Dress Up
-
మగవేషధారణలో అమ్మాయి.. పక్కా ప్లాన్
సాక్షి, నారాయణపేట: మగ వేషధారణలో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ బాలికను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా.. సదరు బాలిక మగ వేషధారణలో ఉంటూ కొద్ది రోజులుగా దొంగతనాలకు పాల్పడుతోంది. సోమవారం కర్ణాటక రాష్ట్రం గుర్మిట్కల్ శివారులోని తొట్లూరుకు చెందిన వాసురామ్ కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌కు నారాయణపేటకు వచ్చాడు. ఈక్రమంలో సదరు బాలిక ఆయన జేబులో నుంచి రూ.50వేలు తస్కరించింది. బాధితుడు వెంటనే తేరుకుని బాలికను గుర్తించి చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అంతలోనే అక్కడికి వచ్చిన పోలీసులు మగవేశంలో ఉన్న బాలికను అదుపులోకి తీసుకున్నారు. బాలిక దగ్గర అప్పుడే కొనుగోలు చేసిన సెల్‌ఫోన్, దుస్తులపాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ బాలిక గతంలో చిన్నచిన్న దొంగతనాల్లో దొరికిందని, వయస్సు రిత్యా మైనర్ కావడంతో వెంటనే సఖీ కేంద్రం నిర్వాహకులకు బాలికను అప్పగించినట్లు తెలుస్తోంది. -
కోలాటం కలెక్షన్
నవరాత్రి రోజుల్లో ప్రతీ యేటా దాండియాకు ఒకే విధమైన డ్రెస్ ధరించాలంటే బోర్‌గా ఉంటుంది. అలాగని సందర్భానికి తగినట్టుగా ఉండకపోతే నలుగురిలో తేలిపోయినట్టుగా ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒక ఫ్రెష్ ట్విస్ట్‌ను మీ డ్రెస్‌లకు ఇవ్వాలి. సంప్రదాయ ఫ్యాబ్రిక్స్ ఎన్నో అందుబాటులో ఉన్న నేటి రోజుల్లో అద్దాలు కుట్టినవి ఔటాఫ్ స్టైల్ అనిపిస్తే కొద్దిపాటి మార్పులతోనే మీ డ్రెస్సింగ్ స్టైల్‌ను ఆకర్షణీయంగా రూపుకట్టవచ్చు. నవరాత్రి వేడుకలలో కోలాటానికి కొత్త కళ తీసుకురావచ్చు. పుల్కారి వర్క్ రంగులతో చూపరులను ఇట్టే అట్రాక్ట్ చేస్తుంది పుల్కారి వర్క్. ఇది పంజాబీ ఎంబ్రాయిడరీ. ఇండో-వెస్ట్రన్ దుస్తులకు సరిగ్గా సరిపోయే వర్క్. కుర్తీలకు, చోళీలకు, ప్లెయిన్ లెహంగాలకు, స్ట్రెయిట్ ప్యాంట్స్‌కు.. ఈ వర్క్ బాగా నప్పుతుంది. ఈ వర్క్ దుపట్టా , లెహంగా అంచులుగా డిజైన్ చేయించుకున్నా మీ చుట్టూ ఉన్నవారి లుక్స్ మీ వైపు తిరగకుండా ఉండవు. కట్‌వర్క్ లాంగ్, షార్ట్ జాకెట్స్‌ను కట్‌వర్క్‌తో మెరిపిస్తే వేడుకలలో హైలైట్ కాకండా ఉండరు. కుర్తా లేదా అనార్కలీ జాకెట్ కట్‌వర్క్ ఉన్నది ఎంచుకుంటే సింపుల్‌గా అనిపించడమే కాదు విభిన్నంగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది సరైన ఎంపిక కూడా అవుతుంది. షిమ్మర్ ఫ్యాబ్రిక్‌ని కట్వర్క్కు ఎంచుకుంటే మరింత ఆకర్షణీయంగా కనపడతారు. గోటాపట్టి ఈ వర్క్ హెవీగా ఉన్నప్పటికీ లైట్‌వెయిట్‌గా చూడటానికి రిచ్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద అంచులను లెహంగాలకు, అనార్కలీ కుర్తాలను వాడితే పండగ కళ వచ్చేసినట్టే. నిలువు, అడ్డం పట్టీలుగా ఫ్లోర్ లెంగ్త్ స్కర్ట్‌లకు గోటాపట్టిని వాడి చూడండి. - ఎన్.ఆర్. -
గోళ్లు ఆరోగ్యం
బ్యూటిప్స్ ఏదైనా ఫంక్షన్‌కు అటెండ్ అవ్వాలంటే అమ్మాయిలు ముఖసౌందర్యానికే కాదు చేతిగోళ్లకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. ఏ రంగు డ్రెస్ వేసుకుంటే ఆ రంగు నెయిల్ పాలిష్ వేసుకోవడం నడుస్తున్న ప్రస్తుత ట్రెండ్. అలా రోజుకు గోళ్లకు రంగు వేసేటప్పుడు ఒక్కసారి వాటిని గమనించండి. వాటి ఆకారంలో ఏదైనా తేడా కొడుతుందా అని. ఎందుకంటే మీ గోళ్లను చూసి మీ ఆరోగ్య సమస్యలను పసిగట్టొచ్చన్న విషయాన్ని గుర్తించండి.. ఇదిగో ఇవే ఆ గుర్తులు.. పసుపు పచ్చగా మారితే గోళ్లు పసుపు రంగులో ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. అది యెల్లో నెయిల్ సిండ్రోమ్ అయ్యుండొచ్చు. దాని వల్ల రంగు మారడమే కాకుండా మందంగా, పెరుగుదల లేకుండా ఉంటాయి. అది మధుమేహం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. ఎరుపు గీతలు ఇది చాలా ప్రమాదకరమైనది. గోళ్ల కింద ఎరుపు లేక బ్రౌన్ గీతలు వస్తుంటే గుండె సంబంధిత వ్యాధి (హార్ట్ వాల్వ్ ఇన్ఫెక్షన్) మీకు ఉండే అవకాశం ఉందని తెలుసుకోండి. అంతేకాకుండా అలా ఉంటే క్లబ్బింగ్ నెయిల్స్ అనే వ్యాధి కూడా అయ్యుండొచ్చు. దాని వల్ల గీతలే కాదు గోరు చిగురు వెడల్పు అవడం, గోరు పైకి ఉబ్బినట్టు కనిపిస్తుంది. తెల్ల మచ్చలు సాధారణంగా చాలా మందికి ఈ తెల్ల మచ్చల సమస్య ఉంటుంది. ఇవి ఒకటి లేక రెండు గోళ్లపై కనిపిస్తాయి. టెక్నికల్‌గా దీన్ని లికొనేషియా అంటారు. ఇది కాల్షియం లోపం కారణంగా వస్తుంది. దీనికి రోజూ పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే నెయిల్ పాలిష్ పడక కూడా చాలామందికి ఈ ఇన్ఫెక్షన్ రావచ్చు. -
ఇంగిల్పీసువారి... సింగిల్పీసు!
ఈమధ్య మన దృష్టి అంతా ఇంగ్లిషువారి మీదే ఉన్నట్టు ఉంది. మోడ్రన్ లుక్, సెక్సీ లుక్, ప్రెట్టీ లుక్, మెట్రో లుక్... ఎదుటివారి లుక్స్ కొల్లకొట్టేయడానికి వారి నుంచే బోలెడన్ని మార్గాలు వెతుకుతున్నారు. దాంట్లో భాగంగా వచ్చిందే ఈ సింగిల్పీసు... అదేనండి సింగిల్‌పీస్ క్లాత్‌తో డిజైన్ చేసిన మ్యాక్సీ స్టైల్. పొడవాటి గౌను, ఫ్రాక్ అని పిలిచే ఈ డ్రెస్ పాదాలను తాకుతున్నట్టుగా ఉంటుంది. ఇది ఫార్మల్గా వేసుకోదగిన డ్రెస్కాదు.పాశ్చాత్యపార్టీలకు బాగా నప్పే డ్రెస్. పై నుంచి కిందవరకు వదులుగా ఉండే ఈ డ్రెస్ నైటీకి తక్కువ, ఫ్రాక్‌కి ఎక్కువ అన్నట్టు ఉంటుంది. 70ల కాలం నుంచి నేటి వరకు ఈ స్టైల్ ప్రపంచమంతా తన హవా కొనసాగిస్తూనే ఉంది. ఇంగ్లిష్ దొరసానుల గౌన్‌గా ప్రసిద్ధి చెందిన మ్యాక్సీలో ఇటీవల మన బాలీవుడ్, టాలీవుడ్... యువతారలు తెగ మెరిసిపోతున్నారు. వీటిలోనే చిన్నా చితకా మార్పులు తెచ్చి డిజైనర్లు యువతరాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. చలికాలంలో జీన్స్ జాకెట్ ధరిస్తే మ్యాక్సీ స్టైల్మరింత మోడ్రన్‌గానూ, సౌకర్యంగానూ ఉంటుంది. మూడుకాలాల్లోనూ ముచ్చటగా... దీనిని కాటన్, పాలిస్టర్.. ఏ క్లాత్తోనైనా రూపొందించవచ్చు. స్లీవ్‌లెస్ చేతులు, హాల్టర్నెక్ లైన్స్, రంగురంగుల ప్యాటర్స్తో మ్యాక్సీని అందంగా రూపుకట్టవచ్చు. వేసవిలో సౌకర్యం అనిపించే డ్రెస్ ఇప్పుడుఅన్ని కాలాల్లోనూ చిన్న చిన్న మార్పులతో స్టైల్‌గా తయారుచేస్తున్నారు. ఎందుకంటే... సులువుగా ధరించవచ్చు. చాలా చాలా సౌకర్యంగా ఉంటుంది. స్టైల్‌గా పాశ్చాత్యయువరాణుల్లా కనిపిస్తారు. ఇతర అలంకరణలేవీ అంతగా అవసరం లేదు. మూడుకాలాల్లోనూ ముచ్చటగా... పువ్వుల మ్యాక్సీ ధరిస్తే ప్లెయిన్ జాకెట్ వేసుకోండి. ప్లెయిన్ మ్యాక్సీ వేసుకుంటే పువ్వుల ప్రింట్లు ఉన్న జాకెట్‌ను ధరించండి. వర్షంలో అయితే వాటర్‌ప్రూఫ్ షూ వేసుకోండి. వింటర్కైతే లెదర్షూ ధరించండి. సమ్మర్ అయితే, ఎంచక్కా ప్లాటర్స్, శాండిల్స్ వేసుకుని, ఓ హ్యాట్పెట్టుకుంటే స్టైల్ అంతా మీదే! గుర్తుంచుకోవాలి... పాదాలను తాకుతున్నట్టుగా లేదంటే కాస్త మడమల పైకి ఉన్నా బాగుంటుంది. అంతుకుమించి పొడవు ఉండకూదు.ఛాతి వెడల్పుగా ఉన్నవారికి మ్యాక్సీ గౌన్ బాగా నప్పుతుంది.మ్యాక్సీపైన పెద్ద పెద్ద ప్రింట్లు ఉంటే డ్రెస్ చీప్‌గా లేదా, మీకు నప్పకపోవడమో ఉంటుంది. అందుకని ఎప్పుడైనా చిన్న చిన్న ప్రింట్లున్న మ్యాక్సీలను ఎంచుకోవాలి. ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకుంటే క్యాజువల్‌గా ఈవెనింగ్ వాక్స్కీ వెళ్లవచ్చు. పార్టీలకు వెళ్లినప్పుడు పెద్ద హీల్ ఉన్న చెప్పులను వేసుకోవాలి. - ఎన్.ఆర్.