మినుముల్లో ప్రోటీన్లు ఎక్కువ. అవి కండరాల రిపేర్లకు ఉపయోగపడతాయి. అందుకే గాయాలైనవారిలో అవి త్వరగా తగ్గడానికి మినుములు మంచి ఆహారం. అంతేగాక మినుములు రోగనిరోధకశక్తిని పెంచి, అనేక వ్యాధులను నివారించడంతో పాటు ఒంటికి బలాన్నీ సమకూరుస్తాయి. మినుములతో కలిగే ప్రయోజనాల్లో కొన్ని...
♦ మినుముల్లో 72 శాతం పీచు ఉంటుంది. అందుకే అవి మలబద్దకాన్ని నివారిస్తాయి. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలను తొలగిస్తాయి. డయేరియా, డిసెంట్రీ వంటి సమస్యలు ఉన్న వారు మందులకు బదులు మినుముతో చేసిన వంటకాలు తింటే ఆ సమస్య దూరమవుతుందని ఆహార నిపుణుల సిఫార్సు.
♦ మినుముల్లోని పీచు ఆహారంలోని చక్కెరను మెల్లగా విడుదలయ్యేలా చూస్తుంది. అందుకే డయాబెటిస్ సమస ఉన్నవారికి మినుములు మంచి ఆహారం.
♦ మినుములు కీళ్లనొప్పులనుంచి ఉపశమనం కలిగిస్తాయి.
గాయాలను త్వరగా నయం చేసే మినుములు!
Published Mon, Jan 22 2018 1:27 AM | Last Updated on Mon, Jan 22 2018 1:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment