రెడ్‌క్రాస్‌కు నోబెల్ శాంతి పురస్కారం | Red Cross to the Nobel Peace Prize | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌కు నోబెల్ శాంతి పురస్కారం

Published Sun, Nov 8 2015 11:30 PM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM

రెడ్‌క్రాస్‌కు  నోబెల్ శాంతి పురస్కారం

రెడ్‌క్రాస్‌కు నోబెల్ శాంతి పురస్కారం

ఆ నేడు 9 నవంబర్, 1944
 
యుద్ధంలో గాయపడిన సైనికులకు, జబ్బుపడ్డ రోగులకు, ప్రకృతి విపత్తుల కారణంగా నిరాశ్ర యులైన వారికి చేస్తున్న సేవలకు గాను ది ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్‌క్రాస్‌కు నోబెల్ శాంతి పురస్కారం లభించింది. రెడ్‌క్రాస్‌కు ఈ అవార్డు దక్కడం ఇది రెండోసారి. అంతకుముందు అంటే 1917లో ఒకసారి నోబెల్ శాంతి పురస్కారం లభించింది. రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంగా గాయపడిన సైనికులను చికిత్సా శిబిరాలకు తరలించి, మెరుగైన చికిత్స అందించడం, నిరాశ్రీతులకు ఆశ్రయం కల్పించడం వంటి సేవలతో 1944లో మరోసారి, ఆ తర్వాత అంటే 1963లో మరోసారీ రెడ్‌క్రాస్‌కు ఈ విశిష్ట పురస్కారం లభించింది.

స్విట్జర్లాండ్‌కు చెందిన హెన్రీ డూనట్ సేవాదృక్పథంతో రెడ్‌క్రాస్ సొసైటీని స్థాపించిన సంగతి తెలిసిందే. . స్థాపించిన అతి కొద్దికాలంలోనే కొన్ని మిలియన్ల మంది సభ్యులతో, 189 సొసైటీలతో విస్తరిస్తూ వచ్చింది రెడ్‌క్రాస్. అనేక దేశాలలోని సొసైటీలతో కలుపుకుని ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ సొసైటీ రూపొందింది.
 

Advertisement

పోల్

Advertisement