గర్భవతులకు అది నిజంగానే ‘తలనొప్పి’!
పరిపరి శోధన
గర్భవతుల్లో వచ్చే తలనొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మరీ ముఖ్యంగా నాలుగు నుంచి ఆరు నెలలు, ఏడు నుంచి తొమ్మిది నెలల గర్భం (సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్) సమయంలో వచ్చే తలనొప్పులను ఏమాత్రం ఉపేక్షించకూడదు. ఇక ఒకవేళ గర్భంతో ఉన్నవారికి రక్తపోటు గనక పెరిగితే దాన్ని ఆ విషయాన్ని కాస్తంత తీవ్రంగానే పరిగణించాలంటున్నారు నిపుణులు. గతంలో తలనొప్పిగానీ, హైబీపీగాని లేని మహిళల్లో ఇలాంటి లక్షణం కనిపిస్తే అది గర్భవతుల్లో ఫిట్స్ (కన్వల్షన్స్)కు దారితీసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
‘న్యూరాలజీ’ అనే మెడికల్ జర్నల్‌లో తమ అధ్యయనాన్ని ప్రచురించారు. ఈ తలనొప్పుల్లో చాలావరకు మైగ్రేన్ కావచ్చనీ, అయితే 51 శాతం మందిలో గర్భధారణకు సంబంధించిన కాంప్లికేషన్స్‌తో వచ్చిన తలనొప్పిగా గుర్తించినట్లు వివరించారు. గర్భం ధరించిన వారిలో కనిపించే హైబీపీ, మూత్రంలో అధికప్రోటీన్ (ప్రీ-ఎక్లాంప్సియా) వల్ల వచ్చే తలనొప్పి కూడా కావచ్చనీ, అందుకే నిర్లక్ష్యం కూడదని హెచ్చరిస్తున్నారు.