డయాలసిస్ పేషెంట్లకూ ఫిజియోథెరపీ..! | Physiotherapy for both dialysis patient ..! | Sakshi
Sakshi News home page

డయాలసిస్ పేషెంట్లకూ ఫిజియోథెరపీ..!

Published Mon, Dec 14 2015 11:11 PM | Last Updated on Sun, Sep 3 2017 1:59 PM

Physiotherapy for both dialysis patient ..!

హోమియో కౌన్సెలింగ్
 
నా వయసు 35 ఏళ్లు. ఈమధ్యకాలంలో 5 కేజీల వరకు బరువు పెరిగాను. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించమన్నారు. లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలో ఏమి తెలుస్తాయి? కొవ్వులు పెరిగితే తగ్గించడానికి హోమియోలో మందులు ఉన్నాయా?
 - రమేశ్, కొండాపూర్

 
లిపిడ్స్ అనేవి కొన్ని రకాల కొవ్వులు, కొవ్వులాంటి పదార్థాలు. అవి శక్తివనరులుగా కొంతమేరకే శరీరానికి అవసరం. అవి పెరిగితే కొన్ని సమస్యలు తెచ్చిపెడతాయి. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న శారీరక, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లలోని మార్పుల వల్ల జీవప్రక్రియలో మార్పులు కొన్ని రకాల అనర్థాలకు కారణమవుతాయి. జీవన విధానంలో కృత్రిమ ఆహారాలు, మద్యపానం వంటి అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాల వల్ల కొలెస్ట్రాల్ వంటి కొవ్వులు పెరుగుతాయి. ఈ కొవ్వులలో కొన్ని రకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని... హైడెన్సిటీ లైపో ప్రోటీన్స్, లోడెన్సిటీ లైపోప్రొటీన్స్, ట్రైగ్లిజరాయిడ్స్. రక్తంలో కొవ్వుల పాళ్లు పెరిగితే గుండెజబ్బుల బారిన పడే అవకాశమూ ఉంది. ఇటీవల గుండెజబ్బుల బారిన పడేవారి సంఖ్య పెరుగుతుండటం వల్ల రక్తంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్స్‌పై చాలామంది దృష్టిపెడుతున్నారు. లిపిడ్ ప్రొఫైల్ అనే పరీక్షతో రక్తంలోని కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవచ్చు. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌లో ఏడు రకాల ఫలితాలు తెలుస్తాయి.

అవి... 1. మొత్తం లిపిడ్స్, 2. సీరమ్ కొలెస్ట్రాల్ 3. సీరమ్ హెచ్‌డీఎల్, 4. మొత్తం కొలెస్ట్రాల్, హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ నిష్పత్తి, 5. సీరమ్ ట్రైగ్లిజరైడ్స్, 6. సీరమ్ ఫాస్ఫోలిపిడ్స్ 7. ఎలక్ట్రోఫొరెటిక్ ఫ్రాక్షన్మొత్తం కొలెస్ట్రాల్ (టోటల్ కొలెస్ట్రాల్): అన్ని కొవ్వు పదార్థాలు కలుపుకొని నిర్ణీత మోతాదులో ఉండాలి. టోటల్ కొలెస్ట్రాల్‌లో పరీక్ష ద్వారా శరీరంలోని అన్ని రకాల కొవ్వుల సంఖ్య తెలుస్తుంది.హైడెన్సిటీ కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్): దీన్నే మంచి కొలెస్ట్రాల్ అని కూడా అంటారు. మన రక్తంలో దీని సాధారణ విలువ 40-60 ఉండాలి. ఇది గుండె రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. అందుకే దీన్ని మంచి కొలెస్ట్రాల్ అంటారు.

లో డెన్సిటీ కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్): దీన్ని చెడు కొలెస్ట్రాల్ అని అంటారు. దీని సాధారణ విలువ 140-150 లోపు ఉండాలి.
 4. ట్రైగ్లిజరైడ్స్ : ఇవి కూడా ఒక రకమైన కొవ్వులు.  కొవ్వులను తగ్గించడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. కాల్కేరియా కార్బ్, ఫైటోలిక్కా, కొలెస్ట్రినమ్, గ్రాఫైటిస్, కాక్టస్, రావుల్ఫియా సర్పెంటినా వంటివి ఇందులో కొన్ని. నిపుణులైన వైద్యుల ప్రర్యవేక్షణలో క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితం లభిస్తుంది.
 
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి
హైదరాబాద్
 
ఫిజియోథెరపీ కౌన్సెలింగ్
 
నేను క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)తో బాధపడుతున్నాను. డయాలసిస్ మీద ఉన్నాను. ఫిజియోథెరపీ చేయించుకొమ్మని నాకు డాక్టర్లు సలహా ఇచ్చారు. కిడ్నీ రోగులకు ఫిజియోథెరపీ ఎలా ఉపయోగపడు తుంది?
 - నిరంజన్, భీమవరం

డయాలసిస్ ప్రక్రియను అనుసరించే పేషెంట్లలో శరీరంలో చురుకుదనం తక్కువ. వీళ్లలో కదలికలు మందకొడిగా ఉండవచ్చు. డయాలసిస్ చేయించుకునే రోగుల్లో అలసట, బలహీనత, నడక కష్టం కావడం, కదలికలూ కుంటుపడటం వంటివి జరుగుతాయి. ఇలాంటివాళ్లలో జీవన నాణ్యత మెరుగుపరచడానికి ఫిజికల్ థెరపీ అవసరమవుతుంది. ఇలాంటి వారిలో శరీరక మానసిక బలాలను, వారి అవయవ సామర్థ్యాలనూ, కదలికలలో చురుకుదనాన్ని పెంచ డానికి ఫిజికల్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఒక కిడ్నీ జబ్బులు ఉన్నవారిలో శారీరకమైన కదలికలూ తగ్గడం వల్ల వాళ్ల బరువు పెరిగి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. నిద్రలేమి కలగవచ్చు. డిప్రెషన్‌కూ గురికావచ్చు. అంందుకే ఫిజికల్ థెరపీపై అవగాహన కలగజేయడం వల్ల బరువు నియంత్రణలో ఉండటం, మంచి నిద్రపట్టడం, డిప్రెషన్ దూరం కావడం వంటి ప్రయోజనాలు ఒనగూరుతాయి.

ఇందుకోసం రోగిని భౌతికంగా చూడటంతో పాటు అతడిలోని కదలికలను అంచనా వేయడానికి బెర్గ్ బ్యాలెన్స్ పరీక్షలు, టైమ్‌డ్ అప్ అండ్ గో, ఆరు నిమిషాల నడక వంటి పరీక్షలు చేస్తారు. రోగిలోని జీవన నాణ్యతను పరీక్షించడానికి ఎస్‌ఎఫ్-36 వంటి పరీక్షలూ నిర్వహిస్తారు. ఈ కార్యకలాపాల నిర్వహణ కోసమే... ఈ రోగుల్లో ఫిజియో థెరపీ నిపుణుల భూమిక పెరుగుతుంది. డయాలసిస్ రోగులను శారీరకంగా చురుగ్గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని అధ్యయనాలు నిరూపించాయి. ఇది శరీరంలోని నిర్దిష్టమైన కొన్ని కండరాలకు ఎక్సర్‌సైజ్ ఇచ్చేదిలా కాకుండా మొత్తం అవయవాలన్నింటికీ వ్యాయామాలు కలిగించేలా, రోగిని మానసికంగానూ దృఢపరిచేదిగా ఫిజియో కార్యక్రమాలు ఉంటాయి. ఇక ఈ ప్రక్రియలను ఒక క్రమపద్ధతిలో నిర్వహించడానికి తప్పనిసరిగా ఫిజియో నిపుణులు కావాలి. అయితే ఇది వ్యాధి తీవ్రతను బట్టి రోగి నుంచి రోగికి మారుతుంది. కాబట్టి మీకు నిర్దిష్టంగా ఏ వ్యాయామ ప్రక్రియలు అవసరమో తెలుసుకోడానికి ఒకసారి ఫిజియో నిపుణుడిని సంప్రదించండి.
 
డాక్టర్ ఆర్. వినయ కుమార్
హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్
ఫిజియోథెరపీ
కేర్ హాస్పిటల్స్
బంజారాహిల్స్, హైదరాబాద్.
 
పీడియాట్రిక్ కౌన్సెలింగ్

 
మా పాపకు ఐదేళ్లు. రెండేళ్లున్నప్పుడు పాప ఒంటి మీద మచ్చలు, కురుపులు వచ్చాయి. అది చికెన్ పాక్స్ అని అప్పట్లో డాక్టర్ చెప్పారు. ఇప్పుడు మళ్లీ పాపకు ఒంటి మీద అనేక భాగాల్లో చిన్న చిన్న కురుపులు వస్తున్నాయి. డాక్టర్‌కు చూపిస్తే ఇది కూడా చికెన్ పాక్స్ అని చెప్పారు. చికెన్‌పాక్స్ మళ్లీ, మళ్లీ వస్తుందా? మా పాప విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించండి.
 - జయంత్‌రావు, కొండపల్లి

మీ పాపను చూడకుండా ఆమెకు వచ్చింది చికెన్ పాక్స్ అని నిర్ధారణగా చెప్పలేకపోయినా అది చికెన్ పాక్స్ అయ్యే అవకాశం మాత్రం ఉందని చెప్పవచ్చు. చిన్నపిల్లలలో చికెన్ పాక్స్ చాలా సాధారణం. అయితే ప్రాచీన గ్రంథాలు, శాస్త్రవేత్తల, గతంలో నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఒకసారి చికెన్ పాక్స్ వస్తే జీవితంలో మళ్లీ రాదని ఒక భావన. అది అపోహ మాత్రమే. నిజం కాదు. చికెన్ పాక్స్ ఒకటికన్నా ఎక్కువ సార్లు వచ్చే అవకాశం ఉంది. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా (ఇమ్యూనో కాంప్రమైజ్డ్) ఉన్న సమయంలో ఇది రావచ్చు. ఈ మధ్య కాలంలో వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూన్ కాంపిటెంట్) ఉన్న వాళ్లలో కూడా చికెన్ పాక్స్ కనిపిస్తోంది. ఒకరికే 2 -5 సార్లు ఈ జబ్బు వచ్చిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే ఇలా మాటిమాటికి ఇన్ఫెక్షన్ రావటానికి తాత్కాలిక ఇమ్యూనిటీ లోపాలు కారణం అయ్యిండవచ్చు. అయితే ఇలా ఒకటి కన్నా ఎక్కువ సార్లు వస్తున్నప్పుడు పిల్లలలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటోందని భావించి, వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉండవచ్చు. అయితే కొంతమంది పిల్లల్లో వ్యాక్సిన్ తీసకున్నా చికెన్‌పాక్స్ కనిపించవచ్చు.
 చికెన్ పాక్స్ తిరగబెట్టకుండా ఉండటానికి కొన్ని సూచనలు/జాగ్రత్తలు
      
పిల్లలకు తప్పకుండా వాక్సినేషన్ చేయించండి. రెండు డోసులు తీసుకోవడం వల్ల దీన్ని ఇంకా బాగా నిరోధించవచ్చని నిపుణులు     సూచిస్తున్నారు. మీరు ఒకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా మీ డెర్మటాలజిస్టును కలిసి తగు సలహా తీసుకోగలరు.
 
డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్
రోహన్ హాస్పిటల్స్
విజయనగర్ కాలనీ
హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement