ఇంగిల్‌పీసువారి... సింగిల్‌పీసు!
ఈమధ్య మన దృష్టి అంతా ఇంగ్లిషువారి మీదే ఉన్నట్టు ఉంది. మోడ్రన్ లుక్, సెక్సీ లుక్, ప్రెట్టీ లుక్, మెట్రో లుక్... ఎదుటివారి లుక్స్ కొల్లకొట్టేయడానికి వారి నుంచే బోలెడన్ని మార్గాలు వెతుకుతున్నారు. దాంట్లో భాగంగా వచ్చిందే ఈ సింగిల్‌పీసు... అదేనండి సింగిల్‌పీస్ క్లాత్‌తో డిజైన్ చేసిన మ్యాక్సీ స్టైల్.
పొడవాటి గౌను, ఫ్రాక్ అని పిలిచే ఈ డ్రెస్ పాదాలను తాకుతున్నట్టుగా ఉంటుంది. ఇది ఫార్మల్‌గా వేసుకోదగిన డ్రెస్‌కాదు.పాశ్చాత్యపార్టీలకు బాగా నప్పే డ్రెస్. పై నుంచి కిందవరకు వదులుగా ఉండే ఈ డ్రెస్ నైటీకి తక్కువ, ఫ్రాక్‌కి ఎక్కువ అన్నట్టు ఉంటుంది. 70ల కాలం నుంచి నేటి వరకు ఈ స్టైల్ ప్రపంచమంతా తన హవా కొనసాగిస్తూనే ఉంది. ఇంగ్లిష్ దొరసానుల గౌన్‌గా ప్రసిద్ధి చెందిన మ్యాక్సీలో ఇటీవల మన బాలీవుడ్, టాలీవుడ్... యువతారలు తెగ మెరిసిపోతున్నారు. వీటిలోనే చిన్నా చితకా మార్పులు తెచ్చి డిజైనర్లు యువతరాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. చలికాలంలో జీన్స్ జాకెట్ ధరిస్తే మ్యాక్సీ స్టైల్మరింత మోడ్రన్‌గానూ, సౌకర్యంగానూ ఉంటుంది.
మూడుకాలాల్లోనూ ముచ్చటగా...
దీనిని కాటన్, పాలిస్టర్.. ఏ క్లాత్‌తోనైనా రూపొందించవచ్చు. స్లీవ్‌లెస్ చేతులు, హాల్టర్‌నెక్ లైన్స్, రంగురంగుల ప్యాటర్స్‌తో మ్యాక్సీని అందంగా రూపుకట్టవచ్చు. వేసవిలో సౌకర్యం అనిపించే డ్రెస్ ఇప్పుడుఅన్ని కాలాల్లోనూ చిన్న చిన్న మార్పులతో స్టైల్‌గా తయారుచేస్తున్నారు.
ఎందుకంటే...
సులువుగా ధరించవచ్చు. చాలా చాలా సౌకర్యంగా ఉంటుంది. స్టైల్‌గా పాశ్చాత్యయువరాణుల్లా కనిపిస్తారు. ఇతర అలంకరణలేవీ అంతగా అవసరం లేదు.
మూడుకాలాల్లోనూ ముచ్చటగా...
పువ్వుల మ్యాక్సీ ధరిస్తే ప్లెయిన్ జాకెట్ వేసుకోండి. ప్లెయిన్ మ్యాక్సీ వేసుకుంటే పువ్వుల ప్రింట్లు ఉన్న జాకెట్‌ను ధరించండి. వర్షంలో అయితే వాటర్‌ప్రూఫ్ షూ వేసుకోండి. వింటర్‌కైతే లెదర్‌షూ ధరించండి. సమ్మర్ అయితే, ఎంచక్కా ప్లాటర్స్, శాండిల్స్ వేసుకుని, ఓ హ్యాట్‌పెట్టుకుంటే స్టైల్ అంతా మీదే!
గుర్తుంచుకోవాలి...
పాదాలను తాకుతున్నట్టుగా లేదంటే కాస్త మడమల పైకి ఉన్నా బాగుంటుంది. అంతుకుమించి పొడవు ఉండకూదు.ఛాతి వెడల్పుగా ఉన్నవారికి మ్యాక్సీ గౌన్ బాగా నప్పుతుంది.మ్యాక్సీపైన పెద్ద పెద్ద ప్రింట్లు ఉంటే డ్రెస్ చీప్‌గా లేదా, మీకు నప్పకపోవడమో ఉంటుంది. అందుకని ఎప్పుడైనా చిన్న చిన్న ప్రింట్లున్న మ్యాక్సీలను ఎంచుకోవాలి. ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకుంటే క్యాజువల్‌గా ఈవెనింగ్ వాక్స్‌కీ వెళ్లవచ్చు. పార్టీలకు వెళ్లినప్పుడు పెద్ద హీల్ ఉన్న చెప్పులను వేసుకోవాలి.
- ఎన్.ఆర్.