సాక్షి ‘ఫ్యామిలీ’ గెస్ట్ ఎడిటర్‌గా తమన్నా | sakshi 'family' Guest Editor Tamanna | Sakshi
Sakshi News home page

సాక్షి ‘ఫ్యామిలీ’ గెస్ట్ ఎడిటర్‌గా తమన్నా

Published Thu, Mar 24 2016 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

సాక్షి ‘ఫ్యామిలీ’   గెస్ట్ ఎడిటర్‌గా తమన్నా

సాక్షి ‘ఫ్యామిలీ’ గెస్ట్ ఎడిటర్‌గా తమన్నా

హాయ్ రీడర్స్..


షూటింగ్ షెడ్యూల్ నుంచి బయటికొచ్చి ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు అది సమాజానికి పనికొచ్చే పనే అయుండాలని చాలావరకు మా సినిమా వాళ్లం అనుకుంటూ ఉంటాం. ప్రజలు చూపిన ప్రేమ వల్లే కదా మేము ఇంతగా పాపులర్ అయింది. మా గొప్పదనం కంటే కూడా వాళ్ల అభిమానమే ఎక్కువని నేను అనుకుంటాను. కానీ సమాజ సేవలో నిజంగా లీనం అయిపోయి ఉండే వ్యవస్థ.. నాకు తెలిసి.. ఈ రోజుల్లో మీడియానే. మీడియా వాళ్లకు ప్రతిరోజూ ఒక పోరాటమే. ప్రతిరోజూ ఒక దీక్షే.

 
కొత్తగా వచ్చినా, ఎనిమిదేళ్లలోనే మంచి పేరు సంపాదించుకున్న ‘సాక్షి’ పేపర్ తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’ నన్ను గెస్ట్ ఎడిటర్‌గా ఆహ్వానించినప్పుడు దాన్నొక గొప్ప గౌరవంగా నేను భావించాను. నాకు తెలుగులో ప్రావీణ్యం లేకపోయినా మీడియా మీద ఉన్న అపారమైన గౌరవంతో గెస్ట్ ఎడిటర్‌గా ఉండేందుకు ఒప్పుకోవడం అనే సాహసం చేశాను. (నవ్వుతూ). ‘సాక్షి’ పాఠకులకు, ‘సాక్షి’ యాజమాన్యానికి, ‘సాక్షి’ని పోరాట పటిమతో పరుగులు తీయిస్తున్న జర్నలిస్టులకు, సిబ్బందికి నా అభినందనలు.

 - తమన్నా,హీరోయిన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement