నవగ్రహ దోష పరిహారాలపై విలువైన పుస్తకం
సత్ గ్రంథం
పుట్టినప్పటి నుంచి, పోయే వరకు మానవ జీవితం నవగ్రహాల ప్రభావం మీద ఆధారపడి ఉంటుందని, ప్రతిగ్రహమూ జాతకుడికి అది ఉండే స్థానాన్ని బట్టి శుభాశుభాలను అనుభవిస్తుంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అయితే నవగ్రహారాధనతో కష్టాన్ని పోగొట్టుకుని, సుఖాన్ని చిక్కించుకోవచ్చునని కూడా శాస్త్రం చెబుతోంది. పాప గ్రహబాధలు తొలగటానికి జ్యోతిష పండితులు దత్తదాసు ఒక పత్రికలో రాసిన వ్యాసాలను ఆయన తదనంతరం ఆయన శిష్యుడు, పాత్రికేయుడు పామర్తి హేమసుందర్, ‘పాపగ్రహాలు- పరిహారాలు’ పుస్తకంగా తీసుకు వచ్చారు. ఇందులో దీర్ఘకాల వ్యాధులు రావడానికి కారణం, వాటిని తొలగించుకోవడానికి పరిహారాలు, ఏయే నక్షత్రాల వారు ఏయే మంత్రాలను జపించాలి, నవరత్నధారణ ఫలితాలు, వాస్తుదోషాల నివారణ, ఎంచుకున్న రంగంలో ఎదగడానికి ఏం చేయాలి.. వంటి విషయాలను చక్కగా వివరించారు. అయితే అక్షరదోషాల విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే మరింత బాగుండేది.
- దోర్బల వి.ఆర్.
పాపగ్రహాలు- పరిహారాలు
రచన: దత్తదాసు,
పుటలు: 108, వెల రూ. 60
ప్రతులకు: భవిష్య పబ్లికేషన్స్
డి 52, మధురానగర్,
హనుమాన్ ఆలయం దగ్గర, ఎస్.ఆర్.నగర్,
హైదరాబాద్- 500 038