ఒకసారి ఒక రుషి గాఢమైన సమాధి స్థితిలో ఒక తోవ పక్కన పడి ఉన్నాడు. ఒక దొంగ ఆ దోవలో వెళుతూ, ఆ రుషిని చూసి ఇలా ఆలోచించాడు. ‘‘వీడు కూడా దొంగ అయి ఉంటాడు. నిన్న రాత్రి కొన్ని ఇళ్లలో దొంగతనాలు చేసి అలసిపోయి ఇక్కడ పడి నిద్రపోతున్నాడు. ఈపాటికి పోలీసులు వీడికోసం వెతుకుతూ ఉండి ఉంటారు. వాళ్లు వచ్చేలోపలే నేను పారిపోవడం మేలు’’అనుకుని ఆ దొంగ అక్కడినుంచి పారి పోయాడు. కాసేపటి తర్వాత ఒక తాగుబోతు అక్కడికి తూలుకుంటూ వచ్చాడు. రుషిని చూసి ‘‘ఏరా! తాగి పడిపోయావా? నన్ను చూడరా! ఎంత తాగినా ఎలా నిలబడి ఉన్నానో!’’ అన్నాడు.
చివరిగా అక్కడికి ఇంకొక సాధువు వచ్చి ఒక గొప్ప రుషి సమాధిస్థితిలో అక్కడ పడి ఉన్నాడని గ్రహించాడు. ఆ రుషి పక్కనే కూర్చుని ఆయన పాదాలు వత్తడం ప్రారంభించాడు. ప్రాపంచిక సంస్కారాలు నిజమైన ఆధ్యాత్మికతను, పవిత్రతను గుర్తించకుండా చేస్తాయి. అదెలాగంటే, పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా, ఒక మనిషి ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిని బట్టే ఎదుటివారిని అంచనా వేస్తాడని చెప్పడానికి శ్రీ రామకృష ్ణపరమహంస ఈ కథను శిష్యులతో చెప్పారు.
సంస్కార బలం
Published Tue, Nov 27 2018 12:11 AM | Last Updated on Tue, Nov 27 2018 12:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment