైపు మెట్రోలైను నిర్మాణానికి అవసరమైన జాగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. బెంజిసర్కిల్‌లో ప్రతిపాదించిన ప్లైఓవర్ నిర్మాణం పూర్తయినా.. దాని పైనుంచి మెట్రోరైలు వెళ్లేలా డిజైన్ రూపొందిస్తున్నందున ఎటువంటి ఇబ్బంది ఉండదని శ్రీధరన్ తన వెంట ఉన్న బృందానికి చెప్పారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 11.50 గంటల వరకు శ్రీధరన్ బృందం నగరంలో మెట్రో కారిడార్ నిర్మించే ప్రాంతంలో పర్యటించింది. ఢిల్లీ మెట్రోరైలు ప్రాజెక్టు ఎండీ ఎస్డీ శర్మ, విజయవాడ మెట్రోరైలు ప్రాజెక్టు డీపీఆర్ బాధ్యతలు చూస్తున్న అధికారి పాండురంగారావు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు.