మెదడు వల్లే బరువు తగ్గలేరట!
పరిపరి శోధన
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోతున్నారా? అయితే, మీ మెదడులోనే ఏదో లోపం ఉన్నట్లు లెక్క అంటున్నారు జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు. మెదడులోని ‘ఆకలి’ కణాల్లో తేడా ఉంటే, ఎంత తింటున్నా ఆకలి తీరినట్లుగా అనిపించదని, అందుకే ఎడాపెడా తినేస్తూ లావెక్కిపోతారని వారు చెబుతున్నారు. మెదడులోని పారావెంట్రిక్యులర్ న్యూక్లియస్ అనే భాగం ఆకలిని నియంత్రించే ఎంజైమ్‌ను గుర్తించలేని పరిస్థితుల్లోనే ఇలా జరుగుతుందని వివరిస్తున్నారు. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని వారు చెబుతున్నారు.