బరువు తగ్గడం అంత సులువైన పనేంకాదు. అందుకు చాలా ఓపిక, పట్టుదల, సమయం అవసరమౌతుంది. సమతుల ఆహారం, ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా ఏ విధంగా బరువు తగ్గొచ్చో ప్రముఖ నూట్రీషనిస్ట్ రూపాలి దత్తా ఈ కింది చిట్కాల ద్వారా సూచిస్తున్నారు. అవేంటో చేసేద్దామా..
ప్రొటీన్లు
బరువు తగ్గేందుకు ఉపయోగపడే పోషకాల్లో ప్రొటీన్లు చాలా ముఖ్యమైనవి. గుడ్డు, పప్పు, చికెన్, తృణ ధాన్యాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లోని మాంసకృత్తులు శరీరంలో అధిక సమయం నిల్వ ఉండటం వల్ల జంక్ ఫుడ్ లేదా ఇతర రూపాల్లో బయటినుంచి క్యాలరీలను తీసుకోవడం అదుపుచేయవచ్చు.
ఫైబర్
జీవ క్రియ సక్రమంగా ఉంటే బరువు తగ్గడం అంత కష్టమేమీ కాదు. ఫైబర్ (పీచు పదార్ధాలు) ఎక్కువగా ఉంగే ఆహారం తినడం వల్ల జీర్ణ వ్యవస్థ, జీవక్రియ మెరుగుపరచడానికి, బరువును వేగంగా తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే నిపుణులు బరువు తగ్గాలనుకునే వారికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోమని సూచిస్తుంటారు. ఆకుపచ్చ కూరగాయల్లో, డ్రైఫ్రూట్స్, తృణ ధాన్యాలు, పప్పు దినుసులు మొదలైన వాటిల్లో ఫైబర్ నిండుగా ఉంటుంది.
ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు
కొవ్వులేని ఆహారం తీసుకుంటే వేగంగా బరువు తగ్గొచ్చని మీరనుకుంటే అది కేవలం అపోహ మాత్రమే.ఎందుకంటే మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే తగుమోతాదులో మంచి కొవ్వులు అందిచే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అవసరం అవుతాయి. చేప, డ్రైఫ్రూట్స్, ఆకు కూరల్లో ఇవి నిండుగా ఉంటాయి.
విటమిన్ ‘సి’
శరీరం సక్రమంగా పనిచేయాలంటే హానికారక ద్రావణాలను ఎప్పటికప్పుడు బయటికి పంపించెయ్యాలి. కాబట్టి యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే జీవాణువిషాలను బయటకి పంపి, ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ల నుంచి శరీరాన్ని కాపాడుతాయి. విటమిన్ ‘సి’ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కేవలం విషహరణానికి మాత్రమేకాక బరువు తగ్గే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుంది. ఆల్మా, ఆరెంజ్.. ఇతర సిట్రస్ పండ్లలో విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది.
పొటాషియం
జీవక్రియను వేగవంతం చేయండంలో పొటాషియం కూడా కీలకంగా వ్యవహరిస్తుంది. ఇది బరువు తగ్గడానికి మరింత సహాయపడుతుంది. డ్రైఫ్రూట్స్, శనగలు, అవిసెగింజలు, రాజ్మా.. వంటి ఆహార పదార్ధాల్లో పొటాషియం దొరుకుతుంది.
ఐరన్
బరువు తగ్గించేందుకు ఐరన్ ఉపయోగపడుతుందని మీకు తెలుసా? అవునండీ.. ఇది ఐరన్ లోపాన్ని నివారించడమేకాకుండా, శరీర కండరాలకు, కణాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఇంకా.. శరీరంలోని కొవ్వును హరించడానికి సహాయపడుతుంది. బీట్‌రూట్, రొయ్యలు, డ్రైఫ్రూట్స్ వంటి ఆహార పదార్ధాల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.
జింక్
జింక్ పుష్కలంగా ఉండే ఆహారంతో కూడా అధికబరువుకు చెక్ పెట్టొచ్చు. బాదం, నువ్వులు, పప్పు, పన్నీర్ మొదలైన వాటిల్లో జింక్ అధికంగా ఉంటుంది.
ఈ ఆహారపు అలవాట్లతో శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతోపాటు బరువును వేగంగా తగ్గించుకోవచ్చని రూపాలి దత్త సూచిస్తున్నారు.
చదవండి:
Weight Loss: ప్రతి ఉదయం ఈ డ్రింక్ తాగారంటే.. మీరే ఆశ్చర్యపోతారు!!
Comments
Please login to add a commentAdd a comment