వందేళ్లు బతకాలని అందరూ కోరుకుంటారుగానీ.. ముసలి వయసులో వచ్చే ఆరోగ్య సమస్యలు గుర్తుకొస్తే మాత్రం.. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అందుకేనేమో.. బ్రౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆయుష్షును పెంచడం కాకుండా, బతికున్నంత కాలమూ ఆరోగ్యం ఉండటం ఎలా? అన్న అంశంపై దృష్టి పెట్టారు. ఈ విషయంపై ఈగలపై కొన్ని ప్రయోగాలు చేస్తే.. సిర్ట్4 అనే ప్రొటీన్‌తో ఇది సాధ్యమని తెలిసింది. ఈ ప్రొటీన్ అటు జీవక్రియలతోపాటు.. వయసుతోపాటు వచ్చే వ్యాధుల్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో సిర్ట్4 ప్రొటీన్‌ను ఆరోగ్యం కోసం ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకునేందుకు ఈగలపై పరిశోధనలు జరిగాయన్నమాట.
సిర్ట్4 ప్రొటీన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఈగల ఆయుష్షు 20 శాతం ఎక్కువ కావడంతోపాటు ఆరోగ్యంగానూ ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రొటీన్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసిన ఈగలను పరిశీలిస్తే ఆయుష్షు 20 శాతం వరకూ తగ్గినట్లు తెలిసింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఉపవాసమున్నప్పుడు సిర్ట్4 ప్రొటీన్ కణాలకు అవసరమైన ఇంధనాన్ని అందిస్తూందని.. ఈ ప్రొటీన్ తక్కువ ఉన్న ఈగలు సాధారణ ఈగల కంటే వేగంగా చచ్చిపోయాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త స్టీఫెన్ హెల్‌ఫాండ్ తెలిపారు.
ఆ ప్రొటీన్‌తో వందేళ్లు, ఆరోగ్యం కూడా!
Published Wed, Jan 31 2018 12:37 AM | Last Updated on Wed, Jan 31 2018 4:27 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment