సంపద, హోదా వంటివి ఎన్ని ఉన్నా, ఇంట్లో పరిస్థితులు ప్రశాంతంగా లేకపోతే ఏమాత్రం మనశ్శాంతి ఉండదు. దంపతుల మధ్య తరచు తగవులు, మనస్పర్థలు తలెత్తుతున్నట్లయితే, ఎంత సంపద ఉన్నా, జీవితంలో సంతృప్తి కొరవడుతుంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే..
♦ ప్రతిరోజూ ఉదయం గోవులకు, శునకాలకు గోధుమలతో తయారు చేసిన రొట్టెలను ఆహారంగా పెట్టండి. పక్షులకు ఆహారంగా జొన్న గింజలు వేయండి
♦ సాయంత్రం వేళ పడక గదిలో కర్పూరం వెలిగించండి. పడక గదికి తెలుపు, లేత నీలం, లేత గులాబి రంగులు మాత్రమే ఉపయోగించండి. పడక గది గోడలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు, పసుపు కలగలసిన రంగులను ఉపయోగించకండి.
♦ఆలయాలు సందర్శించేటప్పుడు ఎవరైనా వృద్ధ దంపతులు కనిపిస్తే, పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు పొందండి.
♦ దుస్తులు, పరిమళ ద్రవ్యాలు, అలంకరణ వస్తువులు వంటివి కొనాలనుకుంటే, వీలైనంత వరకు వాటిని శుక్రవారం రోజున కొనండి.
♦ ఏదైనా శుక్రవారం రోజున శివాలయాన్ని దర్శించి, ఆలయ పూజారికి కిలోన్నర బొబ్బర్లు, కిలోన్నర పంచదార, తెల్లని పంచె దానం చేయండి.
– పన్యాల జగన్నాథదాసు
మనశ్శాంతి ఉండడం లేదా?
Published Sun, Apr 22 2018 1:19 AM | Last Updated on Sun, Apr 22 2018 1:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment