జూన్ 7న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు | on june 07 the birthday celebrated | Sakshi
Sakshi News home page

జూన్ 7న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Sun, Jun 7 2015 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM

జూన్ 7న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

జూన్ 7న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: మహేష్ భూపతి (టెన్నిస్ ఆటగాడు), ఏక్తాకపూర్(టీవీ సినీ నిర్మాత)

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 3. వీరు ఈ సంవత్సరం   చదువుల్లో రాణిస్తారు. విదేశాలలో చదువుకోవడం కోసం, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, రక్షణ రంగాలలోని వారు మంచి పేరు తెచ్చుకుంటారు. రిసెర్చ్ వర్క్‌లో ఉన్న వారి పరిశోధనలు వెలుగు చూస్తాయి. గతంలో వీరు ఎలాంటి వారయినప్పటికీ, బృహస్పతి ప్రభావం వల్ల ఈ సంవత్సరం వీరి మాట తీరులో, నడతలో మంచి మార్పు వ స్తుంది. అందరి చేతా మంచి వారనిపించుకుంటారు. సంగీతం, ఇన్‌స్ట్రమెంటల్ మ్యూజిక్ రంగాలలో ఉన్న వారికి గొప్ప పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆధ్యాత్మికతపై మక్కువ పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు రాకపోయినా, జీతం బాగానే పెరుగుతుంది కాబట్టి నిరాశ పడనక్కరలేదు. అయితే వివిధ కారణాల వల్ల వీరు కొంతకాలం పాటు కుటుంబానికి, సంసార జీవనానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు.

లక్కీ నంబర్స్: 1,2,3,7,9; లక్కీ కలర్స్: వైట్, ఎల్లో, క్రీమ్, గోల్డ్; సూచనలు: దక్షిణామూర్తికి అభిషేకం, గురువులను సేవించడం, ఆవుకు సెనగలు తినిపించడం.
- డా. మహమ్మద్ దావూద్
జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement