బొప్పాయి పండుతో ఆరోగ్యానికి సమకూరే ప్రయోజనాల జాబితాకు అంతు లేదు. జీర్ణక్రియకు తోడ్పడటం మొదలుకొని... అది జరిగే సమయంలోనే అందులోని హానికరమైన క్రిములను తుదముట్టించడం వరకు అనేక మేళ్లు చేస్తుంది బొప్పాయి. అందులో కొన్ని...
►బొప్పాయి కంటికి మేలు చేస్తుంది. కంటికి వచ్చే మాక్యులార్ డీజనరేషన్ అనేæ కంటి జబ్బును నివారిస్తుంది. ∙ఎముకలు బలహీనంగా మారే ఆస్టియోఆర్థరైటిస్‌ను బొప్పాయి అరికడుతుంది.∙బొప్పాయి తినేవారిలో రోగనిరోధక శక్తి ఎక్కువ ∙అనేక రకాల క్యాన్సర్లతో బొప్పాయి పోరాడుతుంది ∙మహిళల్లో రుతుక్రమాన్ని చక్కబరుస్తుంది.
గర్భవతుల విషయంలో ఒక జాగ్రత్త : పండిన బొప్పాయి గర్భవతులకు మేలే అయినప్పటికీ వారికి బొప్పాయి పెట్టే విషయంలో ఒకింత జాగ్రత్త అవసరం. పూర్తిగా పండనిదీ, లేదా బాగా పచ్చిగా ఉన్న బొప్పాయిలో ‘పపాయిన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గర్భసంచిని ముడుచుకుపోయేలా చేసి కొన్నిసార్లు గర్భస్రావానికి దారితీసేలా చేయవచ్చు. అందుకే పచ్చిది, పాక్షికంగా పండినవాటిని మాత్రం వారు తినకూడదు.
జీర్ణశక్తిని పెంచే బొప్పాయి!
Published Wed, Jan 3 2018 11:43 PM | Last Updated on Wed, Jan 3 2018 11:43 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment