నిత్యం కొందరికి ఆదాయానికీ వ్యయానికీ పొంతన ఉండదు. ఏదో ఒక ఇబ్బంది ముంచుకొస్తూ అప్పుల ఊబిలోకి నెట్టేసే పరిస్థితులు ఎదువుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యను అధిగమించాలంటే...
► ప్రతిరోజూ అంగారక స్తోత్రాన్ని పఠించాలి. మంగళవారం రోజున పురోహితులకు ఏడు కిలోల కందులు, ఒకటిన్నర కిలోల బెల్లం, ఎర్రని వస్త్రాలు తగిన దక్షిణతో కలిపి దానంగా ఇవ్వాలి
► సోమవారం ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్లి, శివలింగానికి వరిపిండితో అభిషేకం చేయించాలి. లేదా ఇంట్లోనే పూజామందిరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి వరిపిండితో అభిషేకం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని కనీసం పదకొండు వారాలు పాటించాల్సి ఉంటుంది
►శ్రీ లక్ష్మీనృసింహ రుణ విమోచన స్తోత్రాన్ని అనుదినం పఠిం చాలి. వీలుంటే నారసింహ క్షేత్రాన్ని దర్శించుకుని, స్వామివారికి చందనం. పూలు, పాలు, తేనె, పానకం సమర్పించాలి
► శుక్రవారం రోజున ఆకలితో ఉన్నవారు తారసపడితే వారికి తృప్తిగా భోజనం పెట్టండి. కనీసం ఐదు ఆదివారాలు ఆవుకు బెల్లం కలిపి చేసిన రొట్టెలు స్వయంగా తినిపించండి
►ఇంట్లో నగదు, విలువైన వస్తువులను భద్రపరచే బీరువా, క్యాష్‌బాక్స్ వంటి వాటిలో చిన్న సైజులో ఉండే చింతచెట్టు కొమ్మను కూడా ఉంచండి. బీరువా, క్యాష్‌బాక్స్‌లలో ఏడు డేగ ఈకలను ఉంచినా ఫలితం ఉంటుంది.
– పన్యాల జగన్నాథ దాసు
రుణబాధలు పీడిస్తున్నాయా?
Published Sun, Aug 20 2017 12:03 AM | Last Updated on Tue, Sep 12 2017 12:30 AM
Advertisement
Advertisement