పాక్ నాయకులకు మలాలా ప్రశ్న
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పాలకులు ఉగ్రవాదంపై ఎందుకు నోరు మెదపడం లేదని నోబెల్ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్‌జాయ్ ప్రశ్నించారు. శనివారం ఆమె ఇండియా టుడే టీవీ చానల్‌తో మాట్లాడుతూ... ‘స్వాత్ లోయలో తీవ్రవాదంపై పాక్ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు? బాలికలకు విద్యను నిరాకరిస్తే వారెందుకు మాట్లాడటం లేదు?’ అని ప్రశ్నించారు. బెనజీర్ భుట్టోలాగా మీరూ ప్రధాని కావాలనుకుంటున్నారా? అని అడిగినపుడు... ‘జనం కోరుకుంటే, వాళ్లు ఓటేస్తే అవుతాను’ అని బదులిచ్చారు.
ఉగ్రవాదంపై మాట్లాడరేం?
Published Sun, Oct 4 2015 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 10:23 AM
Advertisement