తప్పు తప్పే... శుద్ధ తప్పే! | Nivin Pauly- Trisha Movie from Shyama Prasad titled as Hey Jude | Sakshi
Sakshi News home page

తప్పు తప్పే... శుద్ధ తప్పే!

Published Sun, Jul 9 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM

త్రిషకు సీన్‌ వివరిస్తున్న శ్యామ్‌ ప్రసాద్‌

త్రిషకు సీన్‌ వివరిస్తున్న శ్యామ్‌ ప్రసాద్‌

ఆయన చెబుతున్నారు! త్రిష వింటున్నారు! ఒక్క మాటకు కూడా ఎదురు చెప్పడం లేదు. ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేసేస్తున్నారు. ఇంతకీ, త్రిషను అంతలా కంట్రోల్‌లో పెట్టుకున్న ఆయనెవరు? అంటే... ఫొటోలో కళ్లజోడు పెట్టుకుని, కాస్త నెరిసిన జుట్టుతో ఉన్నారు చూడండి ఆయనే! మలయాళీ దర్శకుడు శ్యామ్‌ ప్రసాద్‌. ప్రస్తుతం త్రిష హీరోయిన్‌గా ‘హే జ్యూడ్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో మలయాళ ‘ప్రేమమ్‌’ ఫేమ్‌ నివిన్‌ పౌలి హీరో. జనరల్‌గా షూటింగ్‌ లొకేషన్‌లో హీరో హీరోయిన్లు, దర్శకుడు మధ్య సీన్స్‌ గురించి డిస్కషన్స్‌ జరుగుతాయి. కానీ, ‘హే జ్యూడ్‌’ లొకేషన్‌లో అంతా వన్‌వే ట్రాఫిక్‌.

శ్యామ్‌ ప్రసాద్‌ రూటులో అందరూ నడుస్తున్నారు. సెట్‌లో ఒకరు ‘ఏంటిది? మీరేం క్వశ్చన్‌ చేయడం లేదు? డైరెక్టర్‌ బాగానే తీస్తున్నాడా?’ అని త్రిషను అడిగితే... ‘‘హి ఈజ్‌ డూయింగ్‌ వెరీ వెల్‌. ఆయన ట్రాక్‌ రికార్డు చూశావా? శ్యామ్‌ తీసిన పన్నెండు సినిమాల్లో మూడింటికి ‘బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఇన్‌ మలయాళం’ అవార్డ్స్‌ వచ్చాయి. ఆయనకు ఏడు స్టేట్‌ (కేరళ) అవార్డ్స్‌ వచ్చాయి. టాలెంట్‌ ఉన్నోడిని క్వశ్చన్‌ చేయడం కరెక్ట్‌ కాదు. తప్పు తప్పు... శుద్ధ తప్పు’’ అని చెప్పారట. అదండీ మేటర్‌!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement